1994 నుంచి విచారణ చేపట్టాలి: విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 1994 నుంచి విచారణ చేపట్టాలి: విజయమ్మ

1994 నుంచి విచారణ చేపట్టాలి: విజయమ్మ

Written By ysrcongress on Saturday, February 11, 2012 | 2/11/2012

భూ కేటాయింపుల సభా సంఘానికి సంబంధించి శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు విజయమ్మ ఈరోజు ఒక లేఖ రాశారు. 1994 నుంచి అన్ని భూ కేటాయింపులపై సభా సంఘం విచారణ చేపట్టాలని ఆమె కోరారు. అప్పుడే వాస్తవాలు వెలుగు చూస్తాయని తెలిపారు. సభా సంఘం ఏర్పాటు తనను దిగ్ర్భాంతి కలిగించిందని పేర్కొన్నారు. కాగ్, లోకాయుక్తలే మహానేత డాక్టర్ వైఎస్ ని వేలెత్తి చూపలేదని గుర్తు చేశారు. నిర్ణయం తీసుకున్న 11 నెలలకు ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. కమిటీ విధివిధానాలలో ఇప్పటీకి స్పష్టతలేదన్నారు. టిడిపి హయాంలో జరిగిన భూకేటాయింపులపై కూడా విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. కొందరు ఎమ్మెల్యేల డిమాండ్ కూడా ఇదేనని తెలిపారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం దీనికి సిద్ధంగా లేరని పేర్కొన్నారు. 

టిడిపి హయాంలో భారీగా భూ కేటాయింపులు జరిగాయి. కృష్ణపట్నం, గంగవరం పోర్టు, శంషాబాద్ ఎయిర్ పోర్టు, ఎమ్మార్ ప్రాజెక్ట్, రహేజా, ఓడరేవు, విశాఖ ప్రాజెక్ట్, ఆరు పవర్ ప్రాజెక్టులకు, ఎంఐజి భారత్ లకు భారీగా భూములు కేటాయించారు. కాంగ్రెస్, టిడిపి మధ్య జరిగిన లోపాయకారీ ఒప్పందం ప్రకారమే ఇప్పుడు ఈ సభాసంఘాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఐఎఎస్ లను మాత్రమే సిబిఐ విచారించడం తనకు బాధ కలిగించిందన్నారు. ఇతరులను ఎందుకు విచారించడంలేదని ఆమె ప్రశ్నించారు.
Share this article :

0 comments: