మంత్రి రామచంద్రయ్యకు కోర్టులో చుక్కెదురు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మంత్రి రామచంద్రయ్యకు కోర్టులో చుక్కెదురు

మంత్రి రామచంద్రయ్యకు కోర్టులో చుక్కెదురు

Written By ysrcongress on Wednesday, February 8, 2012 | 2/08/2012

రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి సి.రామచంద్రయ్యకు రాజంపేట కోర్టులో చుక్కెదురైంది. ఆయనపై విచారణలో ఉన్న కేసును ఉపసంహరించుకుంటూ రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన జీవోను స్థానిక ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ కోర్టు బుధవారం తోసిపుచ్చింది. రాజంపేట పట్టణంలో రోడ్డు విస్తరణకు వ్యతిరేకంగా 2006, మార్చి 6న ఆర్ అండ్ బీ కార్యాలయంలో ఫర్నీచర్ ధ్వంసంతోపాటు, పోలీసు ఉన్నతాధికారి లక్ష్మీరెడ్డిని దూషించినట్లు రామచంద్రయ్యపై కేసు నమోదైంది. ఈ కేసును ఉపసంహరించుకుంటూ రాష్ట్రప్రభుత్వం ఇటీవల జీవో విడుదల చేసింది. ఈ జీవోను కోర్టు రద్దు చేసి, కేసును ఈ నెల 28కి వాయిదా వేసింది.
Share this article :

1 comments:

Laxminarayana Paladi said...

I was all the while telling that, in the present circumstances, only the judiciary has to come to the rescue of the people of AP and India too. Polititicians, of the present, are proving themselves unfit or of no use.
Politicians need to self exam themselves, with some kind of HEART.