పటిష్టంగా వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పటిష్టంగా వైఎస్సార్ ట్రేడ్ యూనియన్

పటిష్టంగా వైఎస్సార్ ట్రేడ్ యూనియన్

Written By ysrcongress on Sunday, February 19, 2012 | 2/19/2012

సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణే ధ్యేయం
టీడీపీ హయాంలో అనేక పరిశ్రమలను మూసివేయించారు: జనక్‌ప్రసాద్ 

హైదరాబాద్, న్యూస్‌లైన్: కార్మికుల అభ్యున్నతి, సంక్షేమానికి కృషి చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ‘వైఎస్సార్ ట్రేడ్ యూనియన్’ను పటిష్టం పరచేందుకు పార్టీ చర్యలు చేపట్టింది. కార్మిక దినోత్సవమైన మే 1వ తేదీ నాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ట్రేడ్ యూనియన్ శాఖలు ఏర్పాటు చేయాలని పార్టీ భావిస్తోంది. ప్రతి రాజకీయ పార్టీ మనుగడలోనూ కార్మిక శ్రేణుల పాత్ర గణనీయంగా ఉంటుంది. ఈ ప్రాధాన్యతను గుర్తించిన వైఎస్సార్ కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఇటీవలే ‘వైఎస్సార్ ట్రేడ్ యూనియన్’ పేరుతో కార్మిక సంఘం ఏర్పాటు చేసింది. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్మిక విభాగానికి పి.జనక్‌ప్రసాద్‌ను కన్వీనర్‌గా నియమించారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్రంలోని సంఘటిత, అసంఘటిత రంగాల్లోని కార్మికుల సంక్షేమం, అభ్యున్నతి, వారి హక్కుల సాధనపై దృష్టిని సారించబోతున్నది. 

రాష్ట్రంలో సింగరేణి కాలరీస్, రోడ్డు రవాణా సంస్థ, విద్యుత్ సంస్థలతో పాటు వైద్య, ఆరోగ్య శాఖలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఉన్నారు. ప్రైవేటు రంగంలో కూడా అసంఖ్యాకంగా కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు. వీరందరి హక్కుల పరిరక్షణతో పాటుగా వారి జీవన స్థితిగతులను మెరుగు పర్చేందుకు దీటైన ట్రేడ్ యూనియన్‌ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నిర్మాణానికి జరుగుతున్న కృషిని జనక్‌ప్రసాద్ వివరిస్తూ.. ‘‘1995-2004 మధ్య సుమారు దశాబ్ద కాలంపాటు రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ పరిశ్రమలను అప్పటి టీడీపీ ప్రభుత్వం మూసివేయించింది. వేలాది కార్మికులు ఉపాధి కోల్పోయేలా చేసి, వారిని రోడ్డుపాలు చేసింది. అప్పట్లో ఈ రంగానికి, కార్మికులకు జరిగిన నష్టాన్ని పూడ్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ సంకల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని సంఘటిత, అసంఘటిత కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు పార్టీ చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఐదు ప్రధాన విద్యుత్ ఉత్పాదక సంస్థల్లో యూనియన్ శాఖలు ఏర్పాటు చేశాం. ఆర్టీసీలో కూడా యూనియన్ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటివరకు 11 జిల్లాల్లో వైఎస్సార్ టీయూ శాఖలను ఏర్పాటు చేశాం. మే 1 నాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో యూనియన్ పతాకం రెపరెపలాడాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని చెప్పారు.
Share this article :

0 comments: