ఆఫ్ట్రాల్ స్టూడెంట్స్ అంటూ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆఫ్ట్రాల్ స్టూడెంట్స్ అంటూ

ఆఫ్ట్రాల్ స్టూడెంట్స్ అంటూ

Written By ysrcongress on Saturday, February 11, 2012 | 2/11/2012

 తమ డిమాండ్ల పరిష్కారం కోసం జూనియర్ డాక్టర్లు గత నెల 11వ తేదీ నుంచి సాధారణ వైద్య సేవలను బహిష్కరించి, సమ్మె చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఆది నుంచీ నిర్లక్ష్య వైఖరినే ప్రదర్శించింది. జూడాలు ఆమరణ దీక్షలు చేస్తున్నా.. పరిస్థితి విషమించి.. పలువురిని ఐసీయూల్లో చేర్చినా.. పట్టించుకోలేదు. జూడాల డిమాండ్లు న్యాయబద్ధమైనవేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహా అన్ని రాజకీయ పక్షాలు ముక్తకంఠంతో మద్దతిచ్చినా.. మొద్దునిద్ర వీడలేదు. పైగా.. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసింది. ఎస్మా ప్రయోగిస్తామంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హెచ్చరికలు జారీ చేయగా.. ఆఫ్ట్రాల్ స్టూడెంట్స్ అంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అంతెత్తున లేచారు. 

ఆస్పత్రుల్లో సౌకర్యాల కల్పన, డాక్టర్లపై దాడుల నిరోధానికి చర్యలు లాంటి కొన్ని డిమాండ్ల విషయంలో జూడాలు, ప్రభుత్వం మధ్య అంగీకారం కుదిరినా.. స్టైపెండ్ పెంపు, గ్రామీణ వైద్య సేవల విషయంలోనే పీటముడి బిగిసింది. మనతో పోలిస్తే.. ఇతర రాష్ట్రాల్లో పీజీ విద్యార్థుల స్టైపెండ్ ఎక్కువగా ఉన్నందున.. ఇక్కడా పెంచాలన్న జూడాల డిమాండ్ న్యాయబద్ధమైనదేనని రాజకీయ పక్షాలు డిమాండ్ చేసినా.. ప్రభుత్వం ఆ దిశగా చొరవ చూపలేదు. ఇటు గ్రామీణ సర్వీసు విషయంలో కచ్చితంగా మూడేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో చేయాలని ప్రభుత్వం తేల్చిచెప్పగా.. జూడాలు ఏడాదికే పరిమితం చేయాలని కోరారు. అయితే, స్టైపెండ్ విషయంలో సర్కారు సానుకూల నిర్ణయం తీసుకుంటే.. గ్రామీణ సర్వీసు విషయంలో వారిని ఒప్పించడం సులభమే. దీన్ని ఆమోదించడం వల్ల ప్రభుత్వంపై పడే ఆర్థిక భారమూ తక్కువే అయినా పట్టించుకోలేదు.

జూడాల డిమాండ్లు-సర్కారు స్పందన
Share this article :

0 comments: