2004-09 మధ్య కాలంలో భూకేటాయింపులపైనే టీడీపీ పట్టుపట్టింది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 2004-09 మధ్య కాలంలో భూకేటాయింపులపైనే టీడీపీ పట్టుపట్టింది

2004-09 మధ్య కాలంలో భూకేటాయింపులపైనే టీడీపీ పట్టుపట్టింది

Written By ysrcongress on Sunday, February 12, 2012 | 2/12/2012


* 1994 నుంచీ జరిగిన భూ కేటాయింపులపై సభాసంఘం వేయాలని వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు కోరారు 
* కానీ అసెంబ్లీలో చర్చకు వచ్చిన అంశాలపై సభా సంఘం అని జీవో ఇచ్చారు

హైదరాబాద్ , న్యూస్‌లైన్: విచారణాంశాలను స్పష్టంగా పేర్కొనకుండా భూకేటాయింపులపై సభా సంఘాన్ని ఏర్పాటు చేయటమంటేనే.. దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డిపై ఈ ప్రభుత్వం మరో కుట్ర పన్నుతోందని అర్థమవుతుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ అనుమానం వ్యక్తం చేశారు. ఆయన పార్టీ నాయకుడు కె.కె.మహేందర్‌రెడ్డితో కలిసి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 

‘‘ఎస్‌ఈజెడ్‌లు, వక్ఫ్ భూములపై గత ఏడాది మార్చి 28, 29వ తేదీల్లో అసెంబ్లీలో వచ్చిన అంశాలపై సభాసంఘం అని జీవోలో పేర్కొన్నారు. నాకు తెలిసినంత వరకు సభా సంఘం అంటే నిర్దిష్టమైన ఎజెండాతో సభా సంఘాన్ని నియమించి.. ఆ అంశాలపై దర్యాప్తు చేయాలని ఆదేశించటం చూశాం. ఇప్పుడు ఇది చూస్తే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిపైనా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపైనా మరో కుట్ర జరుగుతోందని.. వారిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ సభా సంఘాన్ని ఏర్పాటు చేశారని అనుమానం కలుగుతోంది’’ అని పేర్కొన్నారు. 

గత ఏడాది మార్చిలో అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రిగారు సభా సంఘాన్ని వేస్తానని హామీ ఇచ్చారు కాబట్టే ఈ రోజు సభకు వచ్చామ’ని సభలో అన్న మాటలను కొణతాల గుర్తుచేశారు. ముఖ్యమంత్రి, కాంగ్రెస్, టీడీపీల మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయనటానికి ఇదీ ఒక నిదర్శనమని చెప్పారు. హెచ్‌ఆర్‌సీ చైర్మన్ ఎంపికతో పాటు సమాచార హక్కు చట్టం కమిషనర్ల ఎంపిక సమయంలోనూ కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు ఇద్దరూ కుమ్మక్కయ్యారని తేలిపోయిందన్నారు. అవన్నీ చూస్తుంటే సభా సంఘం ద్వారా న్యాయం జరుగుతుందని అనిపించటం లేదని చెప్పారు. ఆ రోజు చర్చ సందర్భంగా టీడీపీ నాయకులు కేవలం 2004-09 మధ్య కాలంలో జరిగిన భూకేటాయింపులపై సభా సంఘం వేయాలని పట్టుపడితే.. మిగిలిన అన్ని పక్షాలతో పాటు కాంగ్రెస్, వైఎస్‌ఆర్ అభిమాన ఎమ్మెల్యేలు 1994 నుంచి జరిగిన అన్ని రకాల కేటాయింపులపై సభా సంఘం ఏర్పాటును కోరారని కొణతాల గుర్తు చేశారు. మొత్తం భూకేటాయింపులపై సభా సంఘం దర్యాప్తు వల్ల పెట్టుబడిదారుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని ఆ రోజు జరిగిన చర్చలో ముఖ్యమంత్రి అనటాన్ని కొణతాల తప్పుపట్టారు. 

‘రాజశేఖరరెడ్డి కాలంలో సభా సంఘం దర్యాప్తు చేస్తే వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుందని, చంద్రబాబు కాలంలో దర్యాప్తు చేస్తే పెట్టుబడుదారులు ఆత్మస్థైర్యం కోల్పోతారని అనటం హాస్యాస్పదం’ అని పేర్కొన్నారు. దీనినిబట్టే ముఖ్యమంత్రి మైండ్‌సెట్ తెలిసిపోతోందన్నారు. 

సభలో చర్చ జరిగిన తరువాత ఈ 11 నెలల కాలంలో వాళ్లు కనీసం సభా సంఘం విధి విధానాలపై కూడా ఆలోచనచేయలేదా అని ఎద్దేవా చేశారు. 1994 నుంచి ఇప్పటి వరకూ జరిగిన భూకేటాయింపులన్నింటిపైనా సభా సంఘం వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రిజం సంస్థకు ఇచ్చిన వెయ్యి ఎకరాల కేటాయింపుతో పాటు.. మాజీ సీఎం రోశయ్య అమీర్‌పేట భూకేటాయింపుల వివాదాన్నీ సభా సంఘం పరిధిలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మతో పాటు వైఎస్‌ఆర్ అభిమాన ఎమ్మెల్యేలు 17 మంది స్పీకర్‌కు లేఖ రాశారని తెలి పారు. స్పీకర్ దీనిపై తక్షణం స్పందించాలన్నారు.
Share this article :

0 comments: