రామోజీ కబ్జాలో 60 ఎకరాలకు పైగా సీలింగ్ భూములు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రామోజీ కబ్జాలో 60 ఎకరాలకు పైగా సీలింగ్ భూములు

రామోజీ కబ్జాలో 60 ఎకరాలకు పైగా సీలింగ్ భూములు

Written By ysrcongress on Saturday, February 25, 2012 | 2/25/2012


అధికారుల సర్వేలో బట్టబయలు
రామోజీ పిటిషన్‌ను కొట్టివేసిన జాయింట్ కలెక్టర్
రూ. 200 కోట్ల విలువైన ఆ భూములు ప్రభుత్వం పేదలకు అసైన్ చేసిన స్థలాలుగా సమాచారం
అసైన్ చేసినవని తేలితే క్రిమినల్ కేసులు తప్పదు
రామోజీ కబ్జాలో 36 ఎకరాల మిగులు భూములు ఉన్నట్లు గతంలోనే తేల్చిన తహశీల్దార్, ఆర్డీఓ
జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కోర్టులో సవాల్ చేసి అడ్డంగా దొరికిపోయిన రామోజీ
ఈటీఎస్ పద్ధతిలో సర్వేకు ఆదేశించిన జేసీ
ఫిల్మ్‌సిటీలో మొత్తం 60.10 ఎకరాల మిగులు భూములున్నట్లు తేల్చిన సర్వే 
ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో పరిశీలించాల్సి ఉంది: జేసీ జగన్నాధం

రంగారెడ్డి జిల్లా, న్యూస్‌లైన్ ప్రతినిధి: ఈనాడు అధినేత రామోజీరావు మరోసారి అడ్డంగా దొరికిపోయారు. ఊళ్లకు ఊళ్లే స్వాహా చేస్తున్న రాజ గురివింద భూదందా మరొకటి బట్టబయలైంది. పట్టా భూముల ముసుగులో మిగులు భూములను సొంతం చేసుకున్న వైనం నిర్ధారణైంది. వ్యవసాయ మిగులు భూముల కింద చాలా ఏళ్ల క్రితం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సుమారు రూ.200 కోట్ల విలువైన భూములు ఇప్పుడు రామోజీ కబ్జాలో ఉన్నట్టు అధికారికంగా తేలింది. రామోజీ కోట ఫిల్మ్ సిటీలోని ఆ భూములను గతంలోనే ప్రభుత్వం పేదలకు అసైన్‌మెంట్ కింద జారీ చేసినట్టు సమాచారం. దీనిపై అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అవి అసైన్డ్ భూములే అయితే రామోజీపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా రామోజీ అడ్డూఅదుపూ లేకుండా అక్రమాలకు పాల్పడ్డారు. ఇదే క్రమంలో మిగులు భూములు స్వాహా చేసిన వైనాన్ని.. హయత్‌నగర్ మండల తహశీల్దార్ గతంలోనే తేల్చారు. ఏ వివాదాన్నీ తేలనీయకుండా కోర్టుల్లోనే కొనసాగించే అలవాటున్న రామోజీరావు తహశీల్దార్ తేల్చిన అంశాన్ని కూడా తొలుత అప్పిలేట్ అథారిటీ వద్ద, తర్వాత జాయింట్ కలెక్టర్ కోర్టులో సవాల్ చేశారు. అయితే అక్కడా రాజగురివిందకు ఎదురుదెబ్బ తగిలింది. అంతేకాదు రామోజీ తానే స్వయంగా తీగలాగి డొంకను కదిలించారు. ఆయన కబ్జాలో 36.27 ఎకరాలున్నట్లు మండలాధికారులు తేల్చితే.. జాయింట్ కలెక్టర్ సర్వేలో మొత్తం 60 ఎకరాలకు పైగా మిగులు భూమిని రామోజీ మింగేసినట్లు తాజాగా నిర్ధారణ అయింది. దీంతో రామోజీ పిటిషన్‌ను జేసీ కొట్టివేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై చర్యలు తప్పని పరిస్థితి ఏర్పడింది.

పట్టాభూముల ముసుగులో..

రామోజీ ఫిల్మ్‌సిటీ విస్తరించి ఉన్న అనాజ్‌పూర్ గ్రామ శివారులో వ్యవసాయ మిగులు భూములను ప్రభుత్వం కొన్ని దశాబ్దాల క్రితం స్వాధీనం చేసుకుంది. వీటిలో కొన్నిటిని నిరుపేదలకు అసైన్ చేసింది. ఈ సర్వే నంబర్లలోనే పట్టాభూములు కూడా ఉండటంతో రామోజీరావు వాటిని కొన్నాడు. ఆ క్రమంలోనే ప్రభుత్వం అప్పట్లో స్వాధీనం చేసుకున్న మిగులు భూములు కూడా ఆయన ఇలాఖాలోకి చేరిపోయాయి. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన మండల అధికారులు, రామోజీ కబ్జాలో మిగులు భూములున్న విషయాన్ని స్వయంగా పరిశీలించి తేల్చారు. సర్వే నంబర్ 275లో 4 ఎకరాలు, సర్వే నంబర్ 281లో 32.27 ఎకరాల మిగులు భూములు రామోజీ కబ్జాలో ఉన్నట్లుగా పేర్కొంటూ కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. రామోజీకి కూడా నోటీస్ జారీ చేశారు. దీంతో కంగుతిన్న రాజగురివింద తహశీల్దార్ నివేదిక తప్పని పేర్కొంటూ ఆర్డీఓ ఆధ్వర్యంలోని అప్పిలేట్ అథారిటీలో సవాల్ చేశారు. పూర్వాపరాలను పరిశీలించిన అప్పిలేట్ అథారిటీ తహశీల్దార్ నివేదిక సరైందేనని తీర్పు వెలువరించింది. ఆ తీర్పును కూడా సవాల్ చేస్తూ రామోజీ జాయింట్ కలెక్టర్ కోర్టును ఆశ్రయించారు. జాయింట్ కలెక్టర్ జగన్నాథం ఈ కేసును పరిశీలించే క్రమంలో గత నవంబర్ 16న ఆ భూములను స్వయంగా పరిశీలించారు. రామోజీ వేసిన ఫెన్సింగ్‌ను పరిశీలించిన క్రమంలో మిగులు భూములు కూడా అందులో కలిసిపోయినట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. అయితే దీన్ని ధ్రువీకరించుకోవాలన్న ఉద్దేశంతో జేసీ ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ (ఈటీఎస్) పద్ధతిలో సర్వేకు ఆదేశించారు. 

రెట్టింపు స్థలాల గుట్టు రట్టు

ఈ సర్వేకు ముందువరకు రామోజీ కబ్జాలో కేవలం 36.27 ఎకరాల మిగులు భూములు మాత్రమే ఉన్నాయని అధికారులు భావించారు. కానీ ఆధునిక ఈటీఎస్ పద్ధతిలో నిర్వహించిన సర్వేలో మొత్తం 60.10 ఎకరాల మిగులు భూములను రామోజీ మింగేశారనే విషయం బట్టబయలైంది. సర్వే నంబర్ 275/2 నుంచి 275/5 వరకు 4 ఎకరాలు, సర్వే నంబర్ 281/32 నుంచి సర్వే నంబర్ 281/65 వరకు 56.10 ఎకరాలు ఆయన కబ్జాలో ఉన్నట్టు తేలింది. తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్టు.. రామోజీ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ కారణంగా.. ఆయన సొంతం చేసుకున్న మిగులు భూముల ఖాతా చిన్నది కాదనే విషయం బట్టబయలైంది.

రివిజన్ పిటిషన్‌ను కొట్టేసిన జేసీ

హయత్‌నగర్ తహశీల్దార్, అప్పిలేట్ అథారిటీ హోదాలో ఆర్డీఓ తీర్పులను సవాల్ చేస్తూ రామోజీ దాఖలు చేసుకున్న రివిజన్ పిటిషన్‌ను, తాజా సర్వే నివేదికను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ జగన్నాథం శుక్రవారం పిటిషన్‌ను కొట్టేశారు. ‘కేవలం కాగితాల్లోని లెక్కలు, అంకెలను చూడ్డం కాదు... నేను స్వయంగా రామోజీ ఫిల్మ్ సిటీలోని భూముల వద్దకు వెళ్లి వాటిని పరిశీలించాను. అక్కడి పరిస్థితులు చూస్తే నాకు వెంటనే అనుమానం వచ్చింది. ఈటీఎస్ పద్ధతిలో సర్వేకు ఆదేశించటంతో నా అనుమానం నిజమని రూఢీ అయింది. దీంతో రామోజీ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ కొట్టేశాను. ఇక సర్వే వివరాల ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో పరిశీలించాల్సి ఉంది’’ అని జేసీ జగన్నాథం శుక్రవారం ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. 

అధికారులపై టీడీపీ, కాంగ్రెస్ నేతల ఒత్తిడి!

రామోజీ భూదందా నిగ్గు తేల్చేందుకు జేసీ జగన్నాథం సర్వేకు ఆదేశించింది మొదలు రామోజీని భుజాన మోసే కొందరు నేతలు అధికారులపై తీవ్రమైన ఒత్తిడి తేవడం ప్రారంభించారు. తహ శీల్దార్, అప్పిలేట్ అథారిటీల వద్ద చుక్కెదురైన క్రమంలో.. జేసీ సర్వేలో కూడా ఎలాగూ నిజాలే వెల్లడవుతాయని రామోజీ ఆందోళన చెందారు. దీంతో తన వందిమాగధులైన నేతలను పురమాయించి ఆయనపై ఒత్తిడి ప్రారంభించారు. అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుచరులతో పాటు తాజా ‘కుమ్మక్కు’ నేపథ్యంలో అధికారపార్టీకి చెందిన కొందరు నేతలు రాజ గురివిందకు వత్తాసు పలకడం గమనార్హం. చంద్రబాబు- కిరణ్ మైత్రికి నిదర్శనంగా ఇప్పటికే ఎన్నో ఉదంతాలు వెలుగు చూసిన నేపథ్యంలో చంద్రబాబు కనుసన్నల్లోనే కాంగ్రెస్ నేతలు.. రామోజీ వ్యవహారం బయటపడకుండా చేసేందుకు అన్నిరకాలుగా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే నవంబర్ 16న రామోజీ ఫిల్మ్‌సిటీ భూములను సందర్శించినప్పుడు వారం రోజుల్లో సర్వే నివేదిక ఇవ్వాలని జేసీ అధికారులను ఆదేశించినా.. మూడు నెలలు గడిచినా నివేదిక జాడే లేకుండా పోయింది. అధికారుల తీరుపై ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది. తప్పని పరిస్థితుల్లో రెవెన్యూ అధికారులు మూడు నెలల తర్వాత నివేదికను బహిర్గతం చేశారు. ఐదు రోజుల క్రితం అది జేసీకి చేరింది. నివేదిక మేరకు రామోజీ పిటిషన్‌ను కొట్టివేస్తూ జేసీ నిర్ణయం తీసుకున్నారు.

Ceiling Lands in Ramoji Kabza:


Share this article :

0 comments: