తెరవెనుక హైడ్రామా నడిపిన కాంగ్రెస్, టీడీపీ. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెరవెనుక హైడ్రామా నడిపిన కాంగ్రెస్, టీడీపీ.

తెరవెనుక హైడ్రామా నడిపిన కాంగ్రెస్, టీడీపీ.

Written By ysrcongress on Thursday, February 16, 2012 | 2/16/2012

* భూ కేటాయింపులపై హడావుడిగా సంయుక్త సంఘం
* తెరవెనుక హైడ్రామా నడిపిన కాంగ్రెస్, టీడీపీ..
* అయోమయం మధ్యే ప్రతిపాదన, అంతే వేగంగా ఆమోదం
* ప్రకటనే అనుకున్నామంటూ ఆశ్చర్యపోయిన జూలకంటి
* సంయుక్త సంఘాన్ని ప్రకటించేశారా అంటూ విస్మయం
* సభాసంఘం వేసిన వారానికి మాటమార్చిన విపక్ష నేత
* బడ్జెట్ సమావేశాల ముందురోజు నాటకీయ వ్యాఖ్యలు
* టీడీపీ పార్టీ సభ్యుల పేర్లు, సంఖ్యపై మడతపేచీ

హైదరాబాద్, న్యూస్‌లైన్: భూ కేటాయింపులపై సభాసంఘం విషయంలో టీడీపీ-కాంగ్రెస్ మ్యాచ్‌ఫిక్సింగ్ అసెంబ్లీ సాక్షిగా మరోసారి బట్టబయలైంది. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా, వేసిన సభాసంఘాన్ని రద్దు చేసి, అంతే వేగంగా మరో సంయుక్త సంఘాన్ని వేసిన ప్రహసనానికి బుధవారం శాసనసభ వేదికగా మారింది! రద్దయిన కమిటీ స్థానంలో శాసనసభ, మండలి సభ్యులతో కూడిన సంయుక్త కమిటీ ఏర్పాటుకు సభలో ప్రభుత్వం హడావుడిగా తీర్మానం కూడా ఆమోదించేసింది. రాష్ట్రంలోని అత్యున్నత చట్టసభలో జరిగిన చర్చ మేరకు నియమించిన ఒక సభాసంఘం ఎలాంటి చర్చా లేకుండానే అదే సభలో రద్దు కావడం, దాని స్థానంలో ఉభయసభల సంయుక్త కమిటీకి హఠాత్తుగా తెరలేవడం, సభలో తీవ్ర గందరగోళ వాతావర ణం నెలకొని ఉన్న సమయంలోనే ఆ మేరకు ఉన్నపళంగా తీర్మానం ప్రవేశపెట్టడం, అంతే హడావుడిగా దాన్ని ఆమోదించడం వంటి పరిణామాలు రాజకీయ విశ్లేషకులను తీవ్ర విస్మయానికి గురిచేస్తున్నాయి. 

ఈ సభాసంఘం విషయంలో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై ఏకాభిప్రాయంతో వ్యవహరిస్తున్న వైనం గతంలోనే రుజువు కాగా, బుధవారం నాటి పరిణామంతో అది మరింతగా తేటతెల్లమైంది. భూ కేటాయింపులపై చర్చకు గతేడాది బడ్జెట్ సమావేశాల్లో గతేడాది బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ పట్టుబట్టడం, దానిపై సభాసంఘం వేస్తామంటేనే తాము సభలోకి వచ్చామని చివర్లో చంద్రబాబుచెప్పడం తెలిసిందే. అప్పుడు సభలో సీఎం చేసిన ప్రకటన మేరకు 11 నెలల తర్వాత ఫిబ్రవరి 8న 14 మంది సభ్యులతో శాసనసభా సంఘాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఏర్పాటు చేశారు. టీడీపీ తరఫున పయ్యావుల కేశవ్, అశోక్‌గజపతిరాజుల పేర్లను చేర్చారు. ఐదు రోజుల పాటు మౌనం వహించిన బాబు, తీరా 13న బడ్జెట్ సమావేశాలు మొదలయ్యే ముందు రోజు కమిటీపై నాటకీయంగా వివాదానికి తెర తీశారు. 

టీడీపీ సభ్యుల పేర్లను తమను సంప్రదించి చేర్చలేదని, సంఖ్యాపరంగా కూడా తమవారిని తక్కువ మందిని తీసుకున్నారని మెలిక పెట్టారు. కమిటీని ప్రకటించినప్పుడు మౌనం వహించి, తీరా సమావేశాలప్పుడు దాన్ని బాబు వివాదం చేయడం కాంగ్రెస్‌తో మ్యాచ్‌ఫిక్సింగ్‌లో భాగమేనని తెలుస్తోంది. టీడీపీ కోరితే ఆ పార్టీ నుంచి మరో ఇద్దరిని సంఘంలో చేర్చేందుకు స్పీకర్ సుముఖంగా ఉన్నారని, కానీ అలా చేస్తే ‘మ్యాచ్‌ఫిక్సింగ్’ వాస్తవమేనన్నది తేటతెల్లమవుతుందని బాబు భావించారని చెబుతున్నారు. అందుకే కొత్త కమిటీ కోసం ఆయన డిమాండ్ మొదలు పెట్టారని సమాచారం. ఈ దిశగా కాంగ్రెస్ సహకారంతో మూడు రోజులుగా కొత్త డ్రామాను బాబు, టీడీపీ ఎమ్మెల్యేలు యథాశక్తి రక్తికట్టించారు. అందులో భాగంగానే గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ భేటీని కూడా టీడీపీ బహిష్కరించినట్టు తెలుస్తోంది. మద్యం సిండికేట్లపై చర్చకు పట్టుబడుతూ మూడు రోజులుగా సభా కార్యకలాపాలనూ అడ్డుకుంటోంది. దీనిపై రెండు రోజులుగా స్పీకర్ పిలిచిన ఫ్లోర్ లీడర్ల భేటీకీ గైర్హాజరవుతోంది. 

బుధవారం ఉదయమూ ఇదే సీన్ రిపీటైంది. తొలుత సభ రెండుసార్లు వాయిదా పడడంతో ఫ్లోర్‌లీడర్లను స్పీకర్ తన చాంబర్‌కు పిలిచారు. అందరూ వచ్చినా బాబు మాత్రం రాలేదు. దాంతో జూలకంటి రంగారెడ్డి, గుండా మల్లేశ్, జయప్రకాశ్ నారాయణ్, చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, విప్‌లు బాబు చాంబర్‌కు వెళ్లి మంతనాలు జరిపారు. సభాసంఘంలో టీడీపీ పేర్లను తమ ప్రమేయం లేకుండా ఎలా వేస్తారని, నలుగురికి అవకాశమివ్వాల్సి ఉంటే ఇద్దరినే నియమించడమేమిటని బాబు లా పాయింట్లు లాగారు. నేతలు దీన్ని స్పీకర్ దృష్టికి తేగా, టీడీపీ చెబితేనే వారి పేర్లను చేర్చామని, తమ తప్పేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. కావాలంటే వారు కొత్తగా పేర్లిచ్చినా చేరుస్తామని చెప్పారు.

ఆ తరువాతే టీడీపీ నేతలు ఫ్లోర్‌లీడర్ల భేటీకి వెళ్లారు. తీరా అక్కడ మాత్రం సభాసంఘంపై కాకుండా మద్యం సిండికేట్లను ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగానికి ధ న్యవాద తీర్మానాన్ని పక్కనపెట్టి, గురువారం మధ్యాహ్నమే సిండికేట్లపై చర్చకు పట్టుబట్టారు. అది సంప్రదాయ విరుద్ధమని, కావాలంటే బడ్జెట్‌పై చర్చలో తొలి రోజునే అందుకు అవకాశం ఇస్తామని స్పీకర్ చెప్పినా అంగీకరించలేదు. సభాసంఘంలో తమకూ చోటు కావాలని ఎమ్మెల్సీలు కోరుతున్నారని ఈ సందర్భంగా స్పీకర్ ప్రస్తావించినట్టు తెలిసింది. సంయుక్త కమిటీ వేయాలన్న ప్రతిపాదన ఉందని ఆయన చెప్పారు. అనంతరం అనూహ్యంగా సభలో విపక్షాల తీవ్ర గందరగోళం మధ్యే విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ హడావుడిగా సెజ్‌లకు భూ కేటాయింపులపై సంయుక్త సభాసంఘం ఏర్పాటుకు తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, మూజువాణి ఓటుతో దానికి సభ ఆమోదం లభించినట్టు స్పీకర్ మనోహర్ ప్రకటించడమూ వెంటవెంటనే జరిగిపోయాయి. దాంతో భూ కేటాయింపులపై గతంలో స్పీకర్ నియమించిన శాసనసభాసంఘం రద్దయినట్టయ్యింది. 

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఇలా వేస్తున్న సంయుక్త కమిటీపై ఎలాంటి చర్చా లేకుండానే నేరుగా సభలోనే ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టడంపై విపక్షాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ‘‘స్పీకర్ వద్ద భేటీలో దీని గురించి పైపైన ప్రస్తావించారే తప్ప తీర్మానం గురించి చెప్పలేదు. ప్రభుత్వం ప్రకటన చేసిందనుకున్నామే తప్ప తీర్మానమే ప్రవేశపెట్టిందనుకోలేదు’’ అంటూ సీపీఎం సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ఆశ్చర్యపోయారు. ఇంత ముఖ్యమైన అంశంపై సభలో చర్చ లేకుండానే తీర్మానమెలా పెట్టారో అర్థం కావడం లేదని పలువురు సభ్యులన్నారు. ఇదంతా బాబు-కిరణ్‌ల కుట్రేనంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. 

సంయుక్త సంఘాన్ని ఏర్పాటు చేయించడం, అందులో తమకు అనుకూలమైన సభ్యులను నియమించుకోవడంతో పాటు విధివిధానాలనూ వైఎస్ హయాంకే పరిమితం చేయాలన్న బాబు-కిరణ్ వ్యూహం మేరకే ఇదంతా నడిచిందని చెబుతున్నారు. పైగా, అఖిలపక్షాన్ని పిలిచి, సభాసంఘాన్ని పునర్వ్యవస్థీకరించాలని బాబు డిమాండ్ చేస్తే, ఏకంగా సంయుక్త కమిటీకే కాంగ్రెస్ తెరతీయడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
Share this article :

0 comments: