ముడుపులు ఎవరికిచ్చారు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముడుపులు ఎవరికిచ్చారు?

ముడుపులు ఎవరికిచ్చారు?

Written By ysrcongress on Friday, February 10, 2012 | 2/10/2012

డీఎల్ వెల్లడించాలని సబ్బం హరి డిమాండ్
సోనియా, పటేల్, ఆజాద్‌లలో ఎవరికిచ్చారో బయటపెట్టాలి
కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కయ్యాయని జగన్ చెప్తే కాదన్నారు
ఇప్పుడు డీఎల్ అదేమాట చెప్పడం దేనికి సంకేతం?
మద్యం సిండికేట్లపై డ్రామా నడుపుతున్న సర్కారు

విశాఖపట్నం, న్యూస్‌లైన్: పదవుల కోసం ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దల్లో ఎవరికి ఎవరు ముడుపులు ఇచ్చారో బహిర్గతం చేయాలని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి డిమాండ్ చేశారు. సూట్‌కేసులు పట్టుకొని చెన్నై, ముంబైల మీదుగా ఢిల్లీకి వెళ్లి ముడుపులు ఇచ్చి ఉన్నత పదవులు దక్కించుకున్న వారు కాంగ్రెస్‌లో చాలామంది ఉన్నారని చెప్పిన ఆరోగ్యశాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి... ఎవరికి ఎవరు సూట్‌కేసులిచ్చారో వెల్లడించాలన్నారు. 10 జన్‌పథ్‌లో సోనియాగాంధీకి ఇచ్చారా? సోనియాగాంధీ రాజకీయ సలహాదారుడు అహ్మద్‌పటేల్‌కు ముట్టజెప్పారా? రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ గులాంనబీ ఆజాద్‌కు అందించారా? అని ప్రశ్నించారు. 

శాఖలో కోత పడిన నేపథ్యంలో డీఎల్ విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై సబ్బం హరి ప్రశ్నలను సంధించారు. ఆయన విశాఖలో తన నివాసంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ... ఢిల్లీ పెద్దల్లో ఎవరు డబ్బులు తీసుకొని పదవులు కట్టబెట్టారో చెప్పాల్సిన బాధ్యత... సోనియాగాంధీ భక్తుడినని, కాంగ్రెస్ సేవకుడినని చెప్పి పదవి సంపాదించిన డీఎల్‌పై ఉందన్నారు. పార్టీలో పదవులు అమ్ముకున్నారని ఆ పార్టీకి చెందిన కేబినెట్ మంత్రే స్వయంగా చెబుతుంటే కాంగ్రెస్‌ను ఎవరు రక్షిస్తారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిష్ర్కమణ తరువాత కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన విస్తరవుతుందని ఆరోజే చెప్పానని పునరుద్ఘాటించారు. 

ఈ కుమ్మక్కు దేనికి సంకేతం?
తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై తనపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నాయని అప్పట్లో జగన్‌మోహన్‌రెడ్డి చెబితే తప్పుబడుతూ డీఎల్ విమర్శలు చేశారని సబ్బం గుర్తు చేశారు. ఇప్పుడు అదే డీఎల్... సమాచార కమిషన్ నియామకాల్లో ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. మద్యం సిండికేట్లకు సంబంధించి గత నెల రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక డ్రామా నడుపుతోందని ఎద్దేవా చేశారు. రెండు నెలలుగా దాడులు నిర్వహిస్తే ఒక్కొక్కటిగా బయటపెట్టడం... ఎమ్మార్పీకే మద్యం అమ్మేలా చేస్తామని సీఎం అనడం సిగ్గుచేటన్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఓట్లు దండుకోడానికి ఆడుతున్న నాటకమని విమర్శించారు. సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడే మంత్రులను బొత్స సమర్థించడం, బొత్సకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని సీఎం సమర్థించడం కాంగ్రెస్ ఐక్యతకు నిదర్శనమా? అని ప్రశ్నించారు. జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, ఆయన సీఎం చేయాలని 155 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసినా అధిష్టానం నిర్ణయాల మేరకే నడుచుకున్నారు తప్ప, పార్టీ వ్యతిరేకంగా ఏ రోజూ పని చేయలేదని గుర్తు చేశారు.
Share this article :

0 comments: