మేం అధికారంలోకి వస్తే వెఎస్ విగ్రహాలు కూల్చేస్తాం:బాబు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మేం అధికారంలోకి వస్తే వెఎస్ విగ్రహాలు కూల్చేస్తాం:బాబు

మేం అధికారంలోకి వస్తే వెఎస్ విగ్రహాలు కూల్చేస్తాం:బాబు

Written By ysrcongress on Thursday, January 19, 2012 | 1/19/2012

విగ్రహాల ఏర్పాటుపై సీఎం నోరు విప్పాలి: చంద్రబాబు
రాష్ట్రంలో రోడ్లను విస్తరించింది నేనే.. వాటిని పాడు చేసి విగ్రహాలు పెడుతున్నారు
విగ్రహాల ఏర్పాటుపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం
ప్రభుత్వం తీరు మారకుంటే మేమూ లక్ష ఎన్టీఆర్ విగ్రహాలు పెడతాం

హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలన్నింటినీ కూల్చివేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చెప్పారు. విగ్రహాల ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలను వెంటనే బహిర్గతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విగ్రహాల ఏర్పాటుపై సీఎం వెంటనే నోరు విప్పాలన్నారు. లక్ష కోట్ల అవినీతికి పాల్పడి లక్ష వైఎస్ విగ్రహాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారని జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించారు. చంద్రబాబు బుధవారం తన నివాసంలో పార్టీ సభ్యత్యాన్ని పునరుద్ధరించుకున్న అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు వెళ్లిన టీడీపీపీ నేత నామా నాగేశ్వరరావును ఖమ్మం పోలీసులు అరెస్టు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. సిగ్గుంటే ఆయన్ను అరెస్టు చేసేవారు కాదన్నారు. ఖబడ్దార్ అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

‘‘రాష్ట్రంలో రోడ్లను విస్తరించి, కొత్తవాటిని నిర్మించింది నా హయాంలోనే. అటువంటి వాటిని పాడు చేసి రోడ్లకు అడ్డంగా ఎక్కడపడితే అక్కడ వైఎస్ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, ఎన్టీఆర్‌లకు లేన న్ని విగ్రహాలు వైఎస్‌కు ఏర్పాటు చేశారు’’ అంటూ అక్కసు వెళ్లగక్కారు. ‘‘ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే మేమూ లక్ష ఎన్టీఆర్ విగ్రహాలను పంపిణీ చేసి ఆవిష్కరిస్తాం. అభిమానం ఉంటే మనస్సులో, పెరట్లో, ఇంట్లో పెట్టుకోండి. ఎక్కడపడితే అక్కడ విగ్రహాలు పెట్టడం సరికాదు. విగ్రహాల ఏర్పాటుపై సర్కారు చర్యలు తీసుకోవాలి. దీనిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఒక్కొక్కరి విగ్రహంపట్ల ఒక్కో రకంగా వ్యవహరించటం సరికాదు. రానున్న మూడేళ్లలో 15 లక్షల ఉద్యోగాల కల్పనకు సంబంధించి సీఎం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఎవరో పరిశ్రమను పెడితే సీఎం సిఫారసు చేస్తే ఉద్యోగాలు ఇవ్వరు. చెత్తబుట్టలో పడేస్తారు’’ అని చెప్పారు. విద్యుత్ రంగంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాము సమర్ధవంతంగా నడిపిన ఆ రంగాన్ని నాశనం చేశారన్నారు. విద్యుత్ రంగం గురించి పట్టించుకోకుండా ఉండి ఉంటే తాము తిరిగి అధికారంలోకి వచ్చి ఉండేవాళ్లమని చెప్పారు.

ఫోన్‌ల ద్వారా ప్రధానులను ఎంపిక చేశా 

ఫోన్‌లలో మాట్లాడి తాను రాష్ట్రపతి, ప్రధాన మంత్రులను ఎంపిక చేస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ నేతలు ఢిల్లీ చుట్టూ తిరిగి అధిష్టానానికి గులాంగిరీ చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భరంగా ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ‘‘తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో తాకట్టు పెట్టారు. రాష్ట్రంలో సంపాదించిన డబ్బును కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో పంచటం వల్లే అక్కడ వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. పోలవరం టెండర్లలో సీఎం హస్తముందని మేము చెప్పిన మాట నిజమైంది. స్యూ కంపెనీ ప్రతినిధి లక్ష్మీ రాజంను వెంటబెట్టుకుని వెళ్లి సీఎం కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్‌ను కలవటం దీన్ని రుజువు చేస్తోంది. పోలవరం టెండర్ ఫైళ్లన్నింటినీ స్పీకర్ ముందుంచాలి. ఈ విషయమై అసెంబ్లీలో పోరాటం చేస్తాం. సామాజిక న్యాయమంటూ గొప్పలు చెప్పిన పీఆర్పీ నేతలు ఆ పార్టీని కాంగ్రెస్‌లో కలిపి, పదవుల కోసం ఢిల్లీలో పడిగాపులు పడుతున్నారు. టీఆర్‌ఎస్ కూడా విలీనమౌతుందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కేసులు ఎత్తివేస్తామన్నా, సీఎం పదవి ఇచ్చినా జగన్ కూడా అదే పని చే స్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం మూడో కృష్ణుడు ఉన్నాడు. ఇంకా ఎంద రు కృష్ణులు వస్తారో తెలియదు’’ అని అన్నారు. పార్లమెంటులోఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: