చంద్రబాబునాయుడి హయాంలోనే ఎమ్మార్‌కు భూ కేటాయింపులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబునాయుడి హయాంలోనే ఎమ్మార్‌కు భూ కేటాయింపులు

చంద్రబాబునాయుడి హయాంలోనే ఎమ్మార్‌కు భూ కేటాయింపులు

Written By ysrcongress on Tuesday, February 14, 2012 | 2/14/2012

మ్మార్ కేసులో హైకోర్టు తన తీర్పులో ఎప్పటినుంచి విచారణ చేపట్టాలో సీబీఐకి ఆదేశాలు ఇవ్వలేదని.. అయినప్పటికీ సీబీఐ 2004 నుంచి మాత్రమే దర్యాప్తు చేస్తోందని రంజిత్‌కుమార్ వివరించారు. 2000 సంవత్సరం నుంచి దర్యాప్తు చేయకపోవడానికిగల కారణాలు ఏమిటో తమకు అంతుబట్టకుండా ఉందని.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి హయాంలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మార్ అడుగుపెట్టిందని.. ఆయన హయాంలోనే ఎమ్మార్‌కు భూ కేటాయింపులు జరిగాయని నివేదించారు. కాని సీబీఐ 2004 నుంచి మాత్రమే దర్యాప్తు చేస్తోందని.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘రాష్ట్ర హైకోర్టు దర్యాప్తుకు నిర్దిష్ట కాలపరిమితి విధించిందా? లేనప్పుడు మీరెందుకు 2000ల నుంచి దర్యాప్తు జరుపరు?’’ అని సీబీఐని ప్రశ్నించింది. దీనిపై సీబీఐ తరఫు సీనియర్ న్యాయవాది రావత్ స్పందిస్తూ.. తాము 2000 సంవత్సరం నుంచీ దర్యాప్తు చేపడతామని.. ఈ విషయంలో అదనపు అఫిడవిట్ దాఖలు చేసేందుకు సైతం తాము సిద్ధమని, ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు అధికారులు కోర్టు హాలులోనే ఉన్నారని స్పష్టం చేశారు. ఈ సమయంలో రంజిత్‌కుమార్ కల్పించుకుంటూ.. ‘‘ఈ రోజుకీ అదనపు అఫిడవిట్ దాఖలు చేయలేదు. అందువల్ల అందులో ఏముందో మాకు తెలియదు. 2000 సంవత్సరం నుంచీ దర్యాప్తు చేస్తామని సీబీఐ న్యాయవాది ఏ హామీ అయితే ఇచ్చారో.. దానిని రికార్డ్ చేయండి’’ అని ధర్మాసనాన్ని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ధర్మాసనం.. సీబీఐ ఇచ్చిన హామీని రికార్డ్ చేసుకుని.. కేసును పరిష్కరిస్తున్నట్లు ప్రకటించింది

ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హయాం నుంచీ దర్యాప్తు చేస్తామని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సోమవారం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ మేరకు సీబీఐ హామీని సుప్రీంకోర్టు రికార్డ్ చేసుకుంది. ఎమ్మార్‌పై దర్యాప్తును కేవలం 2004 తర్వాత జరిగిన లావాదేవీలకే పరిమితం చేయాలని రాష్ట్ర హైకోర్టు సూచించనప్పుడు మీరెందుకు ఎమ్మార్ రాష్ట్రంలో అడుగుపెట్టిన నాటి నుంచి దర్యాప్తు చేయరు..? అంటూ సుప్రీంకోర్టు గట్టిగా ప్రశ్నించడంతో.. దిగివచ్చిన సీబీఐ, 2000 నుంచి కూడా దర్యాప్తు చేస్తామంటూ విధి లేని పరిస్థితుల్లో హామీ ఇచ్చింది. ఎమ్మార్ వ్యవహారంలో సీబీఐ కేవలం 2004 తరువాత మాత్రమే దర్యాప్తు చేస్తోందని, బాబు హయాం నుంచి కూడా దర్యాప్తు చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ వరంగల్ జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు భీంరెడ్డి ఎల్లారెడ్డి మొదట హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ నేతృత్వంలోని ధర్మాసనం.. దీనిని తోసిపుచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎల్లారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని మొదటసారి విచారించిన జస్టిస్ ధల్వీర్ భండారీ, జస్టిస్ దీపక్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం.. సీబీఐ, చంద్రబాబు, ఎమ్మార్ తదితరులకు నోటీసులు జారీ చేసి, కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేసు విచారణను ఫిబ్రవరి 13వ తేదీకి వాయిదా వేసింది. దీనికి అనుగుణంగా ధర్మాసనం ఈ కేసును సోమవారం మరోసారి విచారించింది. ఎల్లారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్ వాదనలు వినిపించగా.. సీబీఐ తరఫున సీనియర్ న్యాయవాది రావత్ వాదించారు. 
Share this article :

0 comments: