నిజంగా బాబు పెంపకం అంత బాగుంటే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నిజంగా బాబు పెంపకం అంత బాగుంటే

నిజంగా బాబు పెంపకం అంత బాగుంటే

Written By ysrcongress on Thursday, February 16, 2012 | 2/16/2012

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పెంపకం అక్షరాలా బాగుంది కనుకనే ఆ తండ్రికి తనయుడిగా వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ప్రజల్లో తిరుగుతూ వారి రుణం తీర్చుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తన ఆస్తులపై వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ వేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పిటిషన్ కొట్టి వేయడంతో ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్న బాబు, గత అక్టోబర్ 17న న్యాయమూర్తి గులాం అహ్మద్ నేతృత్వంలోని బెంచి ఇదే కేసును సీబీఐ, డీజీపీ, రాష్ట్ర హోంశాఖలను విచారించాల్సిందిగా ఆదేశించినపుడు ఎందుకు టెన్షన్‌కు గురయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

తాను ఎలాంటి తప్పూ చేయలేదు కనుక ఉత్సాహంగా, మనోధైర్యంతో ఉన్నానని ఈరోజు చెప్పుకుంటున్న చంద్రబాబు ఆరోజు టెన్షన్‌కు గురి కావడాన్ని బట్టే ఆయన విచారణను ఎదుర్కోవడానికి ఎంత భయపడ్డారో తెలిసిపోతోందని అంబటి అన్నారు. పిటిషన్‌ను కొట్టేసినంత మాత్రాన తాము వదలి పెట్టబోమనీ సుప్రీంకోర్టులోఅప్పీలుకు వెళతామనీ ఆయన స్పష్టం చేశారు. ఇల్లలకగానే పండగై పోయిందని భావించవద్దనీ, ముందుంది ముసళ్ల పండుగ అనేది బాబు గుర్తుంచుకుంటే మంచిదని ఆయన వ్యంగంగా అన్నారు. తీర్పు అనుకూలంగా వచ్చిందనే మితిమీరిన ఉత్సాహంతో వై.ఎస్‌పైనా, ఆయన కుటుంబంపైనా, జగన్‌పైనా చంద్రబాబు అనుచితమైన వ్యాఖ్యలు చేయడం పట్ల ఆయన తీవ్ర అంభ్యంతరం తెలిపారు. 

‘కొడుకును ఎలా పెంచాలో వై.ఎస్‌కు అసెంబ్లీలో సలహా ఇచ్చానని చెప్పుకుంటున్నాడు...పెంపకం గురించీ, రక్త సంబంధం గురించీ, ఆత్మీయానురాగాల గురించీ బాబు వై.ఎస్‌కు సలహా ఇవ్వడమా...! అసలు ఆయనకు వాటి గురించి మాట్లాడే నైతిక హక్కు లేనే లేదు.., పిల్లనిచ్చిన మామను గద్దె దించి ఆయన మరణానికి కారణమైంది చాలక ఆయన కుటుంబాన్ని చిందరవందర చేశాడు, చివరకు, తోడల్లుడినీ, బావమరుదులనూ వాడుకుని వదిలేశాడు, సొంత తమ్ముడినే వాడుకుని తాను రాజకీయంగా ఎదిగాడు’ అని రాంబాబు అన్నారు. అంతెందుకు లోకేష్ ఎలాంటి వాడో, ఆయన పెంపకం ఎలా జరిగిందో, అసలు చంద్రబాబు కుటుంబీకుల గురించి ప్రజలేమనుకుంటున్నారో చెట్టుకింద ఎలాంటి చర్చలు జరుగుతున్నాయో అందరికీ తెలుసు, అవి నేను చెప్పడం బాగుండదు, కానీ అవి బాబు చెవికి సోకక పోవడం ఆయన దురదృష్టం అని అంబటి వ్యాఖ్యానించారు. 

నిజంగా బాబు పెంపకం అంత బాగుంటే లోకేష్ అమెరికాలో చదువుకోవడానికి ఖర్చు చేసిన 60 కోట్ల రూపాయలు ఎవరు చెల్లించారో వెల్లడించాలని ఆయన సవాలు విసిరారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వెచ్చించారో బాబు ఇంత వరకూ తన ఆదాయపుపన్ను వివరాల్లో వెల్లడించనే లేదనీ, బాబు పెంపకం ఇలాంటిదేనని రాంబాబు అన్నారు. వై.ఎస్ మరణానంతరం జగన్ ప్రజల్లో తిరుగుతూ ఉండటమే ఆయన పెంపకం బాగుందనడానికి నిదర్శనం అనీ అంబటి వాఖ్యానించారు. జగన్ నిత్యం ప్రజల్లో ఉంటూ తన తండ్రి లేని లోటును రాష్ట్ర ప్రజలకు మరిపిస్తున్నారని రాంబాబు అభిప్రాయపడ్డారు. జగన్ అంటే బాబుకు భయం పట్టుకుందనీ అందుకే ఆయనను ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారనీ అంబటి అన్నారు. 

న్యాయవ్యవస్థను వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కించ పరుస్తూ మాట్లాడారని బాబు చెప్పడం సరికాదనీ ఆయనే తన పార్టీ నేతలతో న్యాయమూర్తులపై వ్యాఖ్యానాలు చేయించారన్నారు. బాబు ఆస్తులపై విచారణకు హైకోర్టు న్యాయమూర్తి గులాం అహ్మద్ ఆదేశించినపుడు ఆయన పార్టీ నేతలు జడ్జిని ఉద్దేశించి పదవీ విరమణ చేస్తున్న తరుణంలో ఇలాంటి తీర్పు ఎలా ఇచ్చారని టీడీపీ నేతలు అవాకులు, చవాకులు పేలారని ఆయన గుర్తు చేశారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా, విచారణలకు ఆదేశించినా ఏమీ కాలేదనీ తాను నిజాయితీపరుడననీ బాబు ప్రగల్భాలు పలుకుతున్నారనీ వాస్తవానికి ఆయనకు ఏ కోర్టు సచ్ఛీలుడని తీర్పు నిచ్చిందో చెప్పాలనీ ఆయన అన్నారు. సాంకేతిక కారణాలను సాకుగా చూపి విచారణలను బాబు అడ్డుకుంటూ వస్తున్నారని ఆయన అన్నారు.

Share this article :

0 comments: