సభాసంఘం కమిటీ కుట్రపూరితమైంది: జూపూడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సభాసంఘం కమిటీ కుట్రపూరితమైంది: జూపూడి

సభాసంఘం కమిటీ కుట్రపూరితమైంది: జూపూడి

Written By ysrcongress on Thursday, February 9, 2012 | 2/09/2012


 
భూకేటాయింపులపై ‘టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్’ లేకుండా వేసిన శాసనస సభాసంఘం కమిటీ కుట్రపూరితమైందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు దుయ్యబట్టారు. కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కై దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిని ద్రోహి, భూకబ్జాదారుడిగా చిత్రీకరించేందుకు పథకరచన చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని అప్రతిష్టపాలు చేయాలనే కుట్రతో కాంగ్రెస్-టీడీపీలు చేస్తున్న నీచరాజకీయాలను గమనిస్తున్న ప్రజలే తిరగబడతారని అన్నారు. భూకేటాయింపులపై ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ది ఉంటే చంద్రబాబు హయాం 1995 నుంచి ఇప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కేటాయించిన వాటిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎస్సీ సెల్ రాష్ట్రకన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్‌తో కలిసి గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

‘భూ కేటాయింపులపైన లేదా మరే అంశంపైనగానీ సభాసంఘం వేయాలని ప్రతిపక్షం అడిగినప్పుడు అధికారపక్షం అంగీకరించడం అసాధారణమేమీ కాదు. అయితే ప్రభుత్వం చేసిన తప్పులపై సభాసంఘం వేయమని సహజంగా ప్రతిపక్షం అడుగుతుంది. విచిత్రమేమిటంటే అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం రెండూ ఒకే ఎజెండాతో సభాసంఘం వేయడం బహుశా రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటి సారి. వైఎస్‌ను అప్రతిష్టపాలు చేయాలన్న ఏకైక లక్ష్యంతో చంద్రబాబు అడిగిన సభాసంఘాన్ని ఇప్పుడు వేయడంప్రతిపక్షంతో అధికారపక్షం కుమ్మక్కు కాకుండా మరేం అవుతుంది?’అని నిలదీశారు. ప్రస్తుత కేబినేట్ వైఎస్ హయాంలోనూ ఉన్నపుడు సభాసంఘం ద్వారా కొత్త విషయాలు ఏం తెలుసుకుంటారని నిలదీశారు. 

పరిశ్రమలకు జరుగుతున్న భూకేటాయింపులపై విచారణ జరపాలన్న చిత్తుశుద్ది ప్రభుత్వానికి ఉంటే, గతంలో క్విడ్ ప్రో కో లపై శంకర్రావు వేసిన పిల్‌పై ‘మీఅభిప్రాయం చెప్పండి’అని కిరణ్ సర్కారును హైకోర్టు అడిగినా ఎందుకు సమాధానం చెప్పలేదని నిలదీశారు. వైఎస్ మరణించి రెండున్నరేళ్ళ తర్వాత సభాసంఘం వేశారంటే కాంగ్రెస్-టీడీపీ సమిష్టి కుట్ర లేద అని ప్రశ్నించారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో 24 కంపెనీలకు 18వేల ఎకరాలను పప్పుబెల్లాల పంచిపెట్టారని దుయ్యబట్టారు. అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆగమేగాల మీద ఐఎంజీ భారత అనే కంపెనీకి 850 ఎకరాల భూమిని, కేబినేట్ అనుమతి కూడా లేకుండా తన బినామీ బిల్లీరావుకు 400 ఎకరాలను ధారాదత్తం చేశారని వీటన్నింటీని సభాసంఘం కిందకి తేవాలన్నారు. అదేవిధంగా రోశయ్య హయాంలో హైదరాబాద్ నడిబొడ్డులోని వందల కోట్ల విలువచేసే భూములను చంద్ర బాబు సూచనల మేరకు టీడీపీకి చెందిన జీఎన్ నాయుడుకు ధారాదత్తం వాటిని, సీఎం కిరణ్ ఫ్రిజమ్ సిమెంట్స్‌కు కర్నూలులో కారుచౌకగా కేటాయించిన వెయ్యి ఎకరాల భూకేటాయింపును కూడా విచారణ పరిధిలోకి తేవాలని జూపూడి డిమాండ్ చేశారు. 

కుమ్మలాట దష్టిమళ్లించేందుకే...

తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు, కేబినేట్ అంతర్గత కుమ్ములాటల నుంచి దష్టి మళ్లించేందుకే సీఎం కిరణ్ హడావిడిగా సభాసంఘాన్ని తెరపైకి తెచ్చారని జూపూడి ఆరోపించారు. కిరణ్ తన కుర్చీ కాపాడుకోవడానికి టీడీపీతో చేసుకున్న రహస్య ఒప్పందం మేరకే ‘టర్మ్స్ అండ్ రెఫరెన్స్’ లేని సభాసంఘాన్ని వేయించారని అన్నారు. రాష్ట్రంలో పాలన స్తంభించి ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా, సీఎం కిరణ్, ప్రతిపక్షనేత చంద్రబాబుకు ఇవేవి పట్టవని, కేవలం దివంగత వైఎస్‌ను అప్రతిష్టపాలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. వైఎస్‌ను అప్రతిష్టపాలు చేసే క్రమంలో టీడీపీతో కలిసి కిరణ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతిసందర్భంలోనూ ప్రజలు గమనించి వారి తీర్పునిస్తున్నారన్నారు. ఎన్ని సభాసంఘాలను వేసినా వాటన్నింటిని వైఎస్సార్ కాంగ్రెస్ స్వాగతిస్తుందని జూపూడి స్పష్టం చేశారు.
Share this article :

0 comments: