చంద్రబాబునాయుడును నేటి యువత ఏం చూసి ఆదర్శంగా తీసుకోవాలి..? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబునాయుడును నేటి యువత ఏం చూసి ఆదర్శంగా తీసుకోవాలి..?

చంద్రబాబునాయుడును నేటి యువత ఏం చూసి ఆదర్శంగా తీసుకోవాలి..?

Written By ysrcongress on Sunday, February 12, 2012 | 2/12/2012

‘‘టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును నేటి యువత ఏం చూసి ఆదర్శంగా తీసుకోవాలి..? పిల్లనిచ్చిన మామను వెన్ను పోటు పొడిచినందుకా..? తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావునూ, బావమరిది హరికృష్ణనూ, చివరకు రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడిని కూడా వాడుకుని వదిలేసినందుకా..? లేక తొమ్మిదేళ్ల పాలనలో ప్రజా వ్యతిరేక పాలనను అందించినందుకా..? ప్రజా ఉద్యమాలను అణచి వేసినందుకా..? లేక ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయించి యువకులకు ఉద్యోగాలు లేకుండా చేసినందుకా..?’’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

‘‘ప్రతిష్ట కోల్పోతున్న తన పార్టీని కాపాడుకోవటానికి యువతరంగాలు పేరుతో చంద్రబాబు నిర్వహిస్తున్న సభల్లో.. ‘నేను ముఖ్యమంత్రిగా ఉండగా.. అవి చేశాను, ఇవి చేశాను..’ అని సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. బాబు ఎంతటి గొప్పవాడో.. పాపం.. ఎవరూ చెప్పటం లేదు! అందుకే తనను తానే పొగుడుకునే దౌర్భాగ్య స్థితికి ఆయన దిగజారారు’’ అని ఎద్దేవా చేశారు. తొమ్మిదేళ్లు తన పాలన బ్రహ్మాండంగా ఉండేదనీ కావాలంటే తమ తల్లిదండ్రులను అడిగి తెలుసుకోవాలని చంద్రబాబు యువతను కోరుతున్నారని.. నిజంగా ఆయన పాలన అంత బాగుంటే ప్రజలు వరుసగా ఎందుకు చిత్తుగా ఓడించారో, ఇప్పటికీ డిపాజిట్లు గల్లంతయ్యేలా ఎందుకు తిరస్కరిస్తున్నారో చెప్పాలని అంబటి నిలదీశారు.

దివంగత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వల్లనో, తల్లిదండ్రుల కష్టార్జితం వల్లనో చదువుకుంటున్న యువకుల వద్దకు చంద్రబాబు వెళ్లి.. తానే ఆదర్శవంతుడనని చెప్పుకోవటం దారుణమన్నారు. తన కుమారుడు లోకేష్‌ను స్టాన్‌ఫర్డ్‌లో చదివించటానికి చంద్రబాబు రూ. 60 లక్షల సొమ్మును వేరెవరితోనో కట్టించిన దౌర్భాగ్య పరిస్థితి గురించి బాబు యువతకు ఎందుకు చెప్పటం లేదని అంబటి ప్రశ్నించారు. బాబు తాను రాసుకున్న ‘మనసులో మాట’ పుస్తకంలో ప్రభుత్వ ఉద్యోగాలపై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో యువత తెలుసుకోవాలని అంబటి సూచించారు. బాబు తాను రాసిన ఈ పుస్తకాన్ని మార్కెట్ నుంచి ఎందుకు మాయం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే యువతరంగానికి వచ్చిన యువకులందరికీ ఈ పుస్తకాన్ని పంచి పెట్టాలన్నారు.
Share this article :

0 comments: