జ్వరంతో బాధపడుతున్న జగన్,అయినప్పటికీ చేనేత కార్మికుల కోసం దీక్షలో - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జ్వరంతో బాధపడుతున్న జగన్,అయినప్పటికీ చేనేత కార్మికుల కోసం దీక్షలో

జ్వరంతో బాధపడుతున్న జగన్,అయినప్పటికీ చేనేత కార్మికుల కోసం దీక్షలో

Written By ysrcongress on Sunday, February 12, 2012 | 2/12/2012

*నేతన్నల కష్టాలను సర్కారుకు వినిపించడమే లక్ష్యం
*నేటి మధ్యాహ్నం ధర్మవరం చేరుకోనున్న జగన్
*జ్వరంతో బాధపడుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
*అయినప్పటికీ చేనేత కార్మికుల కోసం, ఇచ్చిన మాట
*తప్పకుండా దీక్షలో పాల్గొంటానని స్పష్టీకరణ

అనంతపురం, న్యూస్‌లైన్ ప్రతినిధి: చేనేత రంగంపై సర్కారు నిర్లక్ష్యానికి నిరసనగా.. నేతన్నలకు దన్నుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించతలపెట్టిన దీక్ష ఆదివారం ప్రారంభం కానుంది. అనంతపురం జిల్లా ధర్మవరంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో మూడు రోజులపాటు సాగే ఈ నిరసన కార్యక్రమంలో 48 గంటలపాటు ఆయన నిరాహార దీక్ష చేయనున్నారు. ఈ మేరకు వైఎస్సార్ జిల్లా పులివెందుల నుంచి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు వైఎస్ జగన్ అనంతపురం జిల్లాకు బయలుదేరుతారు. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం దొరిగల్లుకు 10 గంటలకు చేరుకుని.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ముదిగుబ్బ, బత్తలపల్లి మీదుగా మధ్యాహ్నం రెండు గంటలకు ధర్మవరం చేరుకుంటారు. ధర్మవరం మున్సిపల్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీతో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి వెళ్లి దీక్ష చేపడతారు.

ఏర్పాట్లను పరిశీలించిన నేతలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం సారథ్యంలో దీక్షకు ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. శనివారం అనంతపురం ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు వై.వి.సుబ్బారెడ్డి, గిర్రాజు నగేష్, తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు దీక్ష ఏర్పాట్లను పరిశీలించారు. జగన్ దీక్ష నేపథ్యంలో ఆదివారం ధర్మవరానికి వైఎస్సార్ సీపీ నేతలు భారీ ఎత్తున తరలిరానున్నారు. 

వైఎస్ అభిమాన ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సబ్బం హరి, వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు బి.గురునాథరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీనివాసులు, భూమా శోభా నాగిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, కొండా సురేఖ, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దేవగుడి నారాయణరెడ్డి, డాక్టర్ తిప్పారెడ్డి, కొండా మురళితోపాటు వైఎస్సార్ సీపీ నేతలు రోజా, అంబటి రాంబాబు తదితరులు దీక్షకు హాజరవనున్నారు. ఈ కార్యక్రమానికి తగిన పోలీసు బందోబస్తు కల్పిస్తామని ఎస్పీ షహనావాజ్ ఖాసీం ప్రకటించారు.

జ్వరంతో బాధపడుతున్న జగన్
పులివెందుల: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జ్వరంతో బాధపడుతున్నారు. శుక్రవారం రాత్రి నుంచి జలుబు, జ్వరం బాధపెడుతున్నా ఆయన శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పులివెందులలోని పార్టీ కార్యాలయంలోనే ఉండి కార్యకర్తలు, అభిమానులను పలకరిస్తూ గడిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. సాయంత్రం అనంతపురం జిల్లాలో ఓ పెట్రోలు బంకును ప్రారంభించారు. ఆపై పులివెందుల ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సింహాద్రిపురం మండల పార్టీ యూత్ కన్వీనర్ శివారెడ్డిని పరామర్శించారు. 

రాత్రి 9 గంటల వరకు ప్రజలతో మమేకమై వారి కష్టనష్టాలు తెలుసుకున్నారు. అనారోగ్యం నేపథ్యంలో ధర్మవరంలో చేనేత దీక్ష గురించి అభిమానులు ప్రస్తావించగా చేనేత కార్మికుల సంక్షేమం దృష్ట్యా దీక్ష చేసి తీరాలని, చెప్పిన మాట ప్రకారం ఎన్ని కష్టాలు ఎదురైనా దీక్ష చేయాల్సిందేనని జగన్ వారితో చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. శనివారం రాత్రి ప్రముఖ వైద్యులు, జగన్ మామ డాక్టర్ ఇ.సి.గంగిరెడ్డి ఆయనకు వైద్య పరీక్షలు చేశారు.
Share this article :

0 comments: