చేతనైతే సీబీఐ ముందు రంకెలేయ్’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చేతనైతే సీబీఐ ముందు రంకెలేయ్’

చేతనైతే సీబీఐ ముందు రంకెలేయ్’

Written By ysrcongress on Saturday, January 14, 2012 | 1/14/2012

 ‘‘ఏపీఐఐసీకి చెందిన భూముల కేటాయింపు విషయంలో నేను తప్పు చేసినట్లు ఎలాంటి ఆధారాలున్నా సీబీఐకి సమర్పించు. ఉత్తుత్తిగా మీడియా ముందు రంకెలేస్తూ... షో చేయడం కాదు. చేతనైతే సీబీఐ ముందు రంకెలేయ్’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు టీడీపీ నాయకుడు పయ్యావుల కేశవ్‌కు సవాలు చేశారు. ఎమ్మార్ అక్రమాలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబును సీబీఐ ప్రశ్నించే పరి స్థితి తలెత్తడంవల్లనే ఆ పార్టీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ధ్వజ మెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం లో మాట్లాడారు. ‘‘నిబంధనలకు వ్యతిరేకంగా భూములు కేటాయించానంటూ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వద్దకు మీడియాను తీసుకెళ్లి హడావుడి సృష్టించావు. 

అదే మార్గమధ్యంలో మీ పార్టీ అధినేత చంద్రబాబు తన బినామీ బిల్లీరావుకు అప్పనంగా కేటాయించిన భూములను చూపించలేదేం! ఆ పక్కనే ఎమ్మార్‌కు కేవలం రూ.29 లక్షలకే ఎకరం చొప్పున 530 ఎకరాలను కట్టబెట్టిన వాటిని ఎందుకు ప్రస్తావించలేదు? ఎమ్మార్‌కు భూకేటాయింపులకు ముందు చంద్రబాబు తన భార్య పేరుమీదున్న భూమిని ఎకరం రూ.2 కోట్ల చొప్పున అమ్ముకున్న విషయాన్ని మీడియాకు ఎందుకు చెప్పలేదు? ఈ విషయాలన్నీ పయ్యావుల కేశవ్ చెప్పుంటే ప్రజలు ఆయన్ని విశ్వసించేవారు. అలా చేయని వ్యక్తి చేసే వ్యాఖ్యలు ఎవరు నమ్ముతారు?’’ అంటూ అంబటి ప్రశ్నించారు. ఎమ్మార్ అవకతవకలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటిస్తే పయ్యావుల మళ్లీ డొంకతిరుగుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Share this article :

0 comments: