కల్తీ సారా అమ్మింది స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ అనుచరులే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కల్తీ సారా అమ్మింది స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ అనుచరులే

కల్తీ సారా అమ్మింది స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ అనుచరులే

Written By ysrcongress on Tuesday, January 3, 2012 | 1/03/2012

*కృష్ణా జిల్లా కల్తీ సారా పాపం టీడీపీ నేతలదే
*అమ్మింది స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ అనుచరులే
*తయారీదారులు జములయ్య, లక్ష్మణుడు టీడీపీ కార్యకర్తలు
*జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు విజయ్‌బాబుకు సన్నిహితులు
*దేవినేని ఉమకు విజయ్‌బాబు ప్రియ శిష్యుడు
*సోమవారం బాబు కృష్ణా పర్యటనలోనూ పాల్గొన్న విజయ్
*వారి రాజకీయ అండతోనే యథేచ్ఛగా సారా వ్యాపారం
*కనిమెర్ల తండా కేంద్రంగా మైలవరానికి సారా సరఫరా
*పోలీసుల అదుపులో లక్ష్మణుడు, సరఫరా చేసింది తామేనని ఒప్పుకోలు

విజయవాడ, సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమాయక గిరిజనుల ఉసురు తీసిన కృష్ణా జిల్లా మైలవరం కల్తీ సారా ఉదంతంలో తెలుగు తమ్ముళ్ల పాత్ర వెలుగులోకి వస్తోంది. ఈ సారాను అమ్మింది స్థానిక టీడీపీ కార్యకర్తలేనని పోలీసుల విచారణలో వెల్లడైంది. మైలవరం నియోజకవర్గం పరిధిలోని కనిమెర్లతండాకు చెందిన అజ్మీరా లక్ష్మణుడు, జములయ్యలే కల్తీ సారాను సరఫరా చేసినట్లు ఆధారాలు లభించాయి. వారిద్దరూ స్థానికంగా టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు కేవీవీ సత్యనారాయణ అలియాస్ విజయబాబుకు వీరిద్దరూ సన్నిహితులు. మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావుకు విజయబాబు ప్రధాన అనుచరుడు. సోమవారం కృష్ణా జిల్లాలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటనలోనూ ఆయన పాల్గొన్నారు. 

కల్తీ సారా ఘటనలో దోషులెవరనే దిశగా దర్యాప్తు జరుపుతున్న పోలీసు, ఎక్సైజ్ అధికారులు ఈ దిశగా అనేక ఆధారాలు రాబట్టినట్టు తెలిసింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న లక్ష్మణుడు ఈ మొత్తం ఘటనపై వివరాలందించినట్టు సమాచారం. కొన్నేళ్లుగా తామీ వ్యాపారంలో ఉన్నామని, పోరాట్‌నగర్‌తో పాటు నాలుగు బాధిత గ్రామాలకూ సారా సరఫరా చేశామని విచారణలో అంగీకరించినట్టు తెలుస్తోంది. ఉమ, విజయ్‌బాబుల రాజకీయ అండతో వీరిద్దరూ యథేచ్ఛగా సారా వ్యాపారం నడుపుతున్నారు. పోరాట్‌నగర్ సమీపంలోని కనిమెర్ల తండా కేంద్రంగా మైలవరం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకూ సారాను సరఫరా చేస్తుంటారు. జములయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతన్ని మంగళవారం అదుపులోకి తీసుకోవచ్చని సమాచారం.

అందుకే బాబు హడావుడి
కల్తీ సారా ఘటనలో ప్రధాన నిందితులు టీడీపీ వారేనని తెలిసిన కారణంగానే చంద్రబాబు హడావుడిగా సోమవారమే మైలవరం పర్యటన చేపట్టారని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. నిందితులు తమ పార్టీకి చెందిన వారు, అందునా ఎమ్మెల్యే ముఖ్య అనుచరులేనని బయటికి తెలియకముందే పరామర్శను ముగించాలన్నదే ఆయన వ్యూహమని భావిస్తున్నారు.

ఎక్సైజ్ అధికారుల అండ
కనిమెర్ల తండా కేంద్రంగా సారా వ్యాపారం రెండేళ్లుగా జోరుగా సాగుతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. మైలవరంలో జోరుగా సారా అమ్మకాలు సాగుతున్నాయని స్థానిక మద్యం వ్యాపారులు ఫిర్యాదు చేశారు. సారా తయారీదారులపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక యువకులు కూడా ఆందోళనలు మొదలుపెట్టారు. అయినా నామమాత్రపు దాడులతో సరిపుచ్చడమే తప్ప ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. పైగా ఎక్సైజ్ శాఖలో నిఘా విభాగంలోని ఓ సీనియర్ అధికారే సారా వ్యాపారులకు అండగా నిలిచినట్టు విచారణలో వెల్లడైంది. ‘లక్ష్మణుడు, జములయ్యలకు స్థానిక ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేతల అండ దండిగా ఉండటంతో వారి అక్రమ కార్యకలాపాలను అడ్డుకోలేకపోయాం. పైగా వారిని అడ్డుకోవద్దంటూ ఎక్సైజ్ నిఘా విభాగం సీనియర్ అధికారి ఒకరు ఆదేశించారు’ అని స్థానిక అధికారులు విచారణలో వెల్లడిం చినట్టు తెలుస్తోంది. ఈ ఉదంతంలో స్థానిక ఇన్‌స్పెక్టర్‌తో పాటు సిబ్బందిని ఇప్పటికే సస్పెండ్ చేయడం తెలిసిందే.

పండుగ అమ్మకాల కోసమే...
విచారణాధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం... సంక్రాంతికి నెల ముందు నుంచే మైలవరం ప్రాంతంలో సారా అమ్మకాలు జోరందుకుంటాయి. ఆ డిమాండ్‌కు అనుగుణంగా కాపు సారా అందించడం కష్టమని భావించిన లక్ష్మణుడు, జములయ్య సారా తయారీకి మిథనాల్ వాడటం మొదలుపెట్టారు. అత్యంత ప్రమాదరకమైన దీనితో చేసిన సారా తాగి 2008లో కర్ణాటకలో 100 మందికి పైగా మృతి చెందారు. మిథనాల్ వాడటం ప్రాణాంతకమని తెలిసి కూడా స్థానిక ఎక్సైజ్ అధికారులు ఎందుకు పట్టించుకోలేదు, అసలు నిందితులకు అది ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో ఇప్పుడు దర్యాప్తు సాగుతోంది. మిథనాల్ కలిపిన సారా ఇంకెన్ని గ్రామాలకు సరఫరా అయిందన్న వివరాలనూ రాబడుతున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో సారా నిల్వలను ధ్వంసం చేశారు. సేకరించిన కల్తీ సారా నమూనాలను అధికారులు పరీక్షలకు పంపారు. వాటి నివేదిక మంగళవారానికి వస్తుందని ఎక్సైజ్ అధికారి ఒకరు చెప్పారు.
Share this article :

0 comments: