వేల ఎకరాలు కారుచౌకగా కట్టబెట్టిన బాబుపై కమిటీ విచారణ ఉండదు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వేల ఎకరాలు కారుచౌకగా కట్టబెట్టిన బాబుపై కమిటీ విచారణ ఉండదు!

వేల ఎకరాలు కారుచౌకగా కట్టబెట్టిన బాబుపై కమిటీ విచారణ ఉండదు!

Written By ysrcongress on Thursday, February 9, 2012 | 2/09/2012

వైఎస్ హయాంలోని భూ కేటాయింపులకే పరిమితమయ్యేలా సభా సంఘం
కాంగ్రెస్-టీడీపీ మ్యాచ్‌ఫిక్సింగ్‌ను మరోసారి బట్టబయలు చేసిన డ్రామా
వేల ఎకరాలు కారుచౌకగా కట్టబెట్టిన బాబుపై కమిటీ విచారణ ఉండదు!
ప్రిజమ్‌కు వెయ్యెకరాలు సంతర్పణ చేసిన సీఎం కిరణ్‌కూ వర్తించదు
మాజీ సీఎం రోశయ్య చేసిన అమీర్‌పేట భూ కేటాయింపులదీ అదే కథ...
సభాసంఘానికి పి.కిష్టారెడ్డి అధ్యక్షుడు, 14 మంది సభ్యులు.. ఆర్నెలల్లో నివేదిక
బాబు అడ్డగోలు భూ కేటాయింపులపై ప్రశ్నించిన ఎమ్మెల్యేలెవరికీ దక్కని స్థానం
వైఎస్, తద్వారా జగనే లక్ష్యంగా.. ఏ స్పష్టత లేని ‘టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్’
వాటి ఖరారుకు శాసనసభా పక్ష నేతల భేటీ ఉంటుందన్న స్పీకర్ హామీ గాలికి...
విచారణను తమకు అనుగుణంగా మార్చుకోవడమే అసలు లక్ష్యం!

హైదరాబాద్, న్యూస్‌లైన్: కాంగ్రెస్-టీడీపీ కుయుక్తులు, కుమ్మక్కు బాగోతం మరోసారి అడ్డంగా బయటపడ్డాయి. ఆ రెండు పార్టీలూ కలిసి దివంగత వైఎస్ కుటుంబంపై నిస్సిగ్గుగా సాగిస్తున్న కుట్రల్లో మరో అంకానికి తెర లేచింది. భూ కేటాయింపులపై శాసనసభా సంఘాన్ని ఏర్పాటు చేయడంలో పూర్తిగా వైఎస్ కుటుంబాన్నే అధికార, ప్రతిపక్షాలు లక్ష్యంగా చేసుకున్న వైనం స్పష్టమైంది. మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి చైర్మన్‌గా 14 మంది సభ్యులతో ఈ కమిటీని స్పీకర్ నాదెండ్ల మనోహర్ బుధవారం నియమించారు. సెజ్‌లకు భూ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయంటూ గత బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలపై, దాదాపుగా ఏడాది తర్వాత ఇప్పుడిలా హఠాత్తుగా సభా సంఘం వేయడం వెనుక పెద్ద తతంగమే సాగినట్టు తెలుస్తోంది. పూర్తిగా బాబు ఆరోపణలకు అనుగుణంగానే కమిటీ ఏర్పాటు జరిగినట్టు దాని టర్మ్స్ అండ్ రిఫరెన్స్ స్పష్టం చేస్తున్నాయి.

కేవలం వైఎస్ హయాంలోని భూ కేటాయింపులకు మాత్రమే కమిటీ పరిమితమయ్యేలా నియమ నిబంధనలను నిర్దేశించడంలో బాబు, కిరణ్ తెర వెనక పూర్తిస్థాయిలో చక్రంతిప్పినట్టు స్పష్టమవుతోంది. టర్మ్స్ అండ్ రిఫరెన్స్‌లో స్పష్టత లేకపోవడం దీనికి మరింతగా బలం చేకూరుస్తోంది. నిర్దిష్టంగా ఏమీ చెప్పకుండా, ‘2011 మార్చి 28, 29 తేదీల్లో అసెంబ్లీలో జరిగిన చర్చలోని అంశాలు కమిటీ పరిశీలనలోకి వస్తాయి’ అని ‘టర్మ్స్ అండ్ రిఫరెన్సు’లో తొలి అంశంగా పేర్కొనడమే దీనికి తార్కాణం! వైఎస్‌ను, తద్వారా ఆయన కుమారుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్ చేసేందుకు వీలుగా, సమయానుకూలంగా విచారణ పరిధి తదితరాలను ఇష్టానుసారం మార్చుకునే వెసులుబాటు కోసమే ఇలా చేశారని పీసీసీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి! పైగా సభాసంఘం టర్మ్స్ అండ్ రిఫరెన్సులను నిర్ణయించేందుకు అన్ని పార్టీల శాసనసభా పక్ష నేతలతో సమావేశమవుతామని నాదెండ్ల మనోహర్ గతంలో ప్రకటించగా, అదేమీ లేకుండానే హడావుడిగా కమిటీని ప్రకటించేశారు. దానికి తోడు.. వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలతో పాటు, బాబు హయాం నాటి భూ కేటాయింపులను ప్రశ్నిం చిన ఎమ్మెల్యేలెవరికీ కమిటీలో స్థానమే కల్పించకపోవడం కూడా అసలు ఉద్దేశాలను స్పష్టంగానే బయట పెడుతోంది. కమిటీ ఏర్పాటును ఏడాదిగా నాన్చడం, అటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఇటు వైఎస్ అభిమాన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఎదురైన సమయంలో దాన్ని ప్రకటించడం గమనార్హం!

బాబు పాలనలో ఏకంగా అడ్డగోలుగా 18 వేల ఎకరాలను అడ్రస్ లేని అనేక కంపెనీలకు కట్టబెట్టిన అంశంపై లోకం కోడై కూస్తున్నా ప్రస్తుత కమిటీ పరిధిలోకి ఆ కేటాయింపుల్లో వేటినీ చేర్చలేదు. ఐఎంజీ భారత అనే అడ్రస్ లేని బినామీ కంపెనీకి హైదరాబాద్‌లో వేల కోట్ల విలువైన 850 ఎకరాలను కారుచౌకగా చంద్రబాబు కట్టబెట్టడం తెలిసిందే. కానీ కిరణ్ సర్కారు దాన్ని కూడా కమిటీ పరిధిలోకి చే ర్చకుండా బాబుపై ప్రేమను చాటుకుంది! రోశయ్య సీఎం హోదాలో రాజధాని నడిబొడ్డున అమీర్‌పేటలోని వందల కోట్ల విలువైన భూములను బాబు సూచనల మేరకు టీడీపీకి చెందిన జీఎన్ నాయుడికి ధారాదత్తం చేసిన వైనం కూడా కమిటీ పరిశీలనలోకి రాకుండా అధికార, ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్టు కనబడుతోంది. నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించాకే కొత్తగా పరిశ్రమలకు భూ కేటాయింపులు చేస్తామని గత బడ్జెట్ సమావేశాల్లో నిండు సభలో ప్రకటిం చిన కిరణ్, దాన్ని తుంగలో తొక్కుతూ ఇటీవలే ప్రిజమ్ సిమెంట్స్ కంపెనీకి కర్నూలులో 1,000 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టారు. అదే ప్రాంతంలో మరో ప్రైవేటు కంపెనీ ఎకరా మూడు లక్షలు చొప్పున రైతులకు చెల్లించి భూములు కొన్నా సర్కారు మాత్రం ప్రిజమ్‌కు ఎకరా లక్షకే అప్పగించేసింది. కానీ దీన్నీ కమిటీ పరిశీలన పరిధిలోకి చేర్చలేదు!
కుమ్మక్కు ఆనాడే బట్టబయలు: వైఎస్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని కిరణ్-బాబులు కుమ్మక్కై చిరకాలంగా ఆడుతున్న నాటకాన్ని రాష్ట్ర ప్రజలు అడుగడుగునా గమనిస్తూనే ఉన్నారు.

వైఎస్‌ఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా టీడీపీ-కాంగ్రెస్ అపవిత్ర బంధం గత బడ్జెట్ సమావేశాలకు ముందు నుంచే బలపడింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడపలో బాబు టీడీపీ అభర్థిని పోటీ పెట్టకుండా తమ ఓట్లను కాంగ్రెస్‌కు వేయించారు. చిత్తూరులోనూ అదే సీను పునరావృతమైంది. వైఎస్ అభిమాన అభ్యర్థిని ఓడించేందుకు స్వయంగా కిరణే టీడీపీ అభ్యర్థికి కాంగ్రెస్ ఓట్లను వేయించడంపై అధికార పార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. ఇక బాబు-కిరణ్ కుమ్మక్కు గత బడ్జెట్ సమావేశాల్లో సభా వేదిక నుంచే మరింత స్పష్టంగా బయటపడింది. భూ కేటాయింపులపై కమిటీ వేస్తామని కిరణ్ ముందుగా ఒప్పుకున్నందుకే తాము సభలోకి వచ్చామని బాబు అసెంబ్లీలోనే ప్రకటించారు! పైగా చంద్రబాబు అక్రమాస్తుల వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హైకోర్టులో వేసిన కేసులో కౌంటర్ వేయాలని కోర్టు సూచించినా, ప్రభుత్వం మాత్రం కనీసం న్యాయవాదిని కూడా పంపకుండా బాబుకు తనవంతు సహకారం అందించింది.

14 మందితో ‘భూ’కమిటీ

భూ కేటాయింపులో అవకతవకల ఆరోపణలపై విచారణకు శాసనసభా కమిటీని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఏర్పాటు చేశారు. నారాయణఖేడ్ (మెదక్) ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి చైర్మన్‌గా 14 మంది సభ్యులతో దీన్ని ప్రకటిస్తూ అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారాం బుధవారం బులెటిన్ విడుదల చేశారు. జి.వెంకటశేషు (కొండెపి), జి.వీరశివారెడ్డి (కమలాపురం), జి.రవికుమార్ (అద్దంకి), తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (సంగారెడ్డి), రౌతు సూర్యప్రకాశరావు (రాజమండ్రి), కె.వెంకటరామిరెడ్డి (ధర్మవరం), బండారు సత్యానందరావు (కొత్తపేట), పి.అశోక్‌గజపతిరాజు (విజయనగరం), పయ్యావుల కేశవ్ (ఉరవకొండ), పోచారం శ్రీనివాసరెడ్డి (బాన్సువాడ), జి.మల్లేశ్ (బెల్లంపల్లి), అక్బరుద్దీన్ ఒవైసీ (చాంద్రాయణగుట్ట), జూలకంటి రంగారెడ్డి (మిర్యాలగూడ), జయప్రకాశ్ నారాయణ (కూకట్‌పల్లి) సభ్యులు. కమిటీకి ఆరు నెలల కాలపరిధి విధించారు. ఆలోగా అది అసెంబ్లీకి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. కమిటీ పరిశీలనకు కొన్ని నియమ నిబంధనలను విధించినా, వాటిపై ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా భూ కేటాయింపులపై రెండురోజుల చర్చలో ప్రస్తావనకు వచ్చిన అంశాల ను కమిటీ పరిశీలిస్తుందని మాత్రం నిర్దేశించారు.

సభలోనే తేల్చుకుంటాం: బీజేపీ

భూ కేటాయింపులపై వేసిన ఈ కమిటీలో తమను విస్మరించడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తంచేసింది. అసెంబ్లీలో ఒకే ఒక్క సభ్యుడున్న పార్టీలకు కూడా అవకాశమిచ్చి, ఇద్దరు సభ్యులున్న తమకు కమిటీలో చోటు కల్పించకపోవడమేమిటని బీజేపీ శాసనసభాపక్ష నేత యెండల లక్ష్మీనారాయణ ప్రశ్నించారు.
Share this article :

0 comments: