జగన్ రోడ్డు షోకు భారీగా తరలివచ్చిన జనం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ రోడ్డు షోకు భారీగా తరలివచ్చిన జనం

జగన్ రోడ్డు షోకు భారీగా తరలివచ్చిన జనం

Written By ysrcongress on Monday, February 6, 2012 | 2/06/2012

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఎంపి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ జిల్లాలో రెండోరోజు సోమవారం నిర్వహించిన రోడ్డుషోకు జనం భారీగా తరలివచ్చారు. దారిపొడవునా జననేతకు మహిళలు మంగళహారతులు పట్టారు. కుల, మత, వర్గ రాజకీయాలకతీతంగా జగన్‌కు జనం బ్రహ్మరథం పట్టారు. తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం విశాఖ జిల్లా పాయకరావుపేట చేరుకున్నారు. తొలుత శ్రీపాండురంగస్వామి ఆలయానికి వెళ్లి స్వామిని ద ర్శించుకున్నారు. అనంతరం అరట్లకోట చేరుకున్నారు. గ్రామానికి ముందు జననేతను కలిసిన తమలపాకుల కౌలు రైతులు తమగోడును వెళ్లబోసుకున్నారు. పంట నష్టపరిహారం, బీమా తమకు కాకుండా భూ యజమానులకే అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కష్టనష్టాలను చెప్పుకొన్నారు. అనంతరం గ్రామంలో దాదాపు గంటన్నరకు పైగా జగన్ స్థానికులతోమమేకమయ్యారు. రోడ్డు పొడవునా తనను కలవడానికొచ్చిన మహిళలు, చిన్నారుల నుదుట ముద్దులుపెట్టారు. వీరంతా ఆయన్ను కలవడానికి క్యూలో నిల్చోవడం విశేషం. 

అనంతరం మంగవరం చేరుకున్న జగన్ అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. తర్వాత గోపాలపట్నం మీదుగా సత్యవరం చేరుకుని మహానేత డాక్టర్ వైఎస్ వ్రిగహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో ఏగదాసు ఉమామహేశ్వరరావు కుటుంబాన్ని ఓదార్చారు. ఉమామహేశ్వరరావు వైఎస్ వీరాభిమాని. గత ఏడాది సెప్టెంబరు 2న వైఎస్‌ఆర్ వర్ధంతి సందర్భంగా సత్యవరంలో వైఎస్ విగ్రహానికి నివాళులర్పించేందుకు వచ్చారు. మహానేత వైఎస్ పేరును సీబీఐ అన్యాయంగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిందని వాపోతూ గుండెపోటుతో ఇక్కడే విగ్రహం వద్ద కుప్పకూలి మరణించాడు. ఈయన కుటుంబాన్ని పరామర్శించాక జగన్ పెదరాంభద్రపురం మీదుగా పాయకరావుపేట వె ళ్లారు. అక్కడ స్థానికులతో కాసేపు మాట్లాడారు. ఇక్కడితో విశాఖ పరట్యన ముగించి రాత్రి 9.30కు సామర్లకోటకు బయల్దేరారు. అక్కడి నుంచి రైల్లో గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రకు వెళతారు.
Share this article :

0 comments: