మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నదానికి అనుగుణంగా ‘బిజినెస్ రూల్’ ప్రకారం జీవోలను - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నదానికి అనుగుణంగా ‘బిజినెస్ రూల్’ ప్రకారం జీవోలను

మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నదానికి అనుగుణంగా ‘బిజినెస్ రూల్’ ప్రకారం జీవోలను

Written By ysrcongress on Saturday, February 4, 2012 | 2/04/2012


రాష్ర్ట ఎన్నికల సంఘం కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌రెడ్డిని తాత్కాలిక దర్యాప్తు కార్యాలయం దిల్‌కుశ అతిథి గృహంలో సీబీఐ అధికారులు శుక్రవారం కూడా విచారించారు. ఉదయం 10.30 నుంచి మూడు గంటలపాటు విచారణ కొనసాగింది. విచారణ అనంతరం రమాకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవోలకు సంబంధించి సీబీఐ అధికారులు వివరణ అడిగారని, ఆయా రికార్డులను పరిశీలించిన అనంతరం స్పష్టమైన వివరాలను తెలియజేశానని చెప్పారు. మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నదానికి అనుగుణంగా ‘బిజినెస్ రూల్’ ప్రకారం జీవోలను జారీచేసినట్లు స్పష్టంచేశానన్నారు. 

జీవోలు ఇచ్చేందుకు తనపై ఎవరి ఒత్తిడీలేదని తెలిపానని మరోమారు పునరుద్ఘాటించారు. మరికొన్ని పరిశీలించాల్సిన జీవోలు ఉన్నందునే సీబీఐ అధికారులు శుక్రవారం మళ్లీ రావాలని కోరారని, అన్ని జీవోలకు సంబంధించి వివరణ ఇవ్వడం పూర్తయిందని తెలిపారు. జగన్ సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ అధికారులు తనను ఏమీ అడగలేదని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సీబీఐ విచారణకు మళ్లీ వస్తారా?... అంటూ ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘సీబీఐ అధికారులు మాత్రం మళ్లీ రమ్మని కోరలేదు. నేను మళ్లీ విచారణకు రావాలని మీరు కోరుకుంటున్నారా?’ అని మీడియాను ఉద్దేశించి చమత్కరించారు. సీబీఐ జాయింట్ డెరైక్టర్ వీవీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో విచారణ కొనసాగింది.
Share this article :

0 comments: