కోవూరులో ‘అధికార’ దుర్వినియోగం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కోవూరులో ‘అధికార’ దుర్వినియోగం

కోవూరులో ‘అధికార’ దుర్వినియోగం

Written By ysrcongress on Wednesday, February 29, 2012 | 2/29/2012


కోవూరు ఉపఎన్నికల్లో అధికార పార్టీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిందని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఓటర్లను మభ్యపెడుతోందని ఆరోపించింది. మంగళవారం వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్దన్, కార్మిక విభాగం కన్వీనర్ జనక్‌ప్రసాద్ తదితరులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను కలసి ఫిర్యాదు చేశారు. అనంతరం బాజిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కోవూరులో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో అడుగడుగునా కోడ్ ఉల్లంఘన జరిగిందని ఆరోపించారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి ప్రవేశించేందుకు కేవలం నలుగురికే అనుమతి ఉన్నా.. మంత్రులు మందీమార్బలంతో యథేచ్ఛగా ఆర్‌వో ఆఫీసుకు వెళ్లారని నిందించారు. ఓటర్లను ప్రలోభపెట్టేలా ఎన్నికల అనంతరం చెరకు రైతులకు బకాయిలు చెల్లిస్తామని ప్రకటనలు చేసిన మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి వైఖరిని కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్లిన ట్లు చెప్పారు.
Share this article :

0 comments: