మంత్రి ఆనంకే కళ్లు తిరిగాయి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మంత్రి ఆనంకే కళ్లు తిరిగాయి

మంత్రి ఆనంకే కళ్లు తిరిగాయి

Written By ysrcongress on Friday, February 17, 2012 | 2/17/2012

అంకెల గారడితో కూడిన రాష్ట్ర బడ్జెట్‌ను చూసి ఆర్థికమంత్రి ఆనం రాంనారాయణరెడ్డికే కళ్లు తిరిగాయని వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి ఎద్దేవా చేశారు. లక్షాయాభై వేల కోట్ల బడ్జెట్‌ను చూసిన మంత్రికి వాస్తవమో, అవాస్తవమో నిర్దారించుకోలేక కళ్లు బైర్లుకమ్మాయన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వైఎస్ ప్రభుత్వం లక్షకోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినందున అంతకంటే ఎక్కువ పెట్టాలనే దురాలోచనతోనే కిరణ్ ప్రభుత్వం చేస్తుంది తప్పితే వారికి చిత్తశుద్దిలేదని విమర్శించారు. బడ్జెట్ అంత పేపర్ మీద అంకెలగారడీ తప్ప వాస్తవానికి పూర్తి విరుద్దంగా ఉందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు చెల్లించకపోవడం వల్ల విద్యార్థుల చదువులు అర్దాంతరంగా ఆగిపోయే పరిస్థితి తలెత్తిందన్నారు. ఈ పథకానికి 8వేల కోట్లు అవసరమవగా కేవలం ’3,600 కోట్లే కేటాయించిందన్నారు. అపరసంజీవనిగా పేరొందిన ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ మరణానంతరం పేదలకు ఒక్క రేషన్ కార్డు మంజూరు చేయలేకపోయారని విమర్శించారు. పన్నులతో ప్రజల నడ్డివిరిచిన కిరణ్ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిదని అమరనాథరెడ్డి దుయ్యబట్టారు.



 

 

Gattu RamaChandraiah Reaction on Budget 2012-13

Share this article :

0 comments: