‘ఈనాడు’ రాతలపై ఉన్నతాధికారుల విస్మయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘ఈనాడు’ రాతలపై ఉన్నతాధికారుల విస్మయం

‘ఈనాడు’ రాతలపై ఉన్నతాధికారుల విస్మయం

Written By ysrcongress on Tuesday, February 7, 2012 | 2/07/2012


రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టటం తప్పా? 
వేలాది మందికి ఉపాధి కల్పించే వాన్‌పిక్ భూసేకరణకు దురుద్దేశాలు అంటగడతారా? 
ఉపాధితో నిమిత్తం లేని ఎమ్మార్ గోల్ఫ్‌కోర్స్ కోసం చంద్రబాబు 535 ఎకరాలు ఇవ్వటం తప్పుకాదా? 
ఆపద్ధర్మ సీఎంగా ఐఎంజీ అనే నకిలీ సంస్థకు బాబు 
850 ఎకరాలు ధారపోస్తే ఎందుకు ప్రశ్నించలేదు? 
ఎల్ అండ్ టీకి ‘హైటెక్ సిటీ’ ఇచ్చినందుకే.. టీడీపీ ఆఫీసును ఉచితంగా కట్టి ఇవ్వటం క్విడ్ ప్రో కో కాదా? 
చంద్రబాబు హయాంలో జరిగితే ఒప్పు.. 
వేరే వారి హయాంలో జరిగితే తప్పుగా కనిపిస్తాయా? 

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘రూపాయికే ఎకరా భూమి ఇస్తాం... రండి పెట్టుబడి పెట్టండి...’ 
అని ఒక రాష్ట్రం స్పెషల్ ఆఫర్! 
‘మా వద్ద సేకరించిన భూమి సిద్ధంగా ఉంది... 
మీరు వస్తే వెంటనే కేటాయిస్తాం...’ అని మరో రాష్ట్రం సూపర్ ఆఫర్!!
‘యూనిట్ ఏర్పాటు చేస్తే మీరు అడిగిన రాయితీలన్నీ ఇస్తాం...’ 
అని ఇంకో రాష్ట్రం బంపర్ ఆఫర్!!!
పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రాల మధ్య నెలకొన్న తీవ్రమైన పోటికి నిదర్శనమిది. ఇంత తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో పరిశ్రమలను ఆకర్షించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అగత్యం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ ఏర్పడింది. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలనటం తప్పు అన్నట్లుగా ‘ఈనాడు’ కథనాలు రాయటం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో వాడరేవు-నిజాంపట్నం పారిశ్రామిక పెట్టుబడి ప్రాంతం (వాన్‌పిక్) కోసం భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారని సీబీఐ అధికారుల విచారణలో ఒక అధికారి చెప్పిన విషయాన్ని ఉటంకిస్తూ సోమవారం నాటి సంచికలో ‘ఈనాడు’ ప్రచురించింది. పారిశ్రామికాభివృద్ధి కోసం, ఉపాధి కల్పన కోసం దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో తీసుకున్న నిర్ణయాలకు దురుద్దేశాలు ఆపాదిస్తున్న రామోజీరావుకు.. ఆయనకు ముందు తొమ్మిదేళ్ల కాలంలో చంద్రబాబునాయుడు ముందూ వెనుకా చూడకుండా.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా.. బినామీ సంస్థలకు సైతం వేలాది ఎకరాలను పప్పుబెల్లాల్లా పంచిపెట్టటం మాత్రం ఎన్నడూ తప్పుగా కనపడదా అని సీనియర్ ఐఏఎస్ అధికారులు విస్తుపోతున్నారు. 

అసలు.. సీబీఐ ఎల్లో మీడియాను అనుసరిస్తోందా..? ఎల్లో మీడియా రాతలకు సీబీఐ సహకరిస్తోందా..? అన్న ప్రశ్నలకు.. కొద్ది రోజులుగా సీబీఐ వ్యవహారశైలి, ఎల్లో మీడియా దుష్ర్పచారాలను గమనిస్తే.. అవుననే సమాధానం వస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎల్లో మీడియా దురుద్దేశపూర్వకంగా కథనాలు ప్రచురించటం, వాటి ఆధారంగా సీబీఐ దర్యాప్తు జరపటం చూస్తేనే ఇది స్పష్టమవుతోందని పేర్కొంటున్నారు. ముందస్తుగా నిర్ణయించుకున్న లక్ష్యం మేరకు ఒకరిని టార్గెట్ చేస్తున్నట్లుగా దర్యాప్తు సాగుతోందనే విషయం తేటతెల్లమవుతోందని చెప్తున్నారు. 

భూసేకరణ తప్పెలా అవుతుంది?

‘‘రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే పక్క రాష్ట్రాలతో పోటీపడి పరిశ్రమలను ఆకర్షించాల్సి ఉంటుంది. పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణ అనివార్యం. పరిశ్రమల ఏర్పాటుకు భూమిని సేకరించటం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడటం, ప్రజల కొనుగోలు శక్తి పెరగటం.. ఈ విధంగా అంతిమంగా లాభపడేది ఆ రాష్ట్ర ప్రజలే. అందుకే భూసేకరణ నోటిఫికేషన్‌లో కూడా ‘ప్రజాప్రయోజనార్థం’ అని స్పష్టంగా పేర్కొంటారు’’ అని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు వివరించారు. ‘‘పది మందికి ఉపాధి కల్పిస్తామని ఎవరైనా ముందుకు వస్తే చాలు.. రండి రండి మేము అనేక రాయితీలు ఇస్తామంటూ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఈ పోటీని ఆసరా చేసుకునే కంపెనీలు రాష్ట్రాల మధ్య పోటీ పెట్టి మరీ ఎక్కువ మొత్తంలో రాయితీలు కొట్టేస్తున్నాయి. సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో ఇది మామూలు వ్యవహారంగా మారిపోయింది. 2004-2009 మధ్య కాలంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అదే చేసింది. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు వీలుగా పరిశ్రమలను ప్రోత్సహించాలని నిర్ణయించింది’’ అని ఆయన పేర్కొన్నారు. 

నాడు బాబు ఉద్దేశాలేమిటి? 

‘‘ఉపాధి కల్పనతో నిమిత్తం లేని ఎమ్మార్ గోల్ఫ్ కోర్స్ ప్రాజెక్టుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఏ ఉద్దేశంతో 535 ఎకరాలు ఇచ్చారు? అప్పుడు ‘ఈనాడు’ ఈ నిర్ణయాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? అప్పుడు నగర శివార్లలో గిరిజనుల నుంచి బలవంతంగా అసైన్‌మెంట్ భూములు వెన క్కి తీసుకుంటుంటే ‘ఈనాడు’కు అయ్యో పాపం అని ఎందుకు అనిపించలేదు? ఆపద్ధర్మ ప్రభుత్వంలో మంత్రివర్గంతో నిమిత్తం లేకుండా ఐఎంజీ అనే నకిలీ సంస్థకు 850 ఎకరాలు కారుచౌకగా కేటాయిస్తుంటే ఇది తప్పు అని ‘ఈనాడు’కు ఆనాడే ఎందుకు అనిపించలేదు? మహబూబ్‌నగర్ జిల్లా పోలేపల్లిలో ఫార్మా ఎస్‌ఈజెడ్ కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరిస్తుంటే ‘ఈనాడు’కు ఆ రైతుల గోస ఎందుకు పట్టలేదు? సెజ్‌ల పేరుతో చంద్రబాబు అడ్డగోలుగా భూ సేకరణ చేస్తుంటే రామోజీరావు ఎందుకు వ్యతిరేకించలేదు? ఎమ్మార్ కోసం భూమి సేకరించినప్పుడు నాటి సీఎం చంద్రబాబే స్వయంగా నాకు ఫోన్ చేసి రోజూ వివరాలు అడిగేవారు. అది తప్పని నేను అనటం లేదు. ఓ పరిశ్రమ వస్తుందని అనుకుంటే, దాని వల్ల కొందరికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయనుకుంటే భూమి సేకరించి ఇస్తారు. మరి రామోజీరావుకు మాత్రం 2004-2009 మధ్య నిర్ణయాలే తప్పుగా ఎందుకు కనిపిస్తున్నాయో మాకు అర్థం కావటం లేదు’’ అని సదరు సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. 

పరిశ్రమల కోసం భూసేకరణ తప్పా? 

వాన్‌పిక్ వల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని ప్రభుత్వం భావించి భూ సేకరణ చేయాలని నిర్ణయిస్తే అది తప్పెలా అవుతుందని అధికారవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. భూసేకరణకు ఆటంకం ఏర్పడితే పరిశ్రమలు తరలివెళ్లిన సందర్భాలూ ఉన్నాయని వారు గుర్తుచేస్తున్నారు. ‘‘భూసేకరణపై పశ్చిమబెంగాల్‌లో సమస్య ఏర్పడినప్పుడు నానో కారు ప్లాంటును ఇతర రాష్ట్రాలకు తరలించాలని టాటా నిర్ణయించింది. ఇందుకోసం మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు పోటీ పడ్డాయి. చేవెళ్లకు సమీపంలో ఇస్తామన్న భూమిని చూసేందుకు టాటా ప్రతినిధులు వచ్చారు. అప్పుడు టీడీపీ స్థానిక నాయకులు గొడవ చేయటంతో ఆ ప్లాంటు కాస్తా గుజరాత్‌కు తరలివెళ్లింది’’ అని ఓ ఐఏఎస్ అధికారి ఉదహరించారు. ‘‘నానో కారు ప్లాంటును తమ రాష్ట్రానికి తీసుకెళ్లేందుకు నరేంద్రమోడీ ప్రత్యేక శ్రద్ధ చూపారు. అంటే ఆయనకు దురుద్దేశాలు ఆపాదించటం న్యాయమా?’’ అని ఆ అధికారి ప్రశ్నించారు. ‘‘ఒకవేళ భూసేకరణే తప్పు అయితే 1995-2004 మధ్య కాలంలో జరిగిన అన్ని భూ కేటాయింపులూ తప్పే అవుతాయి కదా!’’ అని మరో ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. 

బాబు చేస్తే ఒప్పు... ఇతరులు చేస్తే తప్పు!

వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు.. పారిశ్రామిక రంగం వైపు దృష్టి మరల్చాల్సిన అవసరం ఉందనీ పేర్కొన్న విషయాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ‘‘ఇందుకోసం వేల ఎకరాల భూమిని ఆయన హయాంలో సేకరించారు. అయితే.. ఇవన్నీ ‘ఈనాడు’కు తప్పుగా కనిపించవు. బాబు ఆలోచనల వెనుక దురుద్దేశాలేవీ కనిపించకపోవటం ఎల్లో మీడియా వక్రదృష్టికి నిదర్శనం. ఎల్ అండ్ టీ సంస్థకు హైటెక్ సిటీ నిర్మాణానికి 80 ఎకరాలను సేకరించి ఇచ్చినందుకు.. టీడీపీ ఆఫీసును ఉచితంగా నిర్మించి ఇచ్చారు. ఇది మాత్రం ‘ఈనాడు’కు క్విడ్ ప్రో కోగా కనిపించదు. అయితే.. ‘సాక్షి’లో వాన్‌పిక్ పెట్టుబడులు పెట్టింది కాబట్టే.. భూసేకరణ వేగంగా జరిగిందని వ్యాఖ్యానించటం ‘ఈనాడు’కే చెల్లింది’’ అని విమర్శిస్తున్నారు. 

బాబు భూసంతర్పణలివీ... 
కంపెనీ పేరు ఎకరాలు
రహేజా 109
వైజాగ్ ఫార్మా సిటీ 2,143
అగాఖాన్ ఫౌండేషన్ 100
కేటలిస్ట్ సాఫ్ట్‌వేర్ 50
ఇన్ఫోసిస్ 50
మైక్రోసాఫ్ట్ 42
విప్రో 30
కంప్యూటర్ అసోసియేట్స్ 30
హైటెక్ సిటీ 80
ఐవీఆర్‌సీఎల్ 50
ఐటీ పార్క్ మణికొండ 49
మహేశ్వరం హార్డ్‌వేర్ పార్క్ 18
మాదాపూర్ ఐటీ పార్కు 09
ఐఎంజీ భారత్ 850
శంషాబాద్ విమానాశ్రయం 5,500
గంగవరం పోర్టు 1,800
కాకినాడ పోర్టు 354
కష్ణపట్నం పోర్టు 2,000
మలేసియా టౌన్‌షిప్ 35
సింగపూర్ టౌన్‌షిప్ 80
డాబర్ 1,000
ఓరియంట్ సిమెంట్స్ 820
ట్రైమ్యాక్స్-బీచ్‌శాండ్ 1,700
ఎమ్మార్ 535
Share this article :

0 comments: