గ్రామాల్లో మద్యం లేకుండా చేస్తా: జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గ్రామాల్లో మద్యం లేకుండా చేస్తా: జగన్

గ్రామాల్లో మద్యం లేకుండా చేస్తా: జగన్

Written By ysrcongress on Sunday, February 26, 2012 | 2/26/2012

ఓదార్పుయాత్రలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా గొల్లపల్లికి చేరుకున్నారు. గొల్లపల్లిలో గ్రామస్థులు ఏర్పాటు చేసిన మహానేత వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ... వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. గ్రామాల్లో సారా, బ్రాందీ దుకాణాలు లేకుండా చేస్తాను అని అన్నారు. సారా, బ్రాందీల వల్ల కుటుంబాలు సర్వ నాశనమవుతున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ్ముడు అధికారంలో ఉండగా మాకేమి ఇబ్బంది అని ప్రజలు అనుకునేలా పాలన ఇస్తానని జగన్ అన్నారు. 

పేదల సంక్షేమాన్ని మరిచి.. రాష్ట్రంలో 20 మంది మంత్రులు, 60 మంది ఎమ్మెల్యేలు సారా వ్యాపారంలో నిమగ్నమైనారన్నారు. ఇంటివద్దకే సారా పంపించే పనిలో ముఖ్యమంత్రి ఉన్నారని జగన్ ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో మద్యంపై వాదనలు భూటకమన్నారు. 

అంతేకాకుండా గ్రామాల్లో పది మంది మహిళా పోలీసులను నియమిస్తానని అన్నారు. ప్రతి ఇంటిలో పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు అయితేనే.. పేదరికం పోతుందన్నారు. జగన్ రాకతో గొల్లపల్లి జనసముద్రంగా మారింది.
Share this article :

0 comments: