మనమే ప్రధాన ప్రతిపక్షమవుదాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మనమే ప్రధాన ప్రతిపక్షమవుదాం

మనమే ప్రధాన ప్రతిపక్షమవుదాం

Written By ysrcongress on Wednesday, February 22, 2012 | 2/22/2012


 ఈ పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచి ప్రధాన ప్రతిపక్షంగా పోరాడదాం
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్ పిలుపు
ఎమ్మెల్యేలందరూ ప్రతిరోజూ సభకు వెళ్లి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయండి
విప్ ధిక్కరించిన వారిపై ఇప్పట్లో అనర్హత పడే అవకాశం కనిపించడం లేదు
ఒకవేళ అనర్హత వేటు వేస్తే.. దీటుగా ఎన్నికలను ఎదుర్కొందాం




ప్రజా సమస్యలేవీ చర్చకు రాకుం డా ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సభలో గట్టి ప్రతిపక్షంగా వ్యవహరించాలని వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నప్పటికీ అవేవీ చర్చకు రాకుండా కాంగ్రెస్, టీడీపీ రెండూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయ ని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారానికి గట్టి కృషి చేయాలని కోరారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు, రానున్న ఉప ఎన్నికల నేపథ్యంలో మం గళవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో క్యాంపు కార్యాలయంలో జగన్ సమావేశమయ్యారు. లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డితో పాటు 16 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మనమే ప్రధాన ప్రతిపక్షమవుదాం


ఈ సమావేశంలో ప్రస్తుత పరిస్థితులను విశ్లేషించిన తర్వాత జగన్ మాట్లాడుతూ, కాంగ్రెస్, టీడీపీలు రెండూ ప్రజా సమస్యల పట్ల పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. ప్రధాన ప్రతిపక్ష బాధ్యతను వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకోవాలని, ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీకి హాజరు కావాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఇంకా వేసవి రాక ముందే గ్రామాల్లో మంచి నీటికి కటకట వచ్చిందని, రైతులు, సామాన్య ప్రజలు విద్యుత్ కోతలతో అల్లాడుతున్నారని జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇలాంటి సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి ప్రజల తరఫున గళం వినిపించాలని సూచించారు. తరచూ ఎమ్మెల్యేలంతా కలసి చర్చించుకోవాలని, ఏ తరహా తీర్మానాలు సభలో తీసుకురావాలో వ్యూహాన్ని రూపొందించుకోవాలని అన్నారు.

అనర్హత అవకాశం లేదు..

గత డిసెంబర్‌లో విప్‌ను ధిక్కరించి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓట్లేసిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే అవకాశాలు కనిపించడం లేద ని, కాంగ్రెస్‌కు పరిస్థితులు అనువుగా ఉంటాయనుకుంటేనే అలాంటి నిర్ణయం తీసుకుంటారనిపిస్తోందని జగన్ వారితో అన్నారు. ఎమ్మెల్యేలను అనర్హులు గా ప్రకటిస్తారా లేదా అనే అంశంతో నిమిత్తం లేకుండా ప్రజా సమస్యలపై దృష్టిని సారించాలని ఆయన సూచించారు. అనర్హులుగా ప్రకటించినపుడు ఎన్నికలను ఎదుర్కొందాం అని ఆయన వారికి స్పష్టం చేశారు. అవసరమైనపుడు అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ సేవలను వినియోగించుకోవాలన్నారు. 

నెల్లూరు జిల్లా కోవూరులో జరిగే ఉప ఎన్నిక ప్రచారానికి పొరుగు జిల్లా ల ఎమ్మెల్యేలు కూడా వెళ్లాలనీ, పార్టీ అభ్యర్థికి భారీ మెజారిటీ వచ్చేలా కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, కొండా సురేఖ, బాలినేని శ్రీనివాసరెడ్డిలతో పాటు ఎమ్మెల్యేలు జి.బాబూరావు, టి.బాలరాజు, ఎం.ప్రసాదరాజు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ధర్మాన కృష్ణదాసు, మేకతోటి సుచరిత, భూమా శోభానాగిరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, బి.గురునాథరెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, చెన్నకేశవరెడ్డి, ఎమ్మెల్సీలు సి.నారాయణరెడ్డి, మేకా శేషుబాబు, డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, ఎస్.వి.మోహన్‌రెడ్డి, పుల్లా పద్మావతి, జూపూడి ప్రభాకరరావు పాల్గొన్నారు.

ఏకతాటిపై ఉన్నాం..

అవిశ్వాస తీర్మానంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన 17 మంది ఎమ్మెల్యేలందరం ఏకతాటిపై ఉన్నామని, అసెంబ్లీలో కలిసికట్టుగా ప్రజాసమస్యలపై గళం విప్పుతామని ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి అన్నారు. సమావేశానంతరం వీరు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తమలో ఎలాంటి గందరగోళం లేదని, అస్తవ్యస్త పరిస్థితి ఉన్నదల్లా కాంగ్రెస్, టీడీపీల్లోనేనని చెప్పారు. టీడీపీ ప్రతిపక్ష పాత్రను నిర్వహించలేకపోతోందని, తమదే అసలు, సిసలైన ప్రతిపక్షమని ఉద్ఘాటించారు. కొన్ని పత్రికల్లో వార్తలు వస్తున్నట్లుగా తమలో ఎవ్వరూ యూ-టర్న్ తీసుకోలేదని, 17 మంది ఎమ్మెల్యేలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నామని చెప్పారు. తమపై అభూతకల్పనలతో వార్తలు రాయడం సరికాదన్నారు. కోవూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి భారీ ఆధిక్యంతో గెలుపొందుతారని మేకపాటి విశ్వాసం వ్యక్తంచేస్తూ.. ఎన్నిక తర్వాత మరింత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమవైపు వస్తారని అన్నారు.

మున్సిపల్ ఎన్నికలపై కసరత్తు

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముమ్మర కసరత్తు చేపట్టింది. పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అన్ని జిల్లాల మున్సిపల్ ఎన్నికల పార్టీ పరిశీలకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాల్లో పార్టీ స్థితిగతులపై నేతలతో జగన్ సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ క్యాడర్‌ను మరింత పటిష్టం చేసి అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ.. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని నేతలకు హితవు చెప్పారు. ఎన్నికల్లో పార్టీ విజయం కోసం సమర్థుడైన నాయకున్ని ఎంపిక చేసేందుకు పరిశీలకులు కృషిచేయాలని సూచించారు. సమావేశానంతరం పార్టీ అధికార ప్రతినిధి, కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు బి.జనక్ ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ... మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ హవా కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: