2జీ స్పెక్ట్రమ్ అంటే... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 2జీ స్పెక్ట్రమ్ అంటే...

2జీ స్పెక్ట్రమ్ అంటే...

Written By ysrcongress on Friday, February 3, 2012 | 2/03/2012


తీగల అవసరం లేకుండా ధ్వని, సమాచార ప్రసారానికి ఉపయోగించిన రెండో తరం టెక్నాల జీని 2జీ అని పిలుస్తున్నారు. ఈ టెక్నాలజీ వాడకంలో పాటించాల్సిన పద్ధతులను గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్(జీఎస్‌ఎం) ద్వారా నిర్ణయించారు. అప్పట్లో మాటలతోపాటు ఎస్‌ఎంఎస్ సందేశాలు పంపేం దుకు మాత్రమే ఈ టెక్నాలజీ ఉపయోగపడింది. రేడియో తరంగాల స్థానంలో విద్యుదయస్కాంత తరంగాలను ఉపయోగించడం ద్వారా తక్కువ స్పెక్ట్రమ్‌లోనే ఎక్కువ సంఖ్యలో కాల్స్‌ను ప్రసారం చేయడం ఈ టెక్నాలజీ ద్వారా వచ్చిన లాభం. అంతేకాకుండా నిర్ణీత ప్రాంతాలను చిన్నభాగాలు గా చేసుకుని (సెల్స్) సమాచార ప్రసారం చేయడం మొదలైందీ ఇక్కడి నుంచే!

ఆకాశంలో హరివిల్లును మీరు చూసే ఉంటారు. ఊదా రంగు మొదలుకొని ఎరుపు వరకూ ఏడు రంగులతో హరివిల్లు ఉంటే... రంగుల స్థానంలో విద్యుదయస్కాంత తరంగాలను ఉంచుకుంటే అది స్పెక్ట్రమ్ అవుతుంది. అతిబలహీనమైన కిలోహెర్ట్జ్ స్థాయి నుంచి అత్యంత బలమైన గిగాహెర్ట్జ్ వరకూ విస్తరించి ఉండే ఈ స్పెక్ట్రమ్ ద్వారా సెల్‌ఫోన్ ప్రసారాలతోపాటు టెలివిజన్, రేడియో ప్రసారాలు కూడా జరుగుతాయి. మిలటరీ, విమానయాన సర్వీసుల కోసం కొంతభాగాన్ని ఉపయోగిస్తారు. 

తొలిగా వాడిందెవరు?

1991లో ఫిన్లాండ్‌కు చెందిన ‘రేడియోలింజ’ అనే కంపెనీ వాణిజ్యస్థాయిలో ఉపయోగించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ కంపెనీ ‘ఎలిసా’అనే కంపెనీలో విలీనమైంది.

ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సిస్(ఎఫ్‌డీఎంఏ): రేడియో స్టేషన్‌లో నిర్ణీత తరంగదైర్ఘ్యం వద్ద ఒక్కో చానల్ వచ్చినట్లు ఎఫ్‌డీఎంఏ టెక్నాలజీలోనూ మొత్తం స్పెక్ట్రమ్‌ను చిన్నచిన్న భాగాలుగా చేస్తారు. 

టైమ్ డివిజన్ మల్టిపుల్ యాక్సిస్ (టీడీఎంఏ): పేరులో ఉన్నట్లే ఇందులో స్పెక్ట్రమ్‌ను కాకుండా ప్రతి సెల్‌ఫోన్ కాల్‌కు ఒక్కో తరంగదైర్ఘ్యంలో కొంత సమయం కేటాయిస్తారు. 

కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సిస్: (సీడీఎంఏ): పైన పేర్కొన్న రెండు టెక్నాలజీలకు భిన్నమైంది. ఇందులో ప్రతి కాల్‌కు నిర్దిష్ట రహస్య కోడ్ కేటాయిస్తారు. అంతేకాదు. స్పెక్ట్రమ్‌లో ఇది అందుబాటులో ఉన్న భిన్న ఫ్రీక్వెన్సీలకు పంచుతారు. తద్వారా పరిమితమైన ఫ్రీక్వెన్సీలోనే ఎక్కువ సంఖ్యలో కాల్స్‌ను నిర్వహించవచ్చు.

ఎంఎంఎస్, నెట్‌లకు తెరతీసిన 2.5జీ: మొబైల్‌ఫోన్ల ద్వారా ఇంటర్నెట్‌ను అందుకునేందుకు వీలు కల్పించిన టెక్నాలజీ 2.5జీ. జీపీఆర్‌ఎస్ వంటి టెక్నాలజీల అభివృద్ధితో ఇది సాధ్యమైంది. అయితే ఇందులో నెట్ స్పీడ్ 56 కేబీపీఎస్ నుంచి 115 కేబీపీఎస్ వరకూ మాత్రమే ఉండేది. తరువాతి కాలంలో ఎడ్జ్ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో మొబైల్‌ఫోన్ల ద్వారా సెకనుకు 238 కిలోబిట్ల వరకూ సమాచారం పంపుకోవడం సాధ్యమైంది. దీన్ని 2.75జీగా పిలుస్తారు. ప్రస్తుతం విసృ్తతంగా ఉపయోగిస్తున్న 3జీ టెక్నాలజీలో హెచ్‌ఎస్‌పీడీఏ , యూఎంటీఎస్ వంటి పద్ధతులను ఉపయోగించడం ద్వారా నెట్ స్పీడ్‌ను 14.4 ఎంబీపీఎస్ స్థాయికి పెంచగలిగారు.
Share this article :

0 comments: