సిబిఐదర్యాప్తు వెనుక రాజకీయ కుట్ర: విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సిబిఐదర్యాప్తు వెనుక రాజకీయ కుట్ర: విజయమ్మ

సిబిఐదర్యాప్తు వెనుక రాజకీయ కుట్ర: విజయమ్మ

Written By ysrcongress on Monday, January 30, 2012 | 1/30/2012

సిబిఐ దర్యాప్తు వెనుక రాజకీయ కుట్ర కనిపిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు విజయమ్మ ఆరోపించారు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు ఆమె ఒక లేఖ రాశారు. మే 2009కి ముందు ఏ రాజకీయ హొదా లేని జగన్మోహన రెడ్డిని విచారించడం రాజకీయ కుట్రలో భాగమేనన్నారు. సిబిఐ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. నిర్ణయాలు తీసుకున్న మంత్రులను వదిలిపెట్టి, వైఎస్ కుటుంబ ప్రతిష్టని దెబ్బతీసే విధంగా సిబిఐ వ్యవహరిస్తోందని తెలిపారు. జగన్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని సాక్షులను సిబిఐ బెదిరిస్తోందన్నారు. 

ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో స్టైలిష్ హొం ఎండి రంగారావుని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆమె ప్రశ్నించారు. అతనిని కేసు నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.రంగారావుకు బెయిలు ఇవ్వడంలో సిబిఐ నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందని స్పష్టమైందన్నారు. నిధులు దుబాయ్ కి తరలించిన కోనేరు ప్రసాద్ కుమారుడిపైన ఏవిధమైన చర్యలు లేవని తెలిపారు.అన్ని పార్టీలకు డబ్బు ఇచ్చానని కోనేరు ప్రసాద్ చెప్పారు. ఇప్పటి వరకు ఏ ఒక్క పార్టీ వారిని విచారించకుండా, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారినే వేధిస్తున్నారని ఆ లేఖలో ప్రధానికి విజయమ్మ తెలిపారు. సిబిఐకి ఆధారాలు దొరక్కపోవడంతో విజయసాయి రెడ్డి అనుమతి లేకుండా నార్కో ఎనాలసిస్ పరీక్ష చేయించి, తప్పుడు నివేదిక సృష్టించారన్నారు. 

ఇండియా సిమెంట్ కు 13 టిఎంసిల నీటి కేటాయింపులోనూ సిబిఐ కోర్టుని తప్పుదోవ పట్టిస్తోందన్నారు. పరిశ్రమలకు మౌలిక సదుపాయల కల్పనలో భాగంగానే వైఎస్ఆర్ ఈ నీటిని కేటాయించినట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వాల హయాంలోనూ ఇదే విధానం అనుసరించారని తెలిపారు. వాస్తవానికి 0.13 టిఎంసి కేటాయిస్తే, దానికి వెయ్యి రెట్లు అంటే 13 టిఎంసిల నీరుగా కోర్టుకు తెలిపారన్నారు.
Share this article :

0 comments: