ఈనాడు కంటే సగం ధరలో లభిస్తున్నపుడు ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టకుండా ఎలా ఉంటారని - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈనాడు కంటే సగం ధరలో లభిస్తున్నపుడు ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టకుండా ఎలా ఉంటారని

ఈనాడు కంటే సగం ధరలో లభిస్తున్నపుడు ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టకుండా ఎలా ఉంటారని

Written By ysrcongress on Wednesday, January 4, 2012 | 1/04/2012

సీబీఐ అంటే కేంద్ర దర్యాప్తు సంస్థ కాదని.. కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. ఆంగ్ల టెలివిజన్ చానెల్ టైమ్స్ నౌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను జగన్ మాట్లాడారు. విజయసాయిరెడ్డి అరెస్ట్ తమకు ఆశ్చర్యం కలిగించలేదని ఆయన చెప్పారు. సీబీఐ దర్యాప్తు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఎలా కోరుకుంటున్నాయో అలాగే జరుగుతోందని జగన్ విశ్లేషించారు.

తనపై పెట్టిన కేసులు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని జగన్ అన్నారు. తాను కాంగ్రెస్ నుంచి బయటకు రాగానే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గౌరవం అకస్మాత్తుగా తగ్గిపోయిందన్నారు. తన కంపెనీలో పెట్టుబడులకు సంబంధించి కొత్త సమాచారమేదీ లేదన్నారు. ఈనాడుతో సమంగా ఉన్న సాక్షి పత్రిక విలువ.. మరో తెలుగు పత్రిక ఈనాడు కంటే సగం ధరలో లభిస్తున్నపుడు ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టకుండా ఎలా ఉంటారని జగన్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

దేశ పత్రికారంగ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సాక్షి ఒకేసారి 23 కేంద్రాలలో ప్రారంభమైందని.. ఈనాడు కంటే మెరుగైన స్థితిలో ఉన్న సాక్షి విలువ.. ఈనాడు కంటే సగం ధరకే లభిస్తున్నపుడు ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టారా? అని జగన్ ప్రశ్నించారు.

కోర్టు దర్యాప్తుకు ఆదేశించిన పుడు అందులో ప్రభుత్వం అనే పదం ఉందని.. సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ప్రభుత్వం అనే పదం స్థానంలో రాజశేఖరరెడ్డి అనే పదం వచ్చిందని జగన్ చెప్పారు. ఈ విషయాన్ని బట్టి సీబీఐ ఎలా వ్యవహరిస్తోందో అర్ధమవుతుందని జగన్ మరో ప్రశ్నకు సమధానమిచ్చారు.


Share this article :

1 comments:

srikanth reddy said...

johar ysr
yellow media congress tdp cbi dusta chaturdhayam la kalisi pani chesina jagan mohan reddy gari jana sakhti mundhu niluvaleru.................