‘కుక్కతోక వంకర’ బుద్ధి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘కుక్కతోక వంకర’ బుద్ధి

‘కుక్కతోక వంకర’ బుద్ధి

Written By ysrcongress on Saturday, January 14, 2012 | 1/14/2012

పోరుయాత్రలతో రైతులపై కపట ప్రేమ ఒలకబోస్తున్నాడు 
అధికారంలో ఉండగా అన్నదాతను నిండా ముంచిన ఘనుడు
కరెంటు చౌర్యం సాకుతో జైలుపాలు చేసేందుకూ వెనకాడలేదు!
అందుకోసం ఏకంగా జీవోలే జారీ చేసిన చరిత్ర చంద్రబాబుది
వారెంట్ కూడా లేకుండా అరెస్టుకు వీలు కల్పిస్తూ జీవో 89 జారీ
ఐదేళ్ల శిక్షకు, రూ.50 వేల జరిమానా విధించేందుకూ అనుమతి
అందుకోసం ప్రత్యేక కోర్టును కూడా ఏర్పాటు చేస్తూ జీవో 99

హైదరాబాద్, న్యూస్‌లైన్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బుద్ధి కుక్కతోక వంకర చందమంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. రైతులపై కపట ప్రేమ ఒలకబోస్తూ పోరు యాత్రలు చేస్తున్న బాబు అసలు నైజం, ఆయన సీఎంగా ఉండగా జారీ చేసిన 89, 99 జీవోల ద్వారా బయట పడిందని ధ్వజమెత్తారు. దేశ చరిత్రలో రైతులకు ఏ ముఖ్యమంత్రీ చేయని అన్యాయాన్ని ఆయన చేశారని తూర్పారబట్టారు. పై రెండు జీవోలు అందుకు ఉదాహరణ మాత్రమేనన్నారు. ‘‘రైతులు, రైతు కూలీల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా బాబుకు లేదు. వ్యవసాయమే దండగంటూ రైతాంగాన్ని నిలువునా ముంచిన బాబు, ఇప్పుడు మళ్లీ దొంగ మాటలు మొదలు పెట్టారు’’ అని శుక్రవారం ఒక ప్రకటనలో ఆమె విమర్శించారు.


‘‘బాబుకు వ్యవసాయమంటేనే గిట్టదు. రైతులంటే ఆయనకెంతో చిన్నచూపు! అందుకే వారిని జైళ్లల్లో పెట్టజూశారు. ఏటేటా కరెంటు చార్జీలను విపరీతంగా పెంచారు. వాటిని ముక్కుపిండి మరీ వసూలు చేశారు. ఇలాంటి సీఎం దేశంలో ఇంకెవరూ లేరన్న వాస్తవం, ఆయన జారీ చేసిన జీవోలను చూస్తే తెలిసిపోతుంది. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టే ముసుగులో రైతులను, సామాన్య వినియోగదారులను కటకటాల పాలు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చిన ఘనుడు బాబు. వారెంట్ కూడా అవసరం లేకుండానే వారి అరెస్టు కు వీలు కల్పిస్తూ 2000 సెప్టెంబర్ 13న జీవోనంబర్ 89 జారీ చేశారాయన. విద్యుత్ చౌర్యానికి కనీసం మూడేళ్ల నుంచి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 వేల దాకా జరిమానా విధించేందుకు దాని ద్వారా వీలు కల్పించారు.


రాష్ట్రవ్యాప్తంగా 31 ప్రత్యేక కరెంటు చౌర్య నిరోధక స్క్వాడ్ పోలీస్‌స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు! బాబు ఇంతటితో ఆగలేదు. ఈ వ్యవహారాలను చూసుకునేందుకు ఏకంగా ప్రత్యేక కోర్టునే ఏర్పాటు చేస్తూ 2000 అక్టోబర్ 17న జీవో ఎంఎస్‌నంబర్ 99ని జారీ చేశారు! ఇండియన్ ఎలక్ట్రిసిటీ (ఆంధ్రప్రదేశ్ అమెండ్‌మెంట్) ఆర్డినెన్స్, 2000 కింద దానికి చైర్మన్, సభ్యులను నియమించారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కె.బి.సిద్దప్పను చైర్మన్‌గా; ఎం.వి.రామారావు, సి.వి.రాఘవయ్యలను జ్యుడీషియల్ సభ్యులుగా; ఆర్.వి.కె.ఆర్.శర్మ, వి.సుబ్బారావులను సాంకేతిక సభ్యులుగా వేశారు. ఇదీ చంద్రబాబు ఘన చరిత్ర’’ అని వాసిరెడ్డి మండిపడ్డారు.


అన్నదాతను ఆదుకున్నది వైఎస్సే: బాబు తొమ్మిదేళ్ల పాలనలో రైతులను నానా ఇబ్బందులు పెడితే, వైఎస్ 2004లో అధికారంలోకి వస్తూనే వారి సంక్షేమానికి ఎన్నెన్నో చర్యలు తీసుకున్నారని పద్మ వివరించారు. ప్రకృతి వైపరీత్యాలు, కరువు, అప్పుల వంటి కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలను ఆర్థిక పరిహారం ద్వారా ఆదుకోవాలని ఆదేశిస్తూ 2004 జూన్ 1న జీవోఎంఎస్ 421ను జారీ చేశారని గుర్తు చేశారు. ‘‘రైతుల సమస్యల పరిష్కారానికి 2004 మే 31నే మంత్రివర్గ ఉపసంఘాన్ని వైఎస్ నియమించారు. దాని నివేదిక వచ్చేలోపు బాధితులకు మధ్యంతర ప్యాకేజీకి వీలుగా జీవో 421 జారీ చేశారు. 

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.లక్ష చొప్పున పరిహారం, అప్పుల చెల్లింపుల నిమిత్తం వన్ టైమ్ సెటిల్‌మెంట్ కింద రూ.50 వేలు అందజేశారు. వీటితో పాటు సదరు కుటుంబాలు నిలదొక్కుకునేందుకు ఇంకెన్నో చర్యలను ఆ జీవో ద్వారా తీసుకున్నారు. పునరావాసం, పిల్లలకు సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ప్రవేశం, ఇందిరా ఆవాస్ యోజన కింద గృహాలు, ప్రభుత్వ పథకాల ద్వారా మరింత ఆర్థిక సాయం, పింఛన్ల వంటివెన్నో వర్తింపజేశారు’’ అని ఆమె వివరించారు.

వైఎస్‌ను చూసి బాబు వాత!: సాగుకు ఉచిత విద్యుతిస్తామని 2004 ఎన్నికలప్పుడు వైఎస్ ప్రకటిస్తే ఎద్దేవా చేసిన బాబు, తానూ ఇస్తానంటూ 2009 ఎన్నికల నాటికి మాయమాటలు వల్లించారంటూ పద్మ ఎద్దేవా చేశారు. ‘‘వైఎస్ ఉచిత విద్యుత్ ప్రకటన అయ్యేదీ కాదు, పొయ్యేదీ కాదన్నారు బాబు. అది అసాధ్యమని తేల్చేశారు. ఒకవేళ ఇస్తే కరెంటు తీగలు బట్టలు ఆరేసుకోవడానికి తప్ప ఎందుకూ పనికి రావంటూ ఎద్దేవా చేశారు. కానీ వైఎస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే విద్యుత్ బకాయిలను రద్దు చేయడమే గాక వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఫైలు మీదే తొలి సంతకం చేశారు. రైతుకిచ్చిన మాటపై నిలబడ్డారు. 

ఉచిత విద్యుత్ పథకాన్ని విజయవంతంగా అమలు చేసి చూపారు. దాంతో బాబుకు దిమ్మ తిరిగి, తన సంస్కరణల వల్లే ఉచిత విద్యుత్ సాధ్యమైందంటూ అవాకులు పేలారు. అదిచ్చి ఉంటే తాను గెలిచే వాడినన్నారు. తానూ ఉచిత విద్యుతిస్తానంటూ 2009 ఎన్నికల్లో మాయమాటలు వల్లించారు. చిత్తశుద్ధి, విశ్వసనీయత, మాట నిలకడ లేని బాబు మాటల్ని జనం నమ్మకుండా ఓడించి బుద్ధి చెప్పారు. అసలు రైతులకు ఉచితంగా కరెంటు ఎందుకివ్వాలన్న దుగ్ధ ఆయన మనసులో నేటికీ ఉంది. అందుకే, ఉచిత కరెంటిస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవడం తప్పదని తాను గతంలో చెప్పిందే నిజమైందంటూ ఇటీవలి కరీంనగర్ పర్యటనలో మనసులో మాటను బయటపెట్టారు. తన బుద్ధి కుక్క తోక వంకర చందమని మరోసారి చాటుకున్నారు’’ అంటూ పద్మ ఎద్దేవా చేశారు.
Share this article :

0 comments: