వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల భేటీ వాయిదా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల భేటీ వాయిదా

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల భేటీ వాయిదా

Written By ysrcongress on Thursday, February 16, 2012 | 2/16/2012

 గురువారం జరగాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం వాయిదా పడింది. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అస్వస్థతకు గురికావడమే ఇందుకు కారణమని పార్టీ నేతలు తెలిపారు. ధర్మవరంలో మూడు రోజుల చేనేత దీక్ష సందర్భంగానే జగన్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అయినా పట్టుదలగా ముందుగా ప్రకటించిన మేరకు ఆయన దీక్ష కొనసాగించారు. అయితే వరుసగా మూడు రోజుల పాటు దీక్షలో పాల్గొనడంతో అనారోగ్యం నుంచి కోలుకోలేకపోయారు. 

బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్న ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. పూర్తిస్థాయి విశ్రాంతి అవసరమని వారు స్పష్టం చేయడంతో, గురువారం నాటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంతో పాటు శుక్రవారం నాటి మున్సిపల్ పరిశీలకుల భేటీని కూడా వాయిదా వేశారు. వాటిని ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత ప్రకటిస్తామని పార్టీ నేతలు చెప్పారు. జగన్‌కు పూర్తిస్థాయి విశ్రాంతి తప్పనిసరని వైద్యులు చెప్పిన నేపథ్యంలో ఫిబ్రవరి 19 నుంచి గుంటూరులో పునఃప్రారంభం కావాల్సిన ఓదార్పుయాత్ర షెడ్యూలులో కూడా కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. 

19కి బదులు 22 నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. దానికోసం జగన్ 21 రాత్రి గుంటూరు వెళ్తారు. మరోవైపు ఫిబ్రవరి 16న తూర్పుగోదావరి, 17న ప్రకాశం, 18న నెల్లూరు జిల్లా స్థాయి పార్టీ విస్త్రత సమావేశాలు కేంద్ర కార్యాలయంలో యథావిధిగా జరుగుతాయని పార్టీ కోశాధికారి పి.ఆర్.కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
Share this article :

0 comments: