వైఎస్సార్‌ను చూసి నేర్చుకోండి: జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌ను చూసి నేర్చుకోండి: జగన్

వైఎస్సార్‌ను చూసి నేర్చుకోండి: జగన్

Written By ysrcongress on Sunday, January 22, 2012 | 1/22/2012

దివంగత మహానేత వైఎస్సార్ మరణం తర్వాత రాష్ర్ట పరిస్థితులు మారిపోయాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ అన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకునే నేతలే కరువయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా ఓదార్పుయాత్రలో భాగంగా దాచేపల్లి మండలం నారాయణపురంలో ఆదివారం రాత్రి జరిగిన బహిరంగ సభలో అశేష జనాన్ని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. 

వ్యవసాయం చేస్తే ప్రాణం పోతుందని రైతన్న భయపడే దుస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. స్కాలర్‌షిప్‌లు అందక పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నా పాలకులకు పట్టడంలేదని విమర్శించారు. ఇంత దౌర్భగ్య స్థితిలో రాష్ట్రం ఉంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షానికి మాత్రం ఏమీ పట్టడం లేదన్నారు. మహానేత చనిపోయి రెండేళ్లయినా చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. రెండెకరాల బాబు వేల కోట్లు ఎలా సంపాదించారని సూటిగా ప్రశ్నించారు. 

చంద్రబాబుకు సత్తా ఉంటే తన సొంత ఆస్తులపై సీబీఐతో విచారణ చేయించుకోవాలని జగన్ సవాల్ విసిరారు. తాను ఢిల్లీతో పోరాటం చేస్తుంటే, చంద్రబాబు ఢిల్లీతో కుమ్మక్కయి పోరాటం చేస్తున్నారని ఆరోపించారు. పేదవాడి గుండెచప్పుడు తెలుసుకున్న ఘనత వైఎస్సార్‌దేనని అన్నారు. చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో ఎలా బతికుండాలో దివంగత మహానేత వైఎస్సార్‌ను చూసి నేర్చుకోవాలని కాంగ్రెస్, టీ డీపీలకు జగన్ హితవు పలికారు.
  
గుంటూరు జిల్లా ఓదార్పుయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కాట్రపాడు చేరుకున్నారు. కాట్రపాడులో మహానేత వైఎస్‌ఆర్ ఆకస్మిక మృతితో ప్రాణాలు కోల్పోయిన రెడ్డిచర్ల కృష్ణంరాజు కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. కృష్ణంరాజు కుటుంబాన్ని కలుసుకొని వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఎల్లవేళలా వారికి అండగా ఉంటానని జగన్ వారికి హామి ఇచ్చారు. 

Share this article :

0 comments: