YS Jagan Speech on VAT Deeksha - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » YS Jagan Speech on VAT Deeksha

YS Jagan Speech on VAT Deeksha

Written By ysrcongress on Friday, January 27, 2012 | 1/27/2012

తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యాట్ రద్దుపై సంతకం చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి హామీ ఇచ్చారు. వ్యాట్ ని రద్దు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా నర్సరావుపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా జగన్ ప్రసంగించారు. దేశంలో కనీవిని ఎరుగని రీతిలో 5 శాతం వ్యాట్ పెంచారని మండిపడ్డారు. లక్షన్నర దుకాణాలపై ఈ ప్రభావం పడుతుందన్నారు. వ్యాట్ పెంపు వల్ల ఒక్కో కుటుంబంపై ఏడాదికి 14 వందల రూపాయల అదనపు భారం పడుతుందని చెప్పారు. వ్యాట్ పెంపుతో దుకాణాలు మూసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే నిరుద్యోగ సమస్య తీవ్రతరమవుతుందన్నారు.

పన్నుల రూపంలో దోచుకోవడమే ఈ ప్రభుత్వ లక్ష్యం అని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టడంలేదన్నారు. సోనియా గాంధీ మెప్పు పొందడమే వారికి ముఖ్యం అన్నారు. వ్యాట్ పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని జగన్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించే సమయం వచ్చిందన్నారు.

ధర్నా కార్యక్రమంలో వస్త్ర వ్యాపారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ప్రకాశం జిల్లా నుంచి కూడా పలువురు తరలివచ్చారు.

అనంతరం ఆర్డీఓ కార్యాలయ సూపరింటెండెంట్ కు జగన్ వినతి పత్రం అందజేశారు.

Share this article :

0 comments: