కల్తీ సారా బాధితులకు రేపు జగన్ పరామర్శ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కల్తీ సారా బాధితులకు రేపు జగన్ పరామర్శ

కల్తీ సారా బాధితులకు రేపు జగన్ పరామర్శ

Written By ysrcongress on Monday, January 2, 2012 | 1/02/2012

హైదరాబాద్/మైలవరం టౌన్ (కృష్ణా), న్యూస్‌లైన్: కృష్ణా జిల్లాలో కల్తీ సారా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పరామర్శిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం ఆయన విమానంలో విజయవాడ చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మైలవరం వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. సాయంత్రం ప్రకాశం జిల్లా ఒంగోలు వెళ్లి రాత్రికి అక్కడ బస చేస్తారు. 4వ తేదీ బుధవారం ఒంగోలులో ఫీజు పోరు దీక్షలో పాల్గొంటారు. సాయంత్రం నుంచి గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్రను కొనసాగిస్తారు. సోమవారం అంత్యక్రియలకు ఆటంకం కలగరాదనే జగన్ మంగళవారం వస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సామినేని ఉదయభాను తెలిపారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ.50 వేల చొప్పున సాయం అందజేస్తారన్నారు.




రాజంపేట (వైఎస్‌ఆర్ జిల్లా), న్యూస్‌లైన్: స్థానిక ఆకేపాటి భవన్‌లో ఆదివారం నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాజంపేట రూరల్ మండల పరిధిలోని మూడు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన 280 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. వరదయ్యగారి పల్లె, పోలి, రాజంపేట పట్టణంలోని పోలి గ్రామాలకు చెందిన వీరికి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ రెడ్డి వైఎస్సార్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి వారిని ఆహ్వానించారు. 

వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితోనే సాధ్యమని నమ్మడం వల్లే గతంలో టీడీపీ కార్యకర్తలుగా ఉన్న ఈ 280 కుటుంబాలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగించగల సత్తా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి మాత్రమే ఉందని ఆకేపాటి పేర్కొన్నారు.

కాంగ్రెస్ నుంచి వైఎస్‌ఆర్ సీపీలోకి...
పోరుమామిళ్ల కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులుగా ఉన్న 30 కుటుంబాలు బద్వేలు మాజీ ఎమ్మెల్యే డీసీ గోవింద రెడ్డి సమక్షంలో వైఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. కలసపాడు మండలం ఎగువ రామాపురం దళితవాడకు చెందిన మాజీ జడ్పీటీసీ సభ్యుడు దాదన భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో దళితవాడకు చెందిన 30 కుటుంబాలకు చెందినవారు పోరుమామిళ్లలోని తన స్వగృహంలో గోవిందరెడ్డి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 
Share this article :

0 comments: