చంద్రబాబు కోడలు బ్రహ్మణికి రెండు విల్లాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు కోడలు బ్రహ్మణికి రెండు విల్లాలు

చంద్రబాబు కోడలు బ్రహ్మణికి రెండు విల్లాలు

Written By ysrcongress on Tuesday, January 10, 2012 | 1/10/2012

రోశయ్య, బొత్స, ధర్మాన, గీతారెడ్డిలతో కూడిన ఉపసంఘం సిఫారసు మేరకే ఒప్పందం కొనసాగింది
నేరాలను వైఎస్‌పై రుద్ది.. జగన్‌ను దోషిగా నిలిపేందుకు కుట్ర
ఎమ్మార్‌పై బహిరంగ చర్చకు సిద్ధమే
ఎప్పుడు.. ఎక్కడో కేశవ్ చెప్పాలి

ఎమ్మార్ ఉదంతంలో తమిళనాడు ప్రస్తుత గవర్నర్ కె.రోశయ్యతో పాటు ముగ్గురు రాష్ట్ర మంత్రులను విచారించాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సీబీఐని డిమాండ్ చేశారు. ఎమ్మార్‌తో చంద్రబాబునాయుడు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం సమీక్ష కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి... అప్పటి ఆర్థిక మంత్రి కె.రోశయ్య నేతృత్వంలో ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, జె.గీతారెడ్డి సభ్యులుగా ఉప సంఘాన్ని నియమించారని తెలిపారు. అందులో ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.కె.గోయెల్ కూడా ఉన్నారని వివరించారు. వారు చేసిన సిఫారసు మేరకే తదుపరి ఆ ఒప్పందం కొనసాగిందనీ అందుకే వారిని విచారిస్తే వాస్తవాలు వెల్లడవుతాయని అంబటి చెప్పారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీబీఐ జీవించి ఉన్న రోశయ్యను, మంత్రులను విచారించకుండా చనిపోయిన రాజశేఖరరెడ్డిని దోషిగా చేసే యత్నం ఎందుకు చేస్తోందని ఆయన ప్రశ్నించారు. ‘జీవించి ఉన్న వాళ్లను విచారిస్తే వాస్తవాలు తెలుస్తాయి. చనిపోయిన వ్యక్తిపై ఆరోపణలు చేస్తే ఆయన జవాబు చెప్పుకోలేరు’ అనే ఉద్దేశంతో ఇలా చేయడం సరికాదని అంబటి పేర్కొన్నారు. వైఎస్‌పై నేరాలను రుద్ది తద్వారా ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డిని దోషిగా నిర్ధారించాలనే కుట్ర జరుగుతోందని ఆయన చెప్పారు. ఎంజీఎఫ్‌తో ఒప్పందం తనకు తెలియకుండానే జరిగిందని తెలిపారు. తాను చైర్మన్ హోదాలో అదేమని అప్పటి మేనేజింగ్ డెరైక్టర్‌ను ప్రశ్నిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం 2002లో జారీ చేసిన జీవో, 2003లో చేసుకున్న ఒప్పందంలోనే అలా ఉందంటూ ఆయన తనకు వివరణ ఇచ్చారని అంబటి పేర్కొన్నారు.

కేశవ్ సవాలుకు సిద్ధం...:ఎమ్మార్ వ్యవహారంపై చర్చకు రావాలని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ విసిరిన సవాలును అంబటి స్వీకరించారు. తేదీ, సమయం, వేదిక నిర్ణయిస్తే అక్కడకు వచ్చి చర్చలో పాల్గొనడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఎమ్మార్ సంస్థకు ఎకరం రూ.29 లక్షలకే కేటాయించిన చంద్రబాబు తన భార్య పేరు మీద అదే ప్రాంతంలో ఉన్న భూమిని అంతకుముందు రెండునెలల క్రితమే ఎకరా రూ.2 కోట్లకు అమ్ముకున్నారని తెలిపారు. దీనిని బట్టి ఈ భూముల కేటాయింపులో ఎన్ని కోట్ల కుంభకోణం దాగి ఉందో అనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. తాను ఆదివారం సీబీఐ విచారణ సందర్భంగా ఈ విషయాలన్నీ చెప్పి చంద్రబాబును విచారించి తీరాలనీ అపుడే కుంభకోణంలో వాస్తవాలు తెలిసి వస్తాయని కోరి నట్లు చెప్పారు. 

ఎమ్మార్ సంస్థకు 535 ఎకరాల భూమిని నగరం నడిబొడ్డున కేటాయించిందీ, ఆ తరువాత ఒప్పం దం కుదుర్చుకున్నదీ చంద్రబాబు అయితే.. ఆయనను విచారించాలన్నందుకు కేశవ్ తనను విమర్శిస్తే ఎలాగని రాంబాబు ప్రశ్నించారు. ప్రస్తుత ఏపీఐఐసీ చైర్మన్ శివరామ సుబ్రమణ్యం కూడా తనపై విమర్శలు చేశారనీ, ఆయన వద్ద తనకు వ్యతిరేకంగా ఏవైనా నిర్దిష్టమైన ఆధారాలుంటే సీబీఐకి ఇచ్చి తన చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. 21వ తేదీతో సుబ్రమణ్యం పదవీకాలం ముగుస్తోందనీ.. రాంబాబుపై అవాకులు చవాకులు మాట్లాడితే సీఎం సంతోషించి పదవీకాలం పొడిగిస్తారని ఆయన ఆశ పడుతున్నట్లుందని ఎద్దేవా చేశారు. తాను సీబీఐ ముందు సాక్షిగా హాజరై ఇచ్చిన వాంగ్మూలంపై ఓ ప్రముఖ పత్రిక తన వాదనలు ప్రచురించకుండా ఏకపక్షంగా రాసిందని అంబటి అన్నారు. తానేదో నలుగురికి ఎమ్మార్ విల్లాలు కేటాయించాల్సిందిగా లేఖలు రాశాననీ.. అదేదో నేరమైనట్లుగా వార్తలు రాశారనీ చెప్పారు. ఎవరు ఏ విజ్ఞప్తి లేఖ ఇచ్చినా దానిపై ‘పరిశీలించి, తగు చర్యలు తీసుకోండి...’ అని అధికారులకు పంపుతూ ఉంటాననీ.. అదేదో నేరమైనట్లుగా పేర్కొనడం సరికాదని అన్నారు. ‘చంద్రబాబు కోడలు బ్రహ్మణికి రెండు విల్లాలు, డి.శ్రీనివాస్, జె.గీతారెడ్డి వంటి వారందరికీ విల్లాలు ఉన్నపుడు.. నా తమ్ముడు మాత్రం అక్కడ కొనకూడదా..?’ అంటూ అంబటి ఒక ప్రశ్నకు జవాబిచ్చారు.
Share this article :

0 comments: