ఇవాళ బస్తా వడ్లు రూ.750కి పెచ్చురాని అధ్వాన పరిస్థితి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇవాళ బస్తా వడ్లు రూ.750కి పెచ్చురాని అధ్వాన పరిస్థితి

ఇవాళ బస్తా వడ్లు రూ.750కి పెచ్చురాని అధ్వాన పరిస్థితి

Written By ysrcongress on Friday, February 24, 2012 | 2/24/2012

వైఎస్సార్ సువర్ణయుగంలో ప్రతి రైతుకు, మహిళకు, పేదోడికీ ఒక భరోసా ఉండేది
ఇవాళ బస్తా వడ్లు రూ.750కి పెచ్చురాని అధ్వాన పరిస్థితి రాష్ట్రంలో ఉంది
108కు ఫోన్ చేస్తే రెండు మూడు గంటలైనా అంబులెన్స్ రావట్లేదు
వైఎస్‌ను అప్రదిష్టపాలు చేయడానికి కాంగ్రెస్, టీడీపీ నేతలు కుమ్మక్కై
అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు

ఓదార్పు యాత్ర నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘వైఎస్సార్ సువర్ణయుగంలో ఏ రైతుకూ తాను వేసిన పంట ఏ రేటుకు అమ్ముడుపోతుందోనన్న భయమనేదే ఉండేది కాదు. 60 ఏళ్ల అవ్వా తాతలను పలకరిస్తే.. మాకు ఇంకో ఏడాది వయసు వచ్చినగా ఫర్వాలేదు.. మాకు ఏ కష్టం లేకుండా నెలనెలా పెన్షన్ డబ్బులు మా ముఖ్యమంత్రి మా ఇంటికే పంపిస్తాడు అన్న భరోసాతో ఉండేవారు. 

ఇవాళ రాష్ట్రంలో ప్రజలకు అలాంటి భరోసా ఇచ్చే నాయకుడు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ రైతన్న దగ్గరకు వెళ్లి వడ్ల ధర ఎంత ఉందన్నా? అని అడిగితే..! బస్తా వడ్లు రూ.750కిపెచ్చురాని అధ్వాన పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్నామన్నా అని చెప్తుంటే బాధనిపించిందన్నారు. ఇవాళ 108 అనే నంబర్‌కు ఫోన్ కొడితే... 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్ ఏ రెండు మూడు గంటలైనా రాని పరిస్థితులు కన్పిస్తున్నాయని విమర్శించారు. 

గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర 64వ రోజు గురువారం ఆయన రొంపిచర్ల మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. 13 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. పలు గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

వైఎస్ గుర్తుకువస్తూనే ఉంటారు: ఆ దివంగత నేత సువర్ణయుగం మనకు ప్రతి రోజూ.. ప్రతి పనిలో గుర్తుకు వస్తూనే ఉంటుంది. రైతన్న పొలానికి పోతే.. తానేసిన పంట ఏ రేటుకు అమ్ముడుపోతుందోనని భయపడే పరిస్థితులు ఏ రోజూ లేని ఆ సువర్ణయుగం రైతుకు గుర్తుకు వస్తుంది. కారణం ఏమిటంటే.. ఆనాడు మా వైఎస్సార్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడుగా.. ఆన్నీ మా అన్నే చూసుకుంటాడు అనే ధీమా ప్రతి రైతన్నలోనూ ఉండేది. ప్రతి పేద విద్యార్థీ కాలేజీకి వెళ్లి పుస్తకాలు తిరగేస్తున్నప్పుడు, తల్లిదండ్రులు తమ పిల్లలను చదివిస్తున్నప్పుడు వారి ముఖాల్లో కనిపించే చిరునవ్వుల వెనుక ఒక భరోసా ఉండేది. 

పేదరికంలో ఉండి అనారోగ్యం పాలైనప్పుడు, లేకపోతే యాక్సిడెంట్ అయినప్పుడు 108 నంబర్‌కు ఫోన్ కొడితే 20 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చేది. పెద్ద ఆసుపత్రికి తీసుకుపోయి, రూ. లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్‌ను ఉచితంగా చేయించి ఆ పేదవాడి ముఖంలో చిరునవ్వులు పూయించిన ఆ సువర్ణ పాలనలో ఒక భరోసా ఉండేది. కారణం మా వైఎస్సారన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడుగా.. అన్నీ ఆయనే చూసుకుంటాడు అనే నమ్మకం ఉండేది. ఇవాళ ఆ పేదవాడిని చూస్తున్నప్పుడు బాధనిపిస్తోంది. ఇవాళ అటువంటి దివంగత నేత మన మధ్య లేడు అన్నప్పుడు బాధనిపిస్తుంది. ప్రతి పేదవాడి ముఖాన చిరునవ్వులు చూడాలని, ప్రతి పేదవాడి గుండెల్లో చెరగని ముద్ర వేసుకోవాలని, చనిపోయిన తరువాత కూడా ఆ పేదవాడి గుండెల్లో బతికే ఉండాలని, అంతగా పేదవాడి మేలు కోసం తపించాలని, తాపత్రయపడాలని ఆలోచించే నాయకుడు ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో కనపడడంలేదు.

తిరిగిరాని వైఎస్‌ను అప్రదిష్టపాలు చేయడానికి..

ఇవాళ రాష్ట్రంలోనైనా, కేంద్రంలోనైనా సోనియాగాంధీ రాజ్యమేలుతున్నారంటే అందుకు కారణమైన వ్యక్తి దివంగత నేత వైఎస్సార్. అటువంటి నేత చనిపోయాడు అనే సంగతి తెలిసి ఉండి.. తిరిగి రాలేడు అనే సంగతి తెలిసి ఉండి, ఇవాళ ఆయనను అప్రదిష్టపాలు చేయడం కోసమని ఇదే కాంగ్రెస్ పార్టీ నైతిక విలువలన్నీ పక్కనబెట్టి చివరకు చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కైంది. ఇవాళ వారిద్దరూ కలసికట్టుగా రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ల దగ్గర ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇవాళ వీళ్లకు ప్రజలు పట్టడం లేదు.. ప్రజాసమస్యలు పట్టడం లేదు. ఈ రాజకీయ వ్యవస్థ ఎలా తయారైందీ అంటే.. చనిపోయిన దివంగత నేతకు ఒక న్యాయమట.. బతికి ఉన్న బాబుకు వేరొక న్యాయమట!

మా ఊరికి రావాల్సిందే...

ఓదార్పు యాత్రలో భాగంగా గురువారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుబ్బయపాలెంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మాట్లాడాలంటూ జనం పట్టుబట్టారు. ‘ప్రయాణించాల్సిన దూరం చాలా ఉంది. జగన్ను మీరు అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? ఏదో జగన్ వచ్చాడు, రెండే ముక్కలు మాట్లాడాడు అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ నన్ను చిరునవ్వుతో సాగనంపాలి’ అంటూ వారి వద్ద నుంచి సెలవు తీసుకొని వడ్లమూడివారిపాలెం వైపు ప్రయాణమయ్యారు. అన్నవరప్పాడు, వీరవట్నం గ్రామాలకు చెందిన మహిళలు, వృద్ధులు స్టేట్ హైవే మీదకు వచ్చి జగన్ తమ గ్రామాలకు రావాల్సిందేనంటూ ధర్నాకు దిగారు. 

ఇదే దారిగుండా జగన్ వడ్లమూడి చేరుకోవాలి. వైఎస్సార్ కాంగ్రెస్ నేత రామకృష్ణారెడ్డి(ఆర్‌కే) వారి వద్దకు వెళ్లి దాదాపు 30 నిమిషాల పాటు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ లోగా పోలీసులు కాస్త చొరవ చూపి తమశైలిలో వారిని పక్కకు తప్పించే ప్రయత్నం చేశారు. ఇంతలో నలుగురు అవ్వలు జీపు నాలుగు టైర్ల కింద పడుకొని ఎలా పోతారో పొండి అంటూ భీష్మించారు. అదే సమయంలో ముగ్గురు మహిళలు, మరి కొంత మంది యువకులు ‘ఇక మాట్లాడేది లేదు. జగనన్నా మా ఊరుకు వస్తవా? లేకుంటే మమ్ములను మేం కాల్చుకుంటాం చూస్తావా?’ అంటూ వెంట తెచ్చుకున్న కిరోసిన్ మీద పోసుకున్నారు. చేసేది లేక జగన్‌మోహన్‌రెడ్డి వారి వెంట నడిచారు.
Share this article :

0 comments: