22న నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్ల నుంచి ఓదార్పు యాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 22న నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్ల నుంచి ఓదార్పు యాత్ర

22న నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్ల నుంచి ఓదార్పు యాత్ర

Written By ysrcongress on Tuesday, February 21, 2012 | 2/21/2012

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్ర బుధవారం నుంచి గుంటూరు జిల్లాలో పునఃప్రారంభం కానుంది. ఇప్పటి వరకు జిల్లాలో 62 రోజుల పాటు 12 నియోజకవర్గాల్లో జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో చేనేత సమస్యల పరిష్కారం కోసం 48 గంటల దీక్ష, పార్టీ సమావేశాలతో జిల్లాలో జరుగుతున్న ఓదార్పు యాత్రకు విరామం ప్రకటించిన విషయం విదితమే. మళ్లీ ఈ నెల 22న నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్ల నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. జగన్ ఈ నెల 21న రాత్రి హైదరాబాద్ నుంచి పయనమై 22న ఉదయం రొంపిచర్లకు చేరుకొని స్వల్ప విశ్రాంతి అనంతరం యాత్రను ప్రారంభిస్తారు. 

ఈ నెల 9న మండల కేంద్రం రొంపిచర్లలో యాత్రను ముగించారు. అక్కడి నుంచే యాత్రను తిరిగి ప్రారంభించేలా షెడ్యూలు ఖరారు చేశారు. 22న ప్రారంభమయ్యే యాత్ర నరసరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట, ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రత్తిపాడు, గుంటూరు రూరల్ మీదుగా గుంటూరు నగరంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో కొనసాగుతుందని పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. 

జిల్లాలో 62 రోజులపాటు పర్యటించిన జగన్ గ్రామగ్రామాన పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తూ, మహానేత మృతి తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తూ ఓదార్పుయాత్ర కొనసాగించారు. యాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టి పట్టుబట్టిన అభిమానంతో గ్రామాలకు తీసుకెళ్తుండడంతో యాత్ర నిర్ణీత షెడ్యూలు కంటే ఆలస్యంగా సాగుతోంది. గత అక్టోబర్ 16న మంగళగిరి నియోజకవర్గంలో ప్రారంభమైన ఓదార్పుయాత్ర ఈ నెల 9న రొంపిచర్లలో ముగిసింది. 12 రోజుల విరామం అనంతరం తిరిగి బుధవారం ఉదయం రొంపిచర్లలో ఉదయం 9.30 గంటలకు యాత్ర మొదలవుతుంది.
 
 
Share this article :

0 comments: