నిన్నెవరు మళ్ళీ పంట వేయమన్నారు? వంద సార్లు చెప్పాను.... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నిన్నెవరు మళ్ళీ పంట వేయమన్నారు? వంద సార్లు చెప్పాను....

నిన్నెవరు మళ్ళీ పంట వేయమన్నారు? వంద సార్లు చెప్పాను....

Written By ysrcongress on Sunday, January 15, 2012 | 1/15/2012

ప్రపంచ బ్యాంకు మెప్పు కోసం
వ్యవసాయ రంగం దుంపనాశనం
కరువుతో నడ్డి విరిగిన రైతుల
గోళ్లూడగొట్టి మరీ రుణాల వసూలు
అసలు సాగే దండగని, బడుగుల పించన్లు పనికిరాని భారమని ప్రకటనలు
రెండేళ్లలోనే 3,500 పైచిలుకు రైతుల ఆత్మహత్యలకు కారకుడు
పదేపదే పునాదిరాళ్లే తప్ప ఒక్క ప్రాజెక్టుకూ ఎన్నడూ పైసా కూడా విదల్చని ఘనుడు
డీఏ ఇవ్వబోమంటూ పెన్షనర్లకు, పెన్షన్లే ఇచ్చేదిలేదంటూ వేతన జీవులకు బెదిరింపులు
బాబు అసలు రూపమిదీ...

ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ట్రాక్ రికార్డు చరిత్ర ప్రసిద్ధం! రాష్ట్రంలో అన్ని రంగాలనూ, ముఖ్యంగా వ్యవసాయాన్ని సర్వనాశనం చేసి వదిలిన టీడీపీ అధ్యక్షుడు.. రైతుల కోసం నేటి నుంచి ‘పోరుబాట’లు, ‘కరువు యాత్ర’లు చేస్తానంటున్నారు. ప్రజల జ్ఞాపకశక్తి మీద తనకున్న చులకన భావం అంతా ఇంతా కాదని మరోసారి నిరూపిస్తున్నారు. ‘భూములు పంచితే పేదరికం పోదు’, ‘నీటి ఎద్దడి పోవాలంటే తుపానులే శరణ్యం’... అంటూ రైతులకు ఆగర్భ శత్రువులా మాట్లాడిన బాబు ఇప్పుడు వారిపై ఎక్కడ లేని ఆప్యాయతా ఒలకబోస్తున్నారు! ‘ఒకసారి పంట ఎండితే తెలిసొస్తుంది’.. అంటూ అన్నదాతకు శాపనార్థాలు పెట్టిన గొంతునే ఇప్పుడు ‘రైతు సంక్షేమం’ అంటూ చించుకుంటున్నారు. ‘నరం లేని నాలిక’ సామెతకు తాను అచ్చమైన ప్రతిరూపాన్నని నిస్సిగ్గుగా చాటుకుంటున్నారు. అధికారపు కరువు పోగొట్టుకునేందుకు రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధపడుతున్న రైతు వ్యతిరేక బాబు అసలు బండారంపై..

ఒకసారి ఎండిపోతే సరిపోతుంది...

నిన్నెవరు మళ్ళీ పంట వేయమన్నారు? వంద సార్లు చెప్పాను.... ఒకసారి పంట ఎండిపోతే సరిపోతుంది. మీకు తెలిసిరావాలి. రానున్న రోజుల్లో రైతులు ఇలాగే ఉంటే నేను చాలా తీవ్రంగా ఉంటాను.
- 1999 ఏప్రిల్ 13న సాగర్ కుడికాల్వ రైతులు,
ఎమ్మెల్యే కుర్రి పున్నారెడ్డిపై బాబు ఆగ్రహం.

అదే మరో దేశంలో అయితే ఉరి తీసేవారు...!

విద్యుత్ చౌర్యం చేస్తారా? ఈ దేశంలో కాబట్టి సరిపోయింది. మరో దేశంలో అయితే ఉరి తీసేవారు.
- 2002 ఫిబ్రవరి 18న తెలంగాణ కాంగ్రెస్ ఫోరం నేతలతో ...

పంటలెండిపోతే ఇక కరెంటెందుకు...?

కరువు వల్ల వ్యవసాయ విద్యుత్తు మోటార్లను ఉపయోగిం చుకునే అవకాశం లేని రైతులు వారి కరెంటు కనెక్షన్లను ప్రభుత్వానికి సరెండర్ చేసే ‘సదుపాయం’ కల్పిస్తున్నాం.
- 2002 జూలైలో ముఖ్యమంత్రిగా ...

నీరివ్వలేం.. పరిహారమూ ఇవ్వం...!

నాగార్జునసాగర్ ఆయకట్టుకింద రబీ రైతులకు నీరివ్వలేం. ఖరీఫ్ పంట నష్టానికి పరిహారమూ ఇవ్వం.
- 2002 సెప్టెంబరు 25న సీఎంగా...

కరువుకు తుపానే మందు...!

తుపాను వస్తేనే కరువు తీరుతుంది. నీటి ఎద్దడి పరిష్కారానికి ఇదే మార్గం.
- 2003 సెప్టెంబరు 6న కారంచేడులో ...

9 గంటలు ఇస్తున్నామని చెప్పండి

వ్యవసాయానికి తొమ్మిది గంటలు విద్యుత్తు సరఫరా చేస్తున్నాం. మీరు వాస్తవాలు మాత్రమే చెప్పాలి.
- 2002 సెప్టెంబరు 21న... విద్యుత్తు లేక పంటలు ఎండిపోతున్నాయన్న నల్గొండజిల్లా ఆలేరు రైతులతో...

భూములిస్తే పేదరికం పోతుందా..?

భూములు పంచితే పేదరికం పోదు. భద్రత ఉంటే ఉద్యోగి పనిచేయడు. ఉద్యోగులకు ఎప్పుడూ ఇన్ సెక్యూరిటీ ఉండాలి.
-2002 డిసెంబరు 8న...

రైతులు బాధపడటం లేదు...

విద్యుత్ ఛార్జీలను పెంచినందుకు రైతులు బాధపడటం లేదు.
- 2003 మార్చి 26న కుప్పంలో...

ఇదీ... ‘మనసులో మాట’

పరోక్షంగా ఇచ్చే సబ్సిడీలు కూడా ఏడాదికీ ఏడాదికీ పెరిగిపోయి కొనసాగించటం కష్టమవుతున్నది. వీటిల్లో అన్నింటికంటే ఎక్కువ ఖరీదైనది... కాలువల సాగునీటి విషయంలో వినియోగదార్ల చార్జీల వసూళ్ళులో లోపం. ఎకరానికి 60 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్న చార్జీ... నిర్వహణ ఖర్చులకు కూడా సరిపోనప్పుడు, పెట్టిన పెద్ద పెట్టుబడులకు లాభలేం వస్తాయి? భారీ, మధ్య తరహా నీటి సాగు ప్రాజెక్టులమీద పెట్టిన పెట్టుబడులు, వాటిమీద వడ్డీరేటు, ఆ పెట్టుబడులమీద తరుగుదల, నిర్వహణ చార్జీలు... ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే, కెనాల్ ఇరిగేషన్‌కు ఎకరానికి 1094 రూపాయలు ఖర్చువుతుంది. మరి వసూళ్ళు ఎకరానికి 60 రూపాయలు మాత్రమే!
-తన స్వీయ రచన... ‘మనసులో మాట’లో ...
Share this article :

0 comments: