నెల్లూరు చేరుకున్న వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నెల్లూరు చేరుకున్న వైఎస్ జగన్

నెల్లూరు చేరుకున్న వైఎస్ జగన్

Written By ysrcongress on Friday, February 10, 2012 | 2/10/2012

ఒక్క రోజు పర్యటనలో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ నెల్లూరు చేరుకున్నారు. గుంటూరు నుంచి రైల్లో తెల్లవారుజామున నెల్లూరుకు చేరుకున్న ఆయనకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. 

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, జిల్లా కన్వినర్ కాకాని గోవర్థనరెడ్డితోపాటు పార్టీ నేతలు రామిరెడ్డి ప్రతాపరెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మహిళా నేతలు అనిత, మమత తదితరులు తెల్లవారుజామునే రైల్వే స్టేషన్ చేరుకుని జననేతకు స్వాగతం పలికారు.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె వివాహానికి హాజరవుతారు. అక్కడ్నుంచి స్థానిక సుజాతమ్మ కాలనీలోని మేకపాటి అతిథి గృహానికి చేరుకుంటారు. 

అక్కడ పార్టీ నేతలతో సమావేశమై జిల్లాలో పార్టీ పరిస్థితిపై చర్చిస్తారు. అనంతరం స్థానిక పొదలకూరు రోడ్డులో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ బాలచెన్నయ్య నెలకొల్పిన వైఎస్సార్ ప్రజా వైద్యశాలను ప్రారంభిస్తారు. తర్వాత వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు మండలం వేపినాపి, సిద్ధవరంలో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. రాపూరులో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. అక్కడే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం కడపకు బయల్దేరి వెళ్తారు.
Share this article :

0 comments: