ఎంబీబీఎస్ఇక ఆరున్నరేళ్లు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎంబీబీఎస్ఇక ఆరున్నరేళ్లు!

ఎంబీబీఎస్ఇక ఆరున్నరేళ్లు!

Written By ysrcongress on Tuesday, February 7, 2012 | 2/07/2012

ఎంబీబీఎస్ కోర్సు కాలవ్యవధిని ప్రస్తుతమున్న ఐదున్నరేళ్ల నుంచి ఆరున్నరేళ్లకు పొడిగించాలని భారత వైద్యమండలి(ఎంసీఐ) ప్రతిపాదించింది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో వైద్యుల కొరతను అధిగమించడానికి మెడికల్ అండర్‌గ్రాడ్యుయేట్లకు గ్రామాల్లో ఏడాది సర్వీసును తప్పనిసరిచేస్తూ కోర్సు వ్యవధిని పెంచాలని కేంద్ర ఆరోగ్యశాఖకు చెప్పింది. కోర్సు వ్యవధి ప్రస్తుతం ఒక ఏడాది ఇంటర్న్‌షిప్‌తో కలిసి ఐదున్నర ఏళ్లుగా ఉంది. జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం(ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) కింద వైద్యులు గ్రామాల్లో ఏడాది పనిచేయడానికి వీలుగా కోర్సు వ్యవధిని మరో ఏడాది పెంచాలన్నది ఎంసీఐ ఉద్దేశం. సంస్థ గవర్నర్ల బోర్డు చైర్మన్ కేకే తల్వార్ ఇటీవల గ్రామాల్లో వైద్యుల కొరతపై జరిగిన చ ర్చలో ఆరోగ్య శాఖకు ఈ ప్రతిపాదన చేశారు. మెడికల్ అండర్‌గ్రాడ్యుయేట్లు ఏడాది కాకుండా రెండేళ్లు ఇంటర్న్‌షిప్ చేయాల్సిన అవసరముందని ఆయన పీటీఐకి చెప్పారు. కేంద్రం రాష్ట్రాల నుంచి వైద్యులను తీసుకోవడానికి వీలుగా ఈ అదనపు ఏడాదిని ఎన్‌ఆర్‌హెచ్‌ఎంతో అనుసంధానించనున్నట్లు వెల్లడించారు. ప్రతిపాదనపై తాము తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రతిపాదనపై ఓ నోట్‌ను తయారు చేస్తున్నామని, దాన్ని ఆ మంత్రిత్వ శాఖకు అందజేస్తామని వెల్లడించారు. ‘గ్రామీణ ప్రాంతాల్లో పోస్టింగ్ తప్పనిసరి కాకపోవచ్చు. వైద్యులకు వారి సేవలకు ప్రతిఫలం ఉంటుంది’ అని చెప్పారు. 
Share this article :

1 comments:

Laxminarayana Paladi said...

So JUDOs strike can be there only after each 6 1/2 years.