రామోజీని జైల్లో పెట్టే దమ్ముందా?: గట్టు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రామోజీని జైల్లో పెట్టే దమ్ముందా?: గట్టు

రామోజీని జైల్లో పెట్టే దమ్ముందా?: గట్టు

Written By ysrcongress on Saturday, February 25, 2012 | 2/25/2012

రామోజీ ఫిలింసిటీలో 60 ఎకరాల పది గుంటల ప్రభుత్వ, అసైన్‌మెంట్ భూములున్నట్లు తేలినందున ఆయనపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, బీసీ విభాగం కన్వీనర్ గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధునాతనమైన ఇటిఎస్ పద్ధతిలో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ చేయించిన సర్వేలో రామోజీ ఆక్రమణలు బయట పడిన విషయాన్ని వెల్లడించారు. ఫిలింసిటీలో ప్రభుత్వ భూములున్నాయనే విషయం తన దృష్టికి వచ్చినపుడు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అక్కడికి పంపిన టీంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి కూడా ఒక సభ్యుడనే విషయాన్ని గట్టు గుర్తు చేశారు.

అప్పట్లో అక్కడ 275 సర్వే నెంబర్‌లో 4 ఎకరాలు, 281లో 32 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు తహశీల్దార్ వెల్లడించారని గట్టు అన్నారు. దీనిపై తదుపరి చర్యలు తీసుకుంటూ ఉండగా రామోజీరావు అప్పీలు చేసుకున్నారనీ అంతిమంగా తాజా సర్వేలో 60 ఎకరాల పైచిలుకు ప్రభుత్వ భూమి ఉన్నట్లు జేసీ వెల్లడించారని వివరించారు. ప్రభుత్వ భూమి రామోజీ ఆక్రమణలో ఉన్నట్లు స్పష్టంగా వెల్లడైనందున కిర ణ్‌కుమార్ రెడ్డి ఏం చర్యలు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో పరస్పరం ప్రజలు చూడ్డానికి దూషించుకుంటున్న చంద్రబాబు, కిరణ్‌లో లోలోపల మాత్రం ఒప్పందం ప్రకారం పని చేస్తున్నారన్నారు. ై

జెలుకు వెళ్లాల్సిన వారని ఒకరినొకరు తిట్టుకుంటున్న ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతలు ఎందుకు రామోజీరావు భూకబ్జా గురించి మాట్లాడరని ఆయన నిలదీశారు. అసలు రామోజీని జైల్లో పెట్టే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అని ఆయన ప్రశ్నించారు. కిరణ్ తనకూ బాబుకు ఉన్న మైత్రిని పక్కన బెట్టి రామోజీతో చంద్రబాబుకున్న మైత్రీ బంధాన్ని గుర్తించి ఆయన భూకబ్జాపై చర్యలు తీసుకోవాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నారని స్పష్టంగా వెల్లడైన ప్రస్తుత తరుణంలో రామోజీని ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఆయనపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకుంటుందా లేదా అని ఆయన నిలదీశారు.

ప్రజలు రామోజీ బాగోతాన్ని, ఈ విషయంలో అధికార ప్రతిపక్షాల నిష్క్రియాపరత్వాన్ని చూస్తున్నారని బాబు, కిరణ్ కుమ్మక్కై ఊరకున్నా ప్రజలు మాత్రం ఊరుకోరని ఆయన హెచ్చరించారు. రామోజీ ఫిలింసిటీలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునే దాకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపడుతుందని ఆయన అన్నారు. అందరికీ నీతులు చెప్పే రామోజీ కుడితిలో పడ్డట్లు అయిందని ఆయన అన్నారు. ఊరందరికీ నీతులు చెప్పే రామోజీ తన భూకబ్జా గురించి ఏం చెబుతారని ఆయన అన్నారు. రామోజీ ఫిలింసిటీ పుట్టుకే అవినీతి మయం అని ఆయన వ్యాఖ్యానించారు.

గొర్రెల పెంపకం కేంద్రం పెడతానని ఎకరా 4 నుంచి 7 వేల రూపాయల ధరకే వందలాది ఎకరాలు కొనుగోలు చేసిన రామోజీ ఆ తరువాత దానిని వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకుంటున్నారన్నారు. ఫిలింసిటీ ప్రధాన ద్వారం నిర్మించిన ప్రదేశం ఒక రిటైర్డు సీఐదనీ ఆయన ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ నుంచి అనాజ్‌పూర్ వరకూ గల రోడ్డునే ఆక్రమించి తనదని చెబుతున్నారని ఆయన అన్నారు. రామోజీ వ్యాపారాలన్నీ అవకతవకల మయయేనని ఆయన అన్నారు.

div dir="ltr" style="text-align: left;" trbidi="on">

Nallapureddy files nomination papers in Kovuru



Share this article :

0 comments: