వైఎస్ లక్ష్యసాధనకే ‘రైతు దీక్ష’! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ లక్ష్యసాధనకే ‘రైతు దీక్ష’!

వైఎస్ లక్ష్యసాధనకే ‘రైతు దీక్ష’!

Written By ysrcongress on Sunday, January 15, 2012 | 1/15/2012

భవిష్యత్తులో వ్యవసాయ రంగానికి, రైతు సంక్షేమానికి పథనిర్దేశం చేయడంలో వైఎస్ మార్గాన్నే జగన్ మోహన్‌రెడ్డి తు.చ. తప్పకుండా అనుసరిస్తారని ఆయన ఆచరణ స్పష్టం చేస్తున్నది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని సమరశీల పార్టీగా జగన్ ముందుకు తీసుకెళ్లడం ప్రజలలో నూతనోత్సాహాన్ని నింపుతున్నది. చంద్రబాబు, రామోజీ రావు, అంబానీ, సోనియా గాంధీల దుష్టచతుష్టయాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు దశ-దిశలను నిర్దేశించి పోరుబాటలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపించడానికి జగన్ నడుం బిగించాలి. ఆయన అడుగులో అడుగువేస్తూ ముందుకు నడవడానికి, ఆయనతో కలిసి కష్టనష్టాల్లో 
పాలుపంచుకోవడానికి యావత్ తెలుగు ప్రజానీకం, మరీ ముఖ్యం రైతాంగం సిద్ధంగా ఉంది. 

భూమి కోసం... భుక్తి కోసం... విముక్తి కోసం సాగిన మహత్తర, చరిత్రాత్మక తెలంగాణ రైతాంగ పోరాటానికి నడి గడ్డగా నిలిచిన తెలంగాణలో, రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ‘రైతు దీక్ష’ చేపడుతున్న సందర్భం ఇది.

రాజకీయ-ఆర్థిక రంగాల్లో శరవేగంతో సంభవిస్తున్న జాతీయ, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారతదేశంలో... ప్రత్యేకించి తెలుగునాట రైతాంగం స్థితిగతులు ఆందోళనకరంగా పరిణమిస్తున్నాయి. గతంలో స్వాతం త్య్ర ఉద్యమకాలంలో, ఆ తరువాత రైతాంగ ప్రయోజనాల రక్షణకు పాటుపడే ఉద్యమాలు తలెత్తాయి. అనేక రైతు సంఘాలు, వామపక్ష పార్టీలు రైతాంగ ప్రయోజనాలు ఆశించి మహోద్యమాలు నిర్వహించిన ఘనచరిత్ర తెలుగు వాడిది. మరీ ముఖ్యంగా సేద్యపు నీటి పథకాల అమలు కోసం రైతు సంఘాలు సుదీర్ఘంగా ఆందోళనలు చేపడుతూనే ఉన్నాయి. రైతాంగ ఉద్యమాల్లో చెప్పుకోదగ్గ చరిత్రకలిగిన వారు అటు కాంగ్రెస్, ఇటు కమ్యూనిస్టు పార్టీల్లో క్రియా శీలపాత్ర పోషించారు. బెంగాల్‌కు చెందిన హరేకృష్ణ కోనార్, ప్రమోద్‌దాస్‌గుప్త వంటి నాయకులు వేసిన రైతాంగ ఉద్యమాల పునాదుల్లోనే బెంగాల్‌లో వామపక్ష పార్టీల మనుగడ దీర్ఘకాలం అజేయంగా కొనసాగింది. 

అలాగే, తెలంగాణలో దేవులపల్లి వెంకటేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావుల నాయకత్వం లో చేపట్టిన భూ పోరాటం సాయుధ పోరాటంగా మలుపు తిరిగిన చరిత్ర మన కళ్లముందు ఉన్నది. నీలం సంజీవరెడ్డి, ఎన్‌జీ రంగా వంటి రైతు నేతలు తెలుగునాట రైతు ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటాలు చేపట్టి ఆశిం చిన మేర ఫలితాలు సాధించారు. రైతు సంక్షేమానికి అమి త ప్రాధాన్యం ఇచ్చిన ఎన్టీఆర్ ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తలొగ్గక కార్యక్రమాలను విజయవంతంగా అమలుపరచారు.

సోవియట్ యూనియన్ పతనానంతరం అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థల ద్వారా వ్యవసాయ రంగాన్ని కోలుకోలేనంతగా దెబ్బతీసింది. మన రాష్ట్రాన్ని 1995-2004 మధ్య కాలంలో తొమ్మిదేళ్ల పాటు పాలించిన చంద్రబాబునాయుడు సరళీకృత ఆర్థికవిధానాల మాటున బహుళజాతి కంపెనీల అనుకూల విధానాన్ని ఇష్టారాజ్యం గా అనుసరిస్తూ ప్రైవేటీకరణను కొనసాగించిన ఫలితంగా రైతాంగం, మొత్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమైం ది. ఫలితంగా గ్రామీణ ప్రజలు వలసబాట పట్టడం, రైతు లు ఆత్మహత్యలకు పాల్పడటం నిత్యకృత్యంగా మారింది.
ఈ విపత్కర పరిస్థితుల్లో యావత్‌దేశంలోనే తొలి సారి ఆచరణయోగ్యమైన అభివృద్ధి నమూనాకు రూప కల్పన చేసి అమలుపరచి చూపిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తన విధానాల ద్వారా రైతాంగానికి తిరిగి ప్రాణప్రతిష్ట చేశారు. 

రాష్ట్ర చర్రితలో వైఎస్ పరిపాలనా కాలం స్వర్ణయుగంగా భాసిల్లింది. వైఎస్ అకాల మరణంతో రాష్ట్రం ఎం తగా దుర్గతి పాలైందో తెలిసిందే. 2004-09 మధ్య కాలం లో మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం తదితర వెనుకబడిన జిల్లాలకు చెందిన గ్రామీణ రైతులు, వ్యవసాయ కూలీలు వలసలకు స్వస్తి చెప్పారంటే అది వైఎస్ పుణ్యమే. గ్రామీ ణ ప్రాంతాల్లో ఆ రోజుల్లో సుస్థిరాభివృద్ధి మూడు పువ్వు లు, ఆరు కాయలుగా వెల్లివిరిసింది. 


కానీ, నేడు జరుగుతున్నది ఏమిటి? రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డిల పాలనలో నాటి చంద్రబాబు జమానా పునరావృతమైంది. ఇలా ఎందుకు జరిగింది? ఎందుకంటే వీరిద్దరికీ రైతు అనుకూల విధానాలలో విశ్వాసం లేదు. కేంద్రంలో నేడు అధికారం చలాయిస్తున్న మన్మోహన్‌సింగ్, సోనియాగాంధీలకు గ్రామీణ-రైతాంగ సమస్యల పరిష్కారంపై కించిత్తయినా చిత్తశుద్ధిలేదు. ఆసక్తి అంతకంటే లేదు. గత రెండేళ్లుగా అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ రైతుల, గ్రామీణ ప్రజల ప్రయోజనాలను ఆశించి చేపట్టిన చర్యలు నిర్దిష్టంగా ఏమీ లేవు. ఆహార భద్రత బిల్లు వారి ఉదాసీన వైఖరికి ఒక నిదర్శనం. ఈ అంశంపై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా బాధ్యతగా స్పందించడం లేదు. క్రికెట్‌కు ఇచ్చిన ప్రాధాన్యం రైతాంగ సమస్యలకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? రాష్ట్రంలో ఉచిత విద్యుత్, గ్రామీణ సంక్షేమ కార్యక్రమాల అమలులో వైఫల్యాలపై వార్తా కథనాలు ప్రచురించడం ద్వారా ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన పత్రి కలు నిష్పూచీగా ప్రవర్తిస్తున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో పౌష్టికాహార సమస్యతో సతమతమవుతున్న ప్రజలను ఆహార భద్రత బిల్లు ద్వారా ఆదుకోవడానికి ఒకవైపు మీనమేషాలు లెక్కపెడుతున్న కేంద్ర ప్రభుత్వం బంగారం, వజ్రాల దిగుమతికి ఎదురవుతున్న ఇబ్బందులను తొలగిస్తూ రూ.55 వేల కోట్ల మేర పన్నురాయితీ కల్పించడం దేనికి సంకేతం? పారిశ్రామిక రంగం అభివృద్ధికి రూ.511 వేల కోట్లు ఖర్చుపెట్టడంలో మతలబు ఏమిటి? ఉచిత విద్యుత్తును, వ్యవసాయరంగ అనుకూల సబ్సిడీలను, జలయజ్ఞాన్ని అణువణువునా వ్యతిరేకిస్తున్న ఆహ్లూవాలియా కేంద్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్ష పదవిలో కొనసాగడం ఎంతవరకు సమంజసం? సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేందుకు పోటీపడుతున్న కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలను ఏమనాలి? మన రాష్ట్రంలో కృష్ణ-గోదావరి బేసిన్‌లో లభించే గ్యాస్ నిక్షేపాలను రిలయన్స్ కంపెనీకి దారాదత్తం చేయడంలో చంద్రబాబు, రామోజీరావులతో సోనియాగాంధీ చేతులు కలపడం కన్నా దౌర్భాగ్యం ఉంటుందా? నేటి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు రిలయన్స్ అంబానీ ముందు మోకరిల్లడం సిగ్గుచేటు కాదా? 70 శాతంగా ఉన్న మన గ్రామీణ ప్రజల మద్దతుతో ఎన్నికల్లో గెలిచి, పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్న రాజకీయ నాయకులను నిలదీసే సమయం ఇప్పుడు ఆసన్నమైంది.

తెలుగునాట పేద గ్రామీణ ప్రజలు, రైతుల శ్రేయ స్సు కోరి ఎన్టీఆర్ చేపట్టిన పథకాలను రామోజీ, చంద్రబాబు తుంగలో తొక్కి తమ సొంత ప్రయోజనాల కోసం రిల యన్స్ కంపెనీకి మన రాష్ట్ర వనరులను దోచిపెట్టిన తరువాత తెలుగుదేశం పార్టీలో ఇంకా ఏమి మిగిలి ఉంది? పట్టణాల్లో చిన్నా చితక ఉద్యోగాలు చేస్తూ అవస్థల పాల య్యేకన్నా, గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నం తలో తృప్తిగా జీవించడం ఉత్తమమనే భావన గ్రామీణ యువకుల్లో ఏర్పడాలంటే అందుకు తగిన విధానాలు అమలులోకి రావాలి. ఇది అసాధ్యమైన కోరికేమీ కాదు. వ్యవసాయానికి చాలినన్ని నిధులను కేటాయించి, ఆహా ర, ఆరోగ్య, ఉద్యోగ, సామాజిక భద్రత కల్పించిన నాడు గ్రామాలు తిరిగి ప్రాణం పోసుకుంటాయి. ఇందిరమ్మ ఇళ్లు, పావలా వడ్డీ, 104,108, ఆరోగ్యశ్రీ, ఉపాధి హామీ పథకం, ఉచిత విద్యుత్, వ్యవసాయానికి డ్రిప్పు, స్ప్రిం క్లర్లు, మార్కెట్ వసతి, గిట్టుబాటు ధర, సేద్యపు నీటి సౌకర్యాలు కల్పించడం ద్వారా గ్రామాలను సస్యశ్యామలం చేయవచ్చు. గ్రామీణ అనుకూల విధానాలను ఒక నిర్దిష్టకాలపరిమితికి లోబడి యుద్ధప్రాతిపదికన అమలుపరచే సంకల్పమే ఉంటే ఈ కోరిక గగన కుసమమేమీ కాదు.

చుట్టూరా నెలకొని ఉన్న ప్రతికూల వాతావరణాన్ని ఎదిరిస్తూ ప్రజల బాగు కోసం ముందుకు చొచ్చుకుపోవడంలో అనతికాలంలో ఆరితేరిన జగన్‌మోహన్‌రెడ్డి రైతు సమస్యలపై నేటి నుంచి మూడు రోజులపాటు ఉత్తర తెలంగాణలో చేపడుతున్న దీక్ష రైతు లోకానికి ఒక వరం. పోలవరం ప్రాజెక్టు కోసం జరిపిన పాదయాత్ర, విజయవాడలో జరిపిన రైతు లక్ష్య దీక్ష, ఢిల్లీలో కృష్ణాజలాల పంపి ణీలో జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ చేసిన ‘రైతుగర్జన’, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం వారంపాటు జరిపిన ‘ఫీజుపోరు’ నిరాహారదీక్ష... వైఎస్ రాజశేఖరరెడ్డి పోరాట సంప్రదాయాన్ని జగన్ పుణికిపుచ్చుకున్నారని చెప్పడానికి దాఖలాలుగా నిలుస్తాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో, ప్రత్యేకించి సోనియాగాంధీతో ఆయన తలపడిన తీరు కాంగ్రెసేతరశక్తులను కూడా అబ్బురపరిచింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తూ జగన్ చేపడుతున్న దీక్షలు, పోరాటాలు, ఆందోళనలు జాతీయ స్థాయిలో చర్చాంశనీయంగా మారాయి. 

భవిష్యత్తులో వ్యవసాయ రంగానికి, రైతు సంక్షేమానికి పథనిర్దేశం చేయడంలో వైఎస్ మార్గాన్నే జగన్ మోహన్‌రెడ్డి తు.చ. తప్పకుండా అనుసరిస్తారని ఆయన ఆచరణ స్పష్టం చేస్తున్నది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని సమరశీల పార్టీగా జగన్ ముందుకు తీసుకెళ్లడం ప్రజలలో నూతనోత్సాహాన్ని నింపుతున్నది. చంద్రబాబు, రామోజీ రావు, అంబానీ, సోనియా గాంధీల దుష్టచతుష్టయాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు దశ-దిశలను నిర్దేశించి పోరుబాటలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపించడానికి జగన్ నడుం బిగించాలి. ఆయన అడుగులో అడుగువేస్తూ ముందుకు నడవడానికి, ఆయనతో కలిసి కష్టనష్టాల్లో పాలుపంచుకోవడానికి యావత్ తెలుగు ప్రజానీకం, మరీ ముఖ్యం రైతాంగం సిద్ధంగా ఉంది. రైతు కాడి మోసే వాడికే రాజ్యఫలం సిద్ధిస్తుందనే నిరూపిత చారిత్రక సత్యం తెలుగునాట మరోమారు తిరుగులేని విధంగా రుజు వయ్యే రోజు ఇప్పుడిక ఎంతో దూరం లేదు  -విశ్లేషణ
ఇమాం,‘కదలిక’ సంపాదకులు
Share this article :

0 comments: