మూడు వేల కోట్లతో స్థిరీకరణ నిధి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మూడు వేల కోట్లతో స్థిరీకరణ నిధి

మూడు వేల కోట్లతో స్థిరీకరణ నిధి

Written By ysrcongress on Saturday, February 4, 2012 | 2/04/2012

వచ్చే సువర్ణయుగంలో నేతన్నలు, వృద్ధుల పింఛన్‌ను రూ.700కు పెంచుతాం
ప్రతి నేత కార్మికుడికీ రూ.లక్ష చొప్పున వడ్డీ లేని రుణాలిస్తాం
దేశంలో ఎక్కడా లేనంత మంచి పాలసీని నేత కార్మికులకు అమలు చేస్తాం
నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ పాలకులకు కనపడడం లేదా?
రుణ మాఫీ నిధులు, ఫీజు బకాయిలు విడుదలకు 12 నుంచి ధర్మవరంలో దీక్ష
మూడు రోజులపాటు... 48 గంటల దీక్ష చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా

రాజమండ్రి, న్యూస్‌లైన్: చేనేత కార్మికుల కష్టాలు తీరిపోయే రోజు త్వరలోనే వస్తుందని, రాబోయే ఆ సువర్ణయుగంలో 50 ఏళ్లు నిండిన నేతన్నలకు, వారితోపాటే వృద్ధులకు పింఛన్‌ను రూ.200 నుంచి రూ.700కు పెంచుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ప్రతి నేత కార్మికుడికీ రూ.లక్ష చొప్పున వడ్డీ లేని రుణాలిస్తామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరుగుతున్న అఖిల భారత దేవాంగ మహాసభల వేదికపై జగన్ ఈ హామీలిచ్చారు. మూడురోజులపాటు సాగే ఈ సభలకు తొలిరోజు శుక్రవారం జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. 

ఇక్కడికి రాకముందు ఒక విషయం నా దృష్టికి వచ్చింది. ఈ రోజు (శుక్రవారం) ధర్మవరంలో ఇద్దరు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిసింది. ఇవాళ వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలోకి వెళుతున్నారంటే.. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? లేదా? అన్న సంశయం కలుగుతోంది. చేనేత కార్మికుల రుణమాఫీ కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ రెండోసారి అధికారంలోకి వచ్చాక రూ.312 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. ఆయన మరణించాక నేతన్నలను పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. ఆయన కేటాయించిన రూ.312 కోట్లలో కనీసం రూ.100 కోట్లు కూడా ఇవ్వని పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వానికి అసలు సిగ్గుందా? లేదా అన్నది అర్థంకావడం లేదు. ఈ వ్యక్తిగత రుణాలను మాఫీ చేసి, రూ.లక్ష వడ్డీ లేని రుణాన్ని ఇచ్చి ఉంటే ప్రతి చేనేత కార్మికుడు ఇది నా ప్రభుత్వం అని కాలర్ ఎగరేసి చెప్పుకునేవాడు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వారిని గాలికి వదిలేసింది. మనసున్న మారాజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ చేనేత కార్మికుల బతుకులు మారతాయి. వైఎస్ మాత్రమే అలా మనసున్న మారాజులా ఆలోచించారు.

ధర్మవరంలో మూడు రోజుల దీక్ష

చేనేత కార్మికులను పట్టించుకోని ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా, నేతన్నలకు మద్దతుగా ధర్మవరంలో ఈ నెల 12 నుంచి మూడురోజులపాటు 48 గంటల నిరాహార దీక్ష చేస్తానని ప్రకటిస్తున్నా. మరికొద్ది రోజుల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నందున వైఎస్సార్ ప్రకటించిన రూ.312 కోట్ల రుణ మాఫీ నిధులను విడుదల చేయాలంటూ ఈ దీక్ష ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. పేద విద్యార్థుల చదువుల కోసం వైఎస్ రూపొందించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం నీరుగారుస్తోంది. ఆ బకాయిలు కూడా తక్షణం విడుదల చేసే విధంగా దీక్ష ద్వారా ఒత్తిడి తెస్తాం. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆర్టిజన్ కార్డులను చేనేత కార్మికులకు అందజేయగా, అవి చెత్తబుట్టలో వేసే విధంగా ప్రస్తుత ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసింది. వచ్చే సువర్ణయుగంలో.. ఆ కార్డులున్న ప్రతిఒక్కరూ గర్వంగా చెప్పుకునేలా, వాటిని తిరిగి పునరుద్ధరించి వైఎస్ గర్వపడేలా చర్యలు తీసుకుంటాం. ఆర్టిజన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.లక్ష వడ్డీలేని రుణం అందించేలా కృషి చేస్తాం. వచ్చే సువర్ణయుగంలో.. దేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలోనూ లేని మంచి పాలసీని చేనేత కార్మికుల కోసం రూపొందిస్తాం.

తరలివచ్చిన నేతలు: ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, దేవాంగుల కులగురువు, హంపి హేమకూట గాయత్రీ పీఠాధిపతి దయానందపురి మహాస్వామీజీ, దేవాంగ మహాసభల నిర్వాహక కమిటీ అధ్యక్షులు బొమ్మన రాజ్‌కుమార్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే చందన రమేష్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యేలు వడ్డి వీరభద్రరావు, చిర్ల జగ్గిరెడ్డి, కుడుపూడి చిట్టబ్బాయి, వరుపుల సుబ్బారావు, పెండెం దొరబాబు, పాతపాటి సర్రాజు తదితరులు పాల్గొన్నారు.

మూడు వేల కోట్లతో స్థిరీకరణ నిధి: జగన్

రైతులకు ఎప్పుడు ఏ కష్టమొచ్చినా తక్షణమే స్పందించి ఆదుకునేందుకు వీలుగా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3 వేల కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని జగన్ చెప్పారు. శుక్రవారం అమలాపురంలో పార్టీ నేత కుడుపూడి చిట్టబ్బాయి నివాసంలో తనను కలిసిన రైతు సంఘాల నేతలకు ఈ మేరకు హామీనిచ్చారు. ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ కూడా ప్రవేశపెడతామని వారికి చెప్పారు.
Share this article :

0 comments: