జగన్ చేనేత దీక్ష పోస్టర్ విడుదల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ చేనేత దీక్ష పోస్టర్ విడుదల

జగన్ చేనేత దీక్ష పోస్టర్ విడుదల

Written By ysrcongress on Wednesday, February 8, 2012 | 2/08/2012

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12 తేదిన అనంతపురం జిల్లా ధర్మవరంలో జరగనున్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేనేత దీక్షకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ ఆవిష్కరించారు. చేనేత కార్మికుల పరిష్కారానికి ఈ నెల 12 తేదిన జననేత జగన్మోహన్‌రెడ్డి 48 గంటల పాటు దీక్ష చేపట్టనున్నారు. చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని బాజిరెడ్డి అన్నారు.

  పేదవారి సంక్షేమం కోరిన ఒకే ఒక ముఖ్యమంత్రి మహనేత వైఎస్ రాజశేఖరరెడ్డి:


 పేదవారి సంక్షేమం కోరిన ఒకే ఒక ముఖ్యమంత్రి మహనేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లాలో జరుగుతున్న ఓదార్పుయాత్రలో భాగంగా జగన్ సంతగుడిపాడుకు చేరుకున్నారు. మహానేత మరణం తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు దిగజారిపోయాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో మంత్రులు అవినీతి కూపంలో కూరుకుపోయారని జగన్ విమర్శించారు. 

అభివృద్ధికి, సంక్షేమానికి, పేద ప్రజలకు మేలు చేయాలనే తపన మహానేతకు ఉండేదని ఆయన అన్నారు. పేద ప్రజలకు మేలు చేయాలనే తపన ఉంది కాబట్టే ఏ ముఖ్యమంత్రి చేయలేని పనులను, సంక్షేమ పథకాల్ని వైఎస్ ప్రారంభించారని ఆయన అన్నారు. అందుకే పేద ప్రజల గుండేల్లో గూడు కట్టుకున్నారన్నారు. 

మహానేత మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల్ని ఓదార్చుతానని నల్లకాలువ సభలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నందుకే తనను ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత నేత వైఎస్ తనకు ప్రేమాభిమానాలు కురిపించే అతిపెద్ద కుటుంబాన్ని ఇచ్చారన్నారు. సంతగుడిపాడులో జగన్ సభకు భారీగా ప్రజలు తరలివచ్చారు. జగన్ ప్రసంగానికి భారీ స్పందన లభించింది.
Share this article :

0 comments: