ఏ కోర్టునూ ఆశ్రయించబోనని బీరాలు పలికారాయన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏ కోర్టునూ ఆశ్రయించబోనని బీరాలు పలికారాయన

ఏ కోర్టునూ ఆశ్రయించబోనని బీరాలు పలికారాయన

Written By ysrcongress on Friday, February 17, 2012 | 2/17/2012

** అది 2011 అక్టోబరు. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు అధికారాన్ని దుర్వినియోగం చేసి భారీగా ఆస్తులు కూడబెట్టారని, బినామీల పేరిట ఆస్తులు పోగేసుకున్నారని, ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంటూ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదేమీ శంకర్రావు రాసిన లేఖ లాంటిది కాదు. ఆరోపణలు చేసిన 20 అంశాలకు మద్దతుగా 2,424 పేజీల డాక్యుమెంట్లను జతచేశారు. ప్రజాహిత వ్యాజ్యం కనక తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ గులాం మహమ్మద్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు నవంబరు 1న ఇది విచారణకు వచ్చింది. వాదనలు విన్న ధర్మాసనం పెండింగ్‌లో పెట్టింది.

** నవంబరు 14న ధర్మాసనం.. ఆరోపణల్లో నిజానిజాల్ని నిగ్గు తేల్చేందుకు సీబీఐ, ఈడీ, రాష్ట్ర పోలీసు విభాగాల చేత ప్రాథమిక విచారణకు ఆదేశించింది.

** జగన్‌మోహన్‌రెడ్డి కేసులో ఆదేశాలు వెలువడిందే తడవుగా... వాటి కోసమే ఎదురు చూస్తున్నట్లుగా రంగంలోకి దిగి పలువురిని పిలిచి విచారించిన సీబీఐ... ఈ కేసులో కోర్టు ఆదేశాల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. చంద్రబాబుకు కావలసినంత టైమిచ్చింది. దీంతో చంద్రబాబు తన బినామీల ద్వారా కథ నడిపించారు.

** నిజానికి తనపై హైకోర్టు విచారణకు ఆదేశించిందని తెలిసి చంద్రబాబు నాయుడు మొదట షాకయ్యారు. ‘‘తప్పు చేయలేదని ధీమా ఉంటే సుప్రీం కోర్టుకెళ్లకండి. విచారణలో ఎలాగూ మీ నిర్దోషిత్వం తేలుతుంది’’ అంటూ జగన్‌మోహన్‌రెడ్డిపై అప్పటికే తను, తన పార్టీ సహచరులు చేసిన కామెంట్లు గుర్తుకొచ్చాయి. అందుకే ఈ విచారణ నిలిపివేయాలంటూ ‘తాను’ ఏ కోర్టునూ ఆశ్రయించబోనని బీరాలు పలికారాయన. మాటలైతే అన్నారు కానీ ఊరుకోలేదు. బాబు వెళ్లకున్నా ఆయన బినామీలు సీఎం రమేష్, నామా నాగేశ్వరరావు, రామోజీ సుప్రీం కోర్టుకెళ్లారు. ఈ వ్యవహారంలో జోక్యానికి సుప్రీం నిరాకరించింది. 

** హైకోర్టుకు వెళ్లమని సుప్రీం చెప్పింది రమేష్, నామా, రామోజీ తదితరులకు. కానీ హైకోర్టులో బాబూ వెకేట్ పిటిషన్ వేశారు. తనపై దర్యాప్తు నిలిపేయాలన్నారు.

** ఇదిగో... వీళ్లంతా మళ్లీ హైకోర్టుకు వచ్చిన సమయంలో... అంటే దాదాపు రెండు వారాల తరవాత సీబీఐ జాయింట్ డెరైక్టర్ తీరిగ్గా హైకోర్టుకు వచ్చారు. కోర్టు ఉత్తర్వులు తీసుకుని ప్రాథమిక విచారణ ప్రారంభించారు. చేయటమైతే చేశారు గానీ విచారణ మాత్రం పెద్దగా ముందుకు సాగలేదు. ఒక్కొక్కరిని మెల్లగా పిలవటం మొదలుపెట్టారు.

** హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మదన్ బి. లోకూర్ నియమితులు కావటంతో కేసు ఆయన నేతృత్వంలోని బెంచ్ ముందుకు వచ్చింది. ఆయన విచారణ మొదలుపెట్టారు. ఇంతలో అత్యంత విచిత్రంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రంగంలోకి దిగింది. ఈ కేసులో అది ప్రతివాది కాకపోయినా... తనపైనా ఆరోపణలు వచ్చాయి కనక తన వాదన కూడా వినాలంటూ ‘ఇంప్లీడ్’ పిటిషన్ దాఖలు చేసింది. అయితే రిలయన్స్ రంగంలోకి రాగానే... తనకు రిలయన్స్‌లో వాటాలున్నాయి కాబట్టి తాను ఈ కేసును విచారించలేనంటూ జస్టిస్ లోకూర్ వైదొలిగారు. కేసును రోస్టర్ ప్రకారం తదుపరి బెంచ్‌కు పోస్ట్ చేశారు.

** చంద్రబాబు బినామీల తరఫున వకాలత్‌లు వేసిన న్యాయవాదులు... పలువురు జడ్జిల ముందు ‘నాట్ బిఫోర్’గా ఉండటంతో ఈ కేసు జస్టిస్ గులాం మహమ్మద్ బెంచ్‌ను, జస్టిస్ గోపాలరెడ్డి బెంచ్‌ను దాటిపోయింది. జస్టిస్ వంగాల ఈశ్వరయ్య బెంచ్ ముందుకు వచ్చింది. అయితే ఈశ్వరయ్య భార్య, సోదరులు అంతా తెలుగుదేశం పార్టీలో ఉన్న విషయం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. ‘నాట్ బిఫోర్’ నాటకం ద్వారా ఈ కేసు ఆయన ముందుకు వచ్చిందని చెబుతూ.. ఈ పద్ధతిని వై.ఎస్.విజయమ్మ తరఫు న్యాయవాది సుశీల్‌కుమార్ వ్యతిరేకించారు. ‘‘న్యాయ వ్యవస్థలోని నీతిమాలిన తనాన్ని నేను ప్రశ్నిస్తున్నా?’’ అని ఈ విచారణ సందర్భంగా సుశీల్ గట్టిగా అడిగారు కూడా. 

** డిసెంబరు 9న ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ ఈశ్వరయ్య వైదొలిగారు. రోస్టర్ ప్రకారం.. కేసు జస్టిస్ రఘురాం వద్దకు వెళ్లాల్సి ఉండగా అక్కడ కూడా నాట్ బిఫోర్‌లు ఉండటంతో జస్టిస్ రోహిణి నేతృత్వంలోని ధర్మాసనానికి చేరింది. చంద్రబాబుపై ఇది వరకు డి.ఎల్.రవీంద్రారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు వేసిన మూడు పిటిషన్లను కూడా జస్టిస్ రోహిణి డిస్మిస్ చేసిన అంశాన్ని వై.ఎస్.విజయమ్మ తరఫు న్యాయవాది ప్రస్తావించారు. గతంలో ఇలా చంద్రబాబుకు అనుకూలంగా ఉత్తర్వులిచ్చినందున పక్షపాతానికి ఆస్కారముందనే భయాందోళనలు వ్యక్తంచేశారు. వారు భయపడినట్టే... జస్టిస్ రోహిణి ఈ విచారణను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చారు.

** ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బాబు అమలు చేసిన ‘నాట్ బిఫోర్’ నాటకాన్ని ప్రస్తావిస్తూ... ‘‘ఇక్కడ మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. ఈ కేసును వేరే రాష్ట్ర హైకోర్టుకు బదలాయించండి’’ అంటూ 2011 డిసెంబరు 12న వై.ఎస్.విజయమ్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

** అయితే ఒకరిద్దరు జడ్జిలపై అనుమానాలు, సందేహాలు ఉన్నాయనే కారణంతో ఈ కేసును వేరే రాష్ట్రానికి మారిస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే నిష్పాక్షికత లేదనుకునే ప్రమాదం ఉందని, అందుకని మార్చలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. మీకు అన్యాయం జరిగితే సుప్రీంను ఆశ్రయించవచ్చని సూచిస్తూ... పిటిషన్‌ను ఉపసంహరించుకోవాల్సిందిగా విజయమ్మకు సూచించింది.

** వైఎస్ విజయమ్మ తన పిటిషన్‌ను సుప్రీంలో ఉపసంహరించుకున్నారు. హైకోర్టులో కేసుపై గురువారంనాడు తీర్పు వెలువరించిన జస్టిస్ రోహిణి బెంచ్... ‘‘ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించే అర్హత ఈ పిటిషన్‌కు లేదు’’ అంటూ మొత్తం పిటిషన్‌నే కొట్టివేసింది.
Share this article :

0 comments: