రూ.18 లక్షలతో వైఎస్ ఆలయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రూ.18 లక్షలతో వైఎస్ ఆలయం

రూ.18 లక్షలతో వైఎస్ ఆలయం

Written By ysrcongress on Wednesday, February 8, 2012 | 2/08/2012

గుంటూరు జిల్లాలోని ఓ గ్రామ ప్రజలు మహానేత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డే తమకు దేవుడంటూ ఆయనకుఆలయం నిర్మించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మహానేత తమ గ్రామంలో ఉంటే ప్రతిరోజూ తమకు సుఖసంతోషాలు ఉంటాయన్నది వారి విశ్వాసం. నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామంలో వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వనిపెంట నర్సిరెడ్డి, కర్నా వెంకటరామిరెడ్డి, పులిమేర వెంకటేశ్వరరెడ్డి, ఉప్పరపల్లి లక్ష్మారెడ్డి రూ.18 లక్షలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇందులో ఆరడుగుల మహానేత విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. మంగళవారం జగన్నినాదాల నడుమ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. దీన్ని ప్రారంభించారు. దీనికి ముందు ఇదే కుంకలగుంట గ్రామంలో నాలుగు చోట్ల ఏర్పాటు చేసిన మహానేత వైఎస్ విగ్రహాలను, ఎస్టీ కాలనీలో బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. యాత్ర సాగిన ప్రతి దారిలో ప్రజలు బారులు తీరి కనిపించారు. ఆయన వచ్చే మార్గంలో పూలతివాచీలు పరిచారు. మంగళహారతులు పట్టారు.
Share this article :

0 comments: