హ్యాకింగ్ కు గురైన ఏపీ బడ్జెట్ వెబ్ సైట్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హ్యాకింగ్ కు గురైన ఏపీ బడ్జెట్ వెబ్ సైట్

హ్యాకింగ్ కు గురైన ఏపీ బడ్జెట్ వెబ్ సైట్

Written By ysrcongress on Thursday, February 16, 2012 | 2/16/2012

రాష్ట్ర వెబ్‌సైట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. సైబర్‌ క్రిమినల్స్‌ రాష్ట్ర ప్రభుత్వ సర్వర్లును హ్యాక్‌ చేశారు. మొత్తం 21 సైట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. ప్రభుత్వం రేపు శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టునున్న తరుణంలో ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం. అయితే బడ్జెట్‌ వివరాలు ఉండే వెబ్‌సైట్లు హ్యాకింగ్‌కు గురైనట్లు తెలుస్తోంది. హ్యాకర్‌ బడ్జెట్‌ వెబ్‌సైట్లో అదనపు పేజీని అదనంగా చేర్చాడు.

వివిధ శాఖలకు చెందిన వెబ్‌సైట్లను హ్యాక్‌ చేసిన హ్యాకర్లు హోమ్‌ పేజీలను మాత్రం మార్చలేదు. హ్యాకర్లు కేవలం సత్తా కలవారని మాత్రమే నిరూపించేందుకు హ్యాకింగ్‌కు పాల్పడ్డట్లు మెసేజ్‌లు పెట్టారు. హ్యాకింగ్‌కు గురైన వెబ్‌సైట్లలో గెజట్‌ నోటిఫికేషన్స్‌, గవర్నమెంట్‌ ఆర్డర్స్‌, కమర్షియల్‌ ట్యాక్సులు, గ్యాడ్‌, హార్టికల్చర్‌, ఫ్యాక్టరీస్‌, రిమోట్‌ అండ్‌ ఇంటీరియర్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ సైట్లు ఉన్నాయి.
Share this article :

0 comments: