ద్వీపాన్ని చిరంజీవికి కానుకగా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ద్వీపాన్ని చిరంజీవికి కానుకగా

ద్వీపాన్ని చిరంజీవికి కానుకగా

Written By ysrcongress on Saturday, February 11, 2012 | 2/11/2012

మరో ప్రకృతి ప్రసాదం ప్రైవేటుపరమైంది! కృష్ణానదిలో విజయవాడకు సమీపంలో సహజసిద్ధంగా ఏర్పడిన భవానీద్వీపాన్ని అభివృద్ధి పేరుతో ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారు!! కనకదుర్గమ్మ సాక్షిగా... విజయవాడలో స్వయంగా పర్యాటక మంత్రి వట్టి వసంత్‌కుమార్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటించారు. రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష షిప్పింగ్‌ అసోసియేషన్‌కు దీనిని లీజుకు అప్పగించనున్నట్టు ఆయన పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఈ ద్వీపం ప్రైవేటీకరణ అంశం గత కొద్దికాలంగా ఎంతో వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య ఎట్టకేలకు ఈ అంశంపై ప్రభుత్వం తన నిర్ణయాన్నితలెత్తుతున్నాయి. విజయవాడలో కనకదుర్గ ఆలయానికి సమీపంలోనే భవానీద్వీపం ఉంది. దీన్ని అభివృద్ధి చేయాలని 'ఉడా' 1985లో ప్రతిపాదించింది. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ శంకుస్థాపన సమయంలో పర్యాటకశాఖకు అప్పగించాలని నిర్ణయించారు. ఆ శాఖ అభివృద్ధి పనులను చేపట్టింది. ఏడాదికి రూ. 25 లక్షల ఆదాయం వస్తున్నట్టు చెబుతోంది. రెండేళ్లుగా ఆదాయం మరీ సన్నగిల్లిందని అంటోంది. ప్రైవేటుపరం చేయాలనే ఆలోచనతో ఉద్దేశపూర్వకంగానే ఆదాయం పెంపుపై దృష్టి సారించడంలేదనే విమర్శలున్నాయి. నిర్మాత అల్లూ అరవింద్‌ సినిమా షూటింగ్‌ల కోసం ఈ ద్వీపంపై కన్నేశారని, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినందుకు ప్రతిఫలంగా కాంగ్రెస్‌ ఈ ద్వీపాన్ని చిరంజీవికి కానుకగా అప్పగిస్తోందంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది.నదీపరివాహక ప్రాంతాల పరిరక్షణ చట్టం ప్రకారం ద్వీపంలో 20 శాతానికి మించి భవన నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. సాయంత్రం 6 గంటల తరువాత బోటు ప్రయాణానికి అనుమతించరు. ఈ రెండు నిబంధనల్లో మినహాయింపు ఇవ్వాలని ఇప్పటికే నీటిపారుదలశాఖకు విజ్ఞాపనలు అందడం గమనార్హం.పర్యాటకులను ఆకట్టుకునేలా దీన్ని తీర్చిదిద్దుకునేందుకు తమ వద్ద నిధులు లేవని అందుకే ప్రైవేటీకరణ చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అసలు సంగతి వేరనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రైవేటుపరం చేయకుండా ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధిసంస్థ దీన్ని అభివృద్ధి చేయాలనే డిమాండు ప్రతిపక్షాలు, పర్యాటశాఖ ఉద్యోగుల నుంచి వస్తోంది.
Share this article :

0 comments: