ఘనంగా వైవీ సుబ్బారెడ్డి కుమారుడి రిసెప్షన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఘనంగా వైవీ సుబ్బారెడ్డి కుమారుడి రిసెప్షన్

ఘనంగా వైవీ సుబ్బారెడ్డి కుమారుడి రిసెప్షన్

Written By ysrcongress on Thursday, February 2, 2012 | 2/02/2012


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తోడల్లుడు వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి సోదరుడు ప్రకాష్‌రెడ్డ్డి కుమార్తె అపూర్వల వివాహ రిసెప్షన్ బుధవారం రాత్రి నెక్లెస్ రోడ్డులోని జల విహార్‌లో ఘనంగా జరిగింది. గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్, అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, కేంద్ర మంత్రులు పళ్లంరాజు, దగ్గుబాటి పురందేశ్వరి.. వెంకటేశ్వరరావు దంపతులు, రాష్ట్ర మంత్రులు పి.సుదర్శన్‌రెడ్డి, పి.విశ్వరూప్, కాంగ్రెస్ నాయకుడు కె.చిరంజీవి, పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, లగడపాటి రాజగోపాల్, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, సినీ నటులు కృష్ణంరాజు, జయసుధ, మురళీమోహన్, డీజీపీ వి.దినేష్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితోపాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Share this article :

0 comments: