రైతుల్ని కదిపితే కన్నీళ్లు: జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతుల్ని కదిపితే కన్నీళ్లు: జగన్

రైతుల్ని కదిపితే కన్నీళ్లు: జగన్

Written By ysrcongress on Tuesday, February 7, 2012 | 2/07/2012

మిర్చి, పత్తి రైతుల్ని కదిపితే కన్నీళ్లు వస్తున్నాయని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా ఓదార్పుయాత్రలో భాగంగా జగన్ చేజేర్ల మర్రిచెట్టు సెంటర్‌కు చేరుకున్నారు. చేజేర్లలో జగన్‌కు జనం బ్రహ్మరధం పట్టారు. 

గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న మహానేత వైఎస్‌ఆర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై దివంగత నేతను అప్రతిష్టపాలు చేయడానికి పూనుకున్నారన్నారు. రాష్ర్టంలో విలువలు లేని రాజకీయాలు నడుపుతూ.. ప్రజా సమస్యల్ని, రైతుల్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది స్కాలర్‌షిప్‌లు ఇవ్వలేదని ఆయన తెలిపారు. కుటుంబంలో ఒక్కరన్న ఉన్నత విద్య చదువాలి అని జగన్ చెప్పారు.

 రాష్ట్రంలో సువర్ణయుగం త్వరలో రానున్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతి పేద తమ ప్రభుత్వమని కోరుకునే రోజు త్వరలో వస్తుందని గుంటూరు జిల్లా ఓదార్పుయాత్రలో జగన్ తెలిపారు. పావురాలగుట్టలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నందుకే ప్రభుత్వం వేధిస్తుందన్నారు. పైన ఉన్న దేవుడు ఇవన్ని చూస్తునే ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు వెళ్లే ప్రతి బాలుడి పేరుమీద 500 రూపాయలను జమ చేస్తామన్నారు. ప్రతి రైతుకు వడ్డీలేని రుణాలను అందిస్తామన్నారు. వృద్ధులకు ఇంటి వద్దే మూడు పూటల భోజనాన్ని అందిస్తామన్నారు.
Share this article :

0 comments: