దేశంలోకి సెల్‌ఫోన్లు తెచ్చింది నేనే,స్వర్ణ చతుర్భుజి రోడ్లు కూడా నా వల్లే వచ్చాయి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దేశంలోకి సెల్‌ఫోన్లు తెచ్చింది నేనే,స్వర్ణ చతుర్భుజి రోడ్లు కూడా నా వల్లే వచ్చాయి

దేశంలోకి సెల్‌ఫోన్లు తెచ్చింది నేనే,స్వర్ణ చతుర్భుజి రోడ్లు కూడా నా వల్లే వచ్చాయి

Written By ysrcongress on Sunday, January 29, 2012 | 1/29/2012

నాడు నేనే వీటిపై వాజ్‌పేయికి సూచనలు చేశాను
నేను 15 ఏళ్ల కిందటే విజన్ 2020 గురించి మాట్లాడా
యూపీలో రాహుల్ గాంధీ ఇవే మాటలు చెబుతున్నారు

హైదరాబాద్, న్యూస్‌లైన్:దేశంలో సెల్‌ఫోన్లు, స్వర్ణ చతుర్భుజి రోడ్లు తన వల్లే వచ్చాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పుకున్నారు. ఇందుకు అవసరమైన సూచనలను అప్పటి ప్రధాని వాజ్‌పేయికి తానే అందించానని అన్నారు. శనివారం ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.  ‘‘నేను 15 ఏళ్ల క్రితమే విజన్ 2020 గురించి మాట్లాడితే ఇపుడు రాహుల్ గాంధీ అదే మాటలను ఉత్తరప్రదేశ్‌లో చెబుతూ.. ఆంధ్రప్రదేశ్ లేదా బీహార్‌లా తయారు చేస్తానని చెప్తున్నారు. 

ఆయన చెప్తుంది నేను సీఎంగా ఉన్నప్పటి ఏపీ గురించా లేదా వైఎస్ సీఎంగా ఉన్నప్పటి ఆంధ్రప్రదేశ్ గురించా..?’’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల తీరు, ప్రజల కష్టాలను చూస్తుంటే.. తనకు బాధ, పట్టరాని కోపం, ఆవేశం, ఆగ్రహం వచ్చినా ప్రజాస్వామ్యం గుర్తుకు వచ్చి మౌనంగా ఉంటున్నానని అన్నారు. మద్యం అమ్మకం వల్ల ప్రభుత్వానికి రూ.18 వేల కోట్ల ఆదాయం వస్తోందని, అయితే సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తోంది నామమాత్రమేనని విమర్శించారు. ఈ సమయంలో చీప్ లిక్కర్ క్వార్టర్ ధర రూ.100కు పెరిగిందని చంద్రబాబు అనగా.. కాదు రూ.150 అంటూ ఈ కార్యక్రమానికి హాజరైన ఓ కార్యకర్త గట్టిగా అరిచారు. 

తనకు సీఎం పదవిపై ఆశ లేదని, తాను తొమ్మిదేళ్లు సీఎం పదవిని అనుభవించానని, గత ఎనిమిదేళ్లుగా ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నానన్నారు. ముఖ్యమంత్రిగా తాను నిర్వహించినంత పదవీకాలాన్ని మరొకరెవరైనా అధిగమించాలంటే మరో 20 ఏళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రసంగించేందుకు వేదిక వద్దకు వెళ్తున్న సమయంలో సమావేశంలోని కార్యకర్తలు జై బాలయ్య.. అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.
Share this article :

0 comments: