‘విజయమ్మ పిటిషన్‌ను సుప్రీం తప్పు పట్టలేదు’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘విజయమ్మ పిటిషన్‌ను సుప్రీం తప్పు పట్టలేదు’

‘విజయమ్మ పిటిషన్‌ను సుప్రీం తప్పు పట్టలేదు’

Written By ysrcongress on Tuesday, January 17, 2012 | 1/17/2012

టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు అక్రమాస్తుల కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ వేసిన వేసిన కేసులో సుప్రీంకోర్టు ఆమెను తప్పు పట్ట లేదనీ కానీ టీడీపీ నేతలు మాత్రం తీర్పును వక్రీకరిస్తూ వ్యాఖ్యానాలు చేస్తున్నారని పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు విమర్శించారు. ఆయన మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

బాబు అక్రమాస్తులపై సీబీఐ విచారణకు ఆదేశించిన కేసులో ఇప్పటికే హైకోర్టులో విచారణ పూర్తయి తీర్పు వెలువడటానికి సిద్ధంగా ఉన్నందు వల్ల ఈ దశలో తాము జోక్యం చేసుకోజాలమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చౌహాన్, ఠాకూర్ చెప్పారనీ దానిని టీడీపీ నేతలు, ఓ వర్గం మీడియా వక్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నాయని అన్నారు. విజయమ్మకు సుప్రీం మొట్టికాయలు వేసినట్లు టీడీపీ ప్రచారం చేయడం ఎంత మాత్రం సరికాదని ఆయన అన్నారు. ఓ వర్గం మీడియా కూడా విజయమ్మకు ‘చెంప పెట్టు’, ‘చుక్కెదురు’ అనే వ్యాఖ్యలు చేసిందని ఆయన దుయ్యబట్టారు. 

న్యాయస్థానాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉండటం వల్లనే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సూచనకు అనుగుణంగా పిటిషన్‌ను అక్కడ ఉపసంహరించుకున్నామని ఆయన అన్నారు. హైకోర్టులో న్యాయం జరుగలేదని భావిస్తే మళ్లీ తమ వద్దకు రావచ్చని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు. నిజంగా చంద్రబాబుకు ప్రజలపై నమ్మకం ఉంటే తన అక్రమాస్తులు, తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఎందుకు విచారణకు సిద్ధపడరు? తన నిజాయితీని ఎందుకు నిరూపించుకోరు? అని జూపూడి సూటిగా ప్రశ్నించారు. 

బాబు అక్రమాస్తులపై సీబీఐ విచారణకు రాష్ట్ర హైకోర్టు ఆదేశిస్తే దానిని ఆపుకోవడానికి ఆయన పడరాని పాట్లు పడ్డారని జూపూడి విమర్శించారు. తాను, తన బినామీలైన సుజనా చౌదరి, సి.ఎం.రమేష్‌పై విచారణకు అంగీకరించడానికి బాబుకు భయం ఎందుకని ఆయన ప్రశ్నించారు. హైకోర్టులో బాబు ‘నాట్ బిఫోర్’ అనే నాటకం ఆడి పలు బెంచీలు మారడానికి కారణమయ్యారనీ రిలయన్స్ సంస్థను రంగ ప్రవేశం చేయించారనీ జూపూడి వ్యాఖ్యానించారు. బాబు కేసులో విచారణలు నిలుపు చేయడం అంటే ఆయన నిజాయితీపరుడతని చెప్పినట్లు కాదని జూపూడి అన్నారు. 

బాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన కుమారుడు విదేశాలకు వెళ్లి ఎలా చదువుకున్నారు? బిల్లీరావుకు 850 ఎకరాలు కేటాయించడం వెనుక మతలబు ఏమిటి? రెండెకరాల ఆసామి 2 వేల కోట్ల రూపాయలకు ఎలా పడగలెత్తారు? అని విజయమ్మ తన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంలో వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బాబుపై ఉందని ఆయన డిమాండ్ చేశారు. బాబు తన అవినీతి, అక్రమాస్తులపై ఎంత కాలం విచారణ జరక్కుండా ఆపుకోగలరని ఆయన నిలదీశారు. బాబు అక్రమాస్తుల గురించి ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలనే ఉద్దేశ్యంతో విజయమ్మ కోర్టుకు వెళ్లారని ఆయన వివరించారు.

కోర్టు స్టేలతో విచారణను తప్పించుకుంటున్న బాబు తన నిజాయితీ ఏంటో, తన జవాబుదారీ తనం ఏమిటో, తన విశ్వసనీయత ఏమిటో ప్రజల ముందు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. విజయమ్మ తరపు న్యాయవాది సుశీల్‌కుమార్ తన వాదనల్లో ‘మీ ముందు గతంలో మూడు కేసులు వాదించాను, సానుకూలంగా స్పందించలేదు, అందువల్ల బెంచీ మార్చాలి’ అని న్యాయమూర్తి రోహిణిని కోరారనీ అయినా ఆమె న్యాయవాది అభ్యంతరాలను తోసి పుచ్చి విచారణను కొనసాగించారని జూపూడి అన్నారు. తనకు హైకోర్టులో న్యాయం జరుగదని విజయమ్మ సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లకూడదు, అందులో తప్పేమీ లేదని జూపూడి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Share this article :

0 comments: